breaking news
ramzan toufa
-
రంజాన్ తోఫా లేనట్లే!
సాక్షి, అమరావతి: ముస్లిం మైనార్టీలకు ఈ ఏడాది రంజాన్ కానుక అందేలా లేదు. రంజాన్ తోఫా పేరిట నాలుగేళ్లుగా రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులున్న 11 లక్షల ముస్లిం కుటుంబాలకు ఉచితంగా కొన్ని సరుకులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. పండుగ పూట ఉన్నత వర్గాలతో సమానంగా పేదలు కూడా నెయ్యితో కూడిన పిండి వంటలు తినాలనే ఉద్దేశంతో ఒక్కో కుటుంబానికి 5 కిలోల గోధుమ పిండి, రెండు కిలోల చక్కెర, కిలో సేమియా, 100 గ్రాముల నెయ్యి ప్రకారం ఇప్పటివరకూ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వచ్చే నెల 6వ తేదీన రంజాన్ పండుగ ఉండటంతో ఆలోగా సరుకుల సేకరణ, పంపిణీకి సంబంధించి ఇదివరకే టెండర్లు కూడా పిలిచారు. ఇందులో భాగంగానే 5,500 టన్నుల గోధుమ పిండి, 2,200 టన్నుల చక్కెర, 1,100 టన్నుల సేమియా, 110 కిలోలీటర్ల నెయ్యిని సేకరించి ఒక్కో లబ్దిదారుడికి నిర్ణయించిన ప్రకారం విడివిడిగా ప్రత్యేకంగా ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ రెండు నెలలకు ముందు ప్రారంభిస్తే రంజాన్ పండుగలోపు లబ్దిదారులకు సరుకులు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కనీసం వాటి గురించి ప్రస్తావనే కన్పించడం లేదు. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి పర్మిషన్ తీసుకుంటే బాగుంటుందని పౌరసరఫరాల శాఖలో పని చేస్తున్న కింది స్థాయి సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ నెల 23న చేపట్టనున్న ఎన్నికల కౌంటింగ్ తర్వాత నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందనే విషయమై కూడా పౌరసరఫరాల శాఖ అధికారులు చర్చించారు. రంజాన్ తోఫా సరుకుల సేకరణకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోని విషయమై పౌరసరఫరాల శాఖ కమిషనర్ వరప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా ఇంకా సమయం ఉందని తెలిపారు. -
19 నుంచి రంజాన్‌తోఫా పంపిణీ
– ఈ నెల16 నుంచి 18 వరకు డీలరు పాయింట్లకు సరుకులు చేర్చాలి –జేసీ ఆదేశాలు కర్నూలు(అగ్రికల్చర్): రంజాన్‌తోఫా సరుకులను ఈనెల 19 నుంచి 27వ రకు పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ... ముస్లింలకు సంబంధించి ఇప్పటి వరకు 2.02 లక్షల కార్డులు ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. ఇటీవల జన్మభూమి కార్యక్రమంలో పంపిణీ చేసిన కొత్తకార్డుల్లో ముస్లింల కార్డులను గుర్తించాల్సి ఉందని చెపా్పరు. ఈ ప్రక్రియ 14వ తేదీకి కొలిక్కి వస్తుందని వెల్లడించారు. ఈ నెల 16 నుంచి స్టాక్ పాయింట్ల నుంచి డీలరు పాయింట్‌కు సరుకులు లిప్ట్ చేయాలని సూచించారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి సరుకులు అందే విధంగా చూడాలన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కానుకలు పంపిణీ చేయాలన్నారు. ఆలూరు, పత్తికొండ సీఎస్‌డీటీలకు షోకాజ్ నోటీసులు రంజాన్ తోఫా కానుకల పంపిణీపై నిర్వహించిన సమావేశానికి ఆలూరు, పత్తికొండ సీఎస్డీటీలు గైర్హాజరు కావడంపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరికి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జేసీ డీఎస్ఓను ఆదేశించారు. సమావేశంలో డీఎస్ఓ సుబ్రమణ్యం, జిల్లా పౌరసరఫరాల సంçస్థ మేనేజర్ జయకుమార్, ఏఎస్ఓలు రాజరఘువీర్, వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.