breaking news
Ramzan offer
-
వొడాఫోన్ రంజాన్ ఆఫర్, ఓన్లీ వారికే..
న్యూఢిల్లీ : పండుగొచ్చిదంటే చాలు.. టెలికాం కంపెనీలు కూడా కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులను హోర్రెత్తిస్తుంటాయి. తాజాగా రంజాన్ పవిత్ర మాసాన్ని పురష్కరించుకుని టెలికాం దిగ్గజం వొడాఫోన్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 509 రూపాయలతో ‘రంజాన్ సే ఈద్ ఉల్ జుహా తక్’ అనే రీఛార్జ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్ కింద రోజుకు 1.4జీబీ డేటాను, అపరిమిత కాలింగ్‌ను 90 రోజుల పాటు ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం కర్ణాటకకు మాత్రమే అందుబాటులో ఉంది. రంజాన్ మాసం ప్రారంభమైనప్పటి నుంచి అంటే 2018 మే 16 నుంచి ఆగస్టులో ఈద్ ఉల్ జుహా వరకు కర్ణాటకలోని వొడాఫోన్ కస్టమర్లు అపరిమిత ఉచిత కాలింగ్, రోజుకు 1.4జీబీ డేటాను పొందవచ్చని వొడాఫోన్ ఓ ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా కస్టమర్లు వొడాఫోన్ ప్లే యాప్ డౌన్లోడ్ చేసుకుని, మక్కా అండ్ మదీనా లైవ్‌లను వీక్షించవచ్చని తెలిపింది. 509 రూపాయల ప్లాన్‌తో పాటు, వొడాఫోన్ 569 రూపాయలతో, 511 రూపాయలతో మరో రెండు ప్లాన్లను కూడా లాంచ్ చేసింది. 569 రూపాయల ప్లాన్ కింద రోజుకు 3జీబీ డేటా, అపరిమిత కాల్స్‌ను 84 రోజుల పాటు పొందవచ్చని వొడాఫోన్ పేర్కొంది. అదేవిధంగా 511 రూపాయల ప్లాన్ కింద రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌ను 84 రోజుల పాటు అందించనున్నామని చెప్పింది. -
మనీగ్రామ్ రంజాన్ ఆఫర్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నగదు బదిలీ సేవల రంగంలో ఉన్న మనీగ్రామ్.. రంజాన్ ఆఫర్‌ను ప్రకటించింది. బాలీవుడ్ నటుడు జావెద్ జాఫ్రీ శుక్రవారమిక్కడ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. జూన్ 6 నుంచి మొదలై రంజాన్ నెల పూర్తి అయ్యే వరకు ఈ ఆఫర్ ఉంటుంది. ప్రథమ బహుమతి కింద ఇద్దరు వ్యక్తులకు ఉమ్రా (మక్కా) వె ళ్లే అవకాశం లభిస్తుంది. రానుపోను అన్ని ఖర్చులను కంపెనీయే భరిస్తుంది. టెలివిజన్ సెట్స్, స్మార్ట్ఫోన్లు సైతం గెలుపొందవచ్చని కంపెనీ తెలిపింది. ఉచితంగా అంతర్జాతీయ కాల్స్ చేసుకునే అవకాశమూ ఉంది. విదేశాల నుంచి మనీగ్రామ్ ద్వారా నగదును స్వీకరించే కస్టమర్లు ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హులు. తెలంగాణ, బిహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో ఈ క్యాంపెయిన్‌ను కంపెనీ నిర్వహిస్తోంది.