breaking news
raju vanapala
-
ఈ-కామర్స్‌లోకి వే2 ఆన్లైన్
జూలైకల్లా కొత్త విభాగంలోకి... సంస్థ వ్యవస్థాపకులు రాజు వనపాల హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వే2 పేరుతో ఉచిత ఎస్ఎంఎస్ సేవలందిస్తున్న వే2 ఆన్లైన్ ఇంటెరాక్టివ్ ఇండియా ఈ-కామర్స్ విభాగంలోకి ప్రవేశిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ ఇటీవలే ఉచిత సంక్షిప్త వార్తల సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. జూలైకల్లా ఈ-కామర్స్ రంగంలో అడుగుపెడతామని సంస్థ వ్యవస్థాపకులు రాజు వనపాల సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. ఇందుకు మార్కెట్ ప్లేస్ విధానాన్ని ఎంచుకుంటామని చెప్పారు. వే2కు వున్న 5 కోట్లకుపైగా ఉన్న కస్టమర్లే తమకున్న బలమని ఆయన అన్నారు. ‘కస్టమర్ల తీరును గమనించాం. వారి అవసరాలు మాకు తెలుసు. అందుకే ఈ-కామర్స్‌లో విస్తరిస్తాం. నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండి, అధిక ప్రతిఫలం ఇచ్చే విధానాన్ని ఎంచుకుంటాం. ఎటువంటి భాగస్వామ్యం లేకుండా ఒంటరిగా రంగంలో దిగుతాం’ అని చెప్పారు. రోజుకు 15,000 డౌన్లోడ్స్..: వే2 డౌన్లోడ్స్ ప్రతిరోజు 15,000 పైగా నమోదవుతున్నాయని రాజు తెలిపారు. ‘ఇప్పటి వరకు 50 లక్షలకుపైగా యాప్ డౌన్లోడ్స్ అయ్యాయి. 4 కోట్ల మంది వెబ్ యూజర్లున్నారు. అనుబంధ కంపెనీ అయిన 160బై2 కస్టమర్ల సంఖ్య 1.5 కోట్లకుపైమాటే. మొత్తం యూజర్లలో తెలుగువారు 17 శాతమున్నారు. వే2 ఆన్లైన్లో 200 మందికిపైగా విధులు నిర్వర్తిస్తున్నారు. వే2 కోసం రూ.13 కోట్లకుపైగా వెచ్చించాం’ అని తెలిపారు. 1,000 పైగా బ్రాండ్లతో వే2ఆన్లైన్ ఇంటెరాక్టివ్ ఇండియాకు భాగస్వామ్యం ఉంది. ఈ బ్రాండ్ల ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేయడం ద్వారా కంపెనీకి ఆదాయం సమకూరుతోంది. దేశంలో టాప్-50 సైట్లలో వే2 ఒకటి. యూజర్లు నమోదు చేసిన 50 కోట్లకుపైగా మొబైల్ నంబర్లు కంపెనీ అడ్రస్ బుక్‌లో నిక్షిప్తమై ఉన్నాయి. -
వే టూ ఎస్ఎంఎస్ ఇక వే2...
-
వే టూ ఎస్ఎంఎస్ ఇక వే2...
హైదరాబాద్ : ఇప్పటివరకు నెట్లో ఉచిత ఎస్ఎంఎస్ సేవలందించిన వేటూ ఎస్ఎంఎస్ డాట్‌కమ్ (way2sms.com) ఇపుడు వే2గా మారింది. దాదాపుగా 2 మిలియన్ల పెట్టుబడితో ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడంతోపాటు ఎనిమిది భారతీయ భాషలలో ఉచిత ఎస్ఎంఎస్లు,న్యూస్ కంటెంట్‌ను అందించనున్నట్లు సంస్ధ సీఈవో రాజు వనపాల తెలిపారు. దీనికి సంబంధించి కొంత మంది కంటెంట్ రైటర్స్‌ని కూడా నియామకం చేసుకున్నామని ఆయన తెలిపారు. వినియోగదారులకు యాడ్స్ చికాకు ఉండకుండా ఎస్ఎంఎస్ సేవలును మరింత పటిష్ట పరుస్తున్నట్లు సీఈవో రాజు వనపాల అన్నారు. 5 మిలియన్ యూజర్లు ఈ యాప్‌ను వాడుతున్నారని వీటి సంఖ్యను భారీగా పెంచుకోనున్నట్లు ఆయన తెలియచేశారు.