Rajeev highway
-
బైక్‌ను ఢీకొట్టిన లారీ: ఒకరి మృతి
కరీంనగర్ జిల్లా: రేణికుంట బ్రిడ్జి సమీపంలో రాజీవ్ రహదారిపై బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఓ బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో బైక్‌లో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనతో ఆ మార్గంలో ఒక కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎస్సారెస్పీ నీటి కోసం ఆందోళన
బస్సు అద్దాలు ధ్వంసం చేసిన ఆందోళనకారులు రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు ఫర్నీచర్ ధ్వంసం సుల్తానాబాద్ : ఎస్సారెస్పీ నీటిని వదలాలని కోరుతూ సుల్తానాబాద్ రాజీవ్ రహదారిపై గురువారం టీడీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. వీరి రాస్తారోకోతో రాజీవ్‌రహదారిపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సు అద్దాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేయడంతో డ్రైవర్ సంపత్‌కు గాయమైంది. సీఎం కేసీఆర్, మంత్రులు, కేటీఆర్, హరీష్‌రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సారెస్పీ ఈఈ కార్యాలయంలోకి చొరబడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. సీఈ శంకర్‌తో విజయరమణారావు ఫోన్లో మాట్లాడగా రెండు రోజుల్లో పూర్తిస్థాయి నీటి మట్టం వదిలిపెడతామని, మూడు రోజులు అదనంగా ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యాలయ ధ్వంసంపై ఇన్చార్జి ఎస్ఈ, స్థానిక ఈఈ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు మాట్లాడుతూ వారబంధీ ద్వారా విడుదల చేస్తామన్న అధికారుల మాటలు, చేతలకు పొంతన లేదన్నారు. డీ86, డీ84, డీ83 కెనాల్లకు 6వేల క్యూసెక్కులు వదిలితేనే కాల్వశ్రీరాంపూర్, గుంపులకు నీరు చేరుతాయని కానీ 600 నుంచి 700 క్యూసెక్కుల వదిలితే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటికే 70వేల ఎకరాల్లో పంట ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనలో కేడీసీసీ జిల్లా డైరెక్టర్ కల్లెపల్లి జాని, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్, అధికార ప్రతినిధి అమిరిశెట్టి తిరుపతి, కిశోర్, అబ్బయ్యగౌడ్, గణేష్, సతీశ్‌రెడ్డి, సతీశ్, మాజీ ఎంపీపీ గంట రాములు, పార్టీ మండలాధ్యక్షుడు శంకర్, రాజేశ్వర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, బొడ్డుపల్లి శ్రీను, రాయమల్లు, నారాయణరెడ్డి, బైరి రవి, చందు, తిరుపతిగౌడ్, గట్టు యాదవ్, చక్రధర్, రాజలింగు పాల్గొన్నారు. -
మల్లన్న నిర్వాసితులపై లాఠీ
-
నిర్వాసితులపై లాఠీ
► ఉద్రిక్తతకు దారితీసిన మల్లన్నసాగర్ నిర్వాసితుల ఆందోళన ► రాజీవ్ రహదారి దిగ్బంధనానికి కదిలిన పల్లెపహాడ్, ఎర్రవల్లి ప్రజలు ► మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు.. ఇరుపక్షాల మధ్య తోపులాట ► పరిస్థితి చేయిదాటడంతో లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు ► గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు.. భయంతో పరుగులు తీసిన ► ఆందోళనకారులు.. పోలీసులపైకి రాళ్లు ► గాయపడ్డ నిరసనకారులు, పోలీసులు ► లాఠీచార్జికి నిరసనగా నేడు మెదక్ బంద్‌కు ప్రతిపక్షాల పిలుపు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/తొగుట/గజ్వేల్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు తలపెట్టిన రాజీవ్ రహదారి దిగ్బంధం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల లాఠీచార్జి, నిర్వాసితుల ఆగ్రహావేశాలతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు లాఠీలతో విరుచుకుపడటం, గాల్లోకి కాల్పులు జరపడంతో మెదక్ జిల్లా పల్లెపహాడ్, ఎర్రవల్లి గ్రామాల్లో భయానక పరిస్థితి ఏర్పడింది. ఇందులో అటు నిర్వాసితులు, ఇటు పోలీసులు గాయాలపాలయ్యారు. అసలేం జరిగింది?: ఆదివారం ముంపు గ్రామాల ప్రజలు రాజీవ్ రహదారి దిగ్బంధనానికి పిలుపునిచ్చారు. దీంతో వేములఘాట్ నుంచి పల్లెపహాడ్ చౌరస్తా, ఎర్రవల్లి మీదుగా కుకునూర్‌పల్లిలోని మంగోల్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై ధర్నా చేసేందుకు రైతులు, మహిళలు భారీగా కదిలారు. ర్యాలీ పల్లెపహాడ్ సబ్‌స్టేషన్ వద్దకు చేరుకోగానే సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాసితులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు లాఠీ చార్జికి దిగారు. అనుకోని ఘటనతో మహిళలు భయంతో సమీప పంట పొలాల్లోకి పరుగులు పెట్టారు. అయినా నిర్వాసితులు బెదరకుండా ఎర్రవల్లి వైపు వచ్చారు. దీంతో డీఎస్పీ మరింత మంది పోలీసు బలగాలతో అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో వేములఘాట్ గ్రామస్తులకు ఎర్రవల్లి నిర్వాసితుల మద్దతు తోడైంది. పోలీసులకు, ఆందోళనకారులకు మరోసారి తోపులాట జరిగింది. పోలీసులు మళ్లీ దొరికిన వారిని దొరికినట్టు బాదారు. కొందరు భయంతో ఇళ్లల్లోకి వెళ్లగా బయటికి ఈడ్చుకొచ్చి కొట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. సుమారు 30 నిమిషాల తర్వాత పరిస్థితి కాస్త సద్దుమణిగింది. ఆ తర్వాత నిర్వాసితులు మళ్లీ పోగయ్యారు. ‘ఊర్లపై పడి భయపెడతారా..’ అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇరుపక్షాల మధ్య మరోసారి తోపులాట జరగడంతో పోలీసులు మళ్లీ లాఠీచార్జి జరిపారు. వేములఘాట్, ఎర్రవల్లికి చెందిన మహిళలు, రైతులు చాలామంది గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం గజ్వేల్, సిద్దిపేట ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో కుకునూర్‌పల్లి ఎస్ఐ రామకృష్ణారెడ్డి, కానిస్టేబుల్ రమేశ్ గాయపడ్డారు.