breaking news
RAC berths
-
ఇక ఎవరి దుప్పటి వారిదే
సాక్షి, హైదరాబాద్: ఏసీ కోచ్ ఆర్ఏసీ బెర్తుల్లో కొనసాగుతున్న దుప్పట్ల గొడవకు రైల్వే తెర దించింది. ఇంతకాలం ఈ బెర్తుల్లో ఇద్దరేసి చొప్పున ఉండే ప్రయాణికులకు ఒకే బెడ్‌రోల్ సరఫరా చేస్తున్న విధానాన్ని సరిదిద్దింది. ఇక నుంచి ఆ బెర్తులోని ఇద్దరు ప్రయాణికులకు వేర్వేరు బెడ్‌రోల్స్ అందించాలని నిర్ణయించింది. ఈమేరకు అన్ని జోన్లకు రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. అంటే, ఇక ఆర్ఏసీ ప్రయాణికులకు ఎవరి బెడ్ రోల్ వారికి చేరుతుంది. ఏసీ కోచ్‌లలో ప్రతి ప్రయాణికుడికి రైల్వే ఓ బెడ్‌రోల్ కిట్ అందిస్తుంది. ఇందులో ఒక దుప్పటి, రెండు బెడ్షిట్లు, ఒక పిల్లో, ఒక ఫేస్ టవల్ ఉంటాయి. వీటిని ఏరోజుకారోజు ఉతికి (ఉలెన్ దుప్పటి మినహా) కాగితపు కవర్లో ఉంచి అందిస్తారు. కానీ, ఆర్ఏసీ బెర్తుల్లోనే చిక్కు వస్తోంది. బెర్తుకు ఒక బెడ్‌రోల్ కిట్ ఇవ్వాల్సి ఉన్నందున, ఈ బెర్తుకు కూడా సిబ్బంది ఒకటే కిట్ ఇస్తున్నారు. కానీ, ఇది పూర్తిస్థాయి కన్ఫర్మేషన్ టికెట్ లేని ఇద్దరు ప్రయాణికులు కూర్చుని ప్రయాణించేందుకు ఉద్దేశించిన బెర్తు. ఇద్దరు ప్రయాణికులు ఒక బెర్తును సర్దుకుని పడుకుంటున్నారు. కానీ, ఒకే బెడ్ రోల్ అందుతున్నందున దుప్పటిని చెరిసగం కప్పుకోవాల్సి వస్తోంది. ఒకే పిల్లో ఉంటున్నందున పంపకం కుదరదు. వెరసి, బెడ్‌రోల్స్ విషయంలో ఇద్దరు పరిచయం లేని ప్రయాణికుల మధ్య వివాదానికి కారణమవుతోంది. దీనిపై ఫిర్యాదులు వెల్లు వెత్తగా ఇంతకాలం తర్వాత రైల్వే బోర్డు మేల్కొని రెండు కిట్లు అందించాలని నిర్ణయించింది. లక్షల్లో అదనపు కిట్లు దేశవ్యాప్తంగా నిత్యం 8 లక్షల బెడ్‌రోల్స్‌ను రైల్వే సరఫరా చేస్తోంది. తాజా నిర్ణయంతో మరో లక్షన్నర బెడ్‌రోల్స్ అదనంగా అవసరమవుతాయని అంచనా. వీటి నిర్వహణకు సాలీనా రూ.200 కోట్ల వరకు అదనపు వ్యయం చేయాల్సి ఉంటుందని అంచనా. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నిత్యం 60 వేల వరకు బెడ్‌రోల్స్ వాడుతున్నారు. ఇప్పుడు అదనంగా 10 వేల బెడ్‌రోల్స్ అవసరమవుతాయని లెక్కలేస్తున్నారు. కాగా, గత నాలుగేళ్లలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏడాదికి లక్ష చొప్పున బెడ్‌రోల్స్ మాయమవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. -
ప్రయాణికుడి కేసు.. రైల్వేకు రూ.25 వేల జరిమానా
రైలులో ప్రయాణికులకు అందించాల్సిన బెడ్‌రోల్ విషయంలో రైల్వేకు వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. ఆర్ఏసీ టికెట్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు అపరిచితులకు ఒకే దుప్పటి, దిండు ఇచ్చిన ఘటనలో సేవాలోపం జరిగిందని తేల్చిన ఢిల్లీ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్.. ప్రయాణికుడు పడిన మానసిక వేధన, శారీరక అసౌకర్యానికి రూ.20,000, వ్యాజ్య ఖర్చుల కింద మరో రూ.5,000 మొత్తం రూ.25,000 పరిహారం చెల్లించాలని నార్తెర్న్ రైల్వేను ఆదేశించింది. ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి 60 రోజుల్లోగా రైల్వే ఈ మొత్తాన్ని చెల్లించాలి. గడువులోగా చెల్లించకపోతే, ఉత్తర్వు తేదీ నుంచి మొత్తాన్ని వసూలు చేసే వరకు 7 శాతం వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.అసలేం జరిగింది?2022 అక్టోబర్ 28న ప్రయాగ్‌రాజ్ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఓ ప్రయాణికుడు ఆర్ఏసీ టికెట్ బుక్ చేసుకున్నాడు. రైలులో మరో ప్రయాణికుడితో ఉమ్మడి సీటును పంచుకోవాల్సి వచ్చింది. అయితే.. ఇద్దరికీ కలిపి ఒకటే దుప్పటి, దిండు, రెండు బెడ్షీట్లు మాత్రమే అందించారని అతను కమిషన్‌ను ఆశ్రయించాడు. అపరిచితుడితో ఒకే దుప్పటి పంచుకోవడం వల్ల తీవ్ర అసౌకర్యానికి గురయ్యానని ప్రయాణికుడు విన్నవించాడు. అదనపు దుప్పటి, దిండు ఇవ్వాలని కోచ్ అటెండెంట్‌ను కోరినా స్పందన లేదని తెలిపాడు. రైల్వే అధికారులకు, టీటీఈకి ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నాడు.రైల్వే వాదన ఏంటి?తమ నిబంధనల ప్రకారం ప్రయాణికులకు బెడ్‌రోల్ అందిస్తామని ఉత్తర రైల్వే కమిషన్‌కు తెలిపింది. అదనపు దుప్పటి అవసరం, డిమాండ్, అందుబాటుపై ఆధారపడి ఇవ్వవచ్చని వాదించింది. ఈ ఘటనకు సంబంధించి సంబంధిత రైల్వే అధికారుల పరిధిలో విచారణ జరుగుతోందని పేర్కొంది.అయితే.. బెడ్‌రోల్ అందించే కాంట్రాక్టర్‌పై రూ.1,000 జరిమానా విధించినట్లు రైల్వే అంతర్గత సమాచారంలో వెల్లడైంది. కానీ ఆ చర్యను ఫిర్యాదుదారుడికి తెలియజేయలేదని కమిషన్ గుర్తించింది. అంతేకాకుండా, ప్రయాణికుడికి ప్రత్యేక బెడ్‌రోల్ అందించామని రైల్వే పేర్కొన్నప్పటికీ, దానికి సరైన ఆధారాలను సమర్పించలేకపోయిందని పేర్కొంది.2009 సర్క్యులర్ కీలకంఈ కేసులో 2009 సెప్టెంబర్ 23న జారీ చేసిన ప్రభుత్వ సర్క్యులర్‌ను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. ఆర్ఏసీ ప్రయాణికులకు బెడ్‌రోల్ సదుపాయం కల్పించవచ్చని, బెడ్‌రోల్ ఛార్జీలు ప్రయాణికుల నుంచి వసూలు చేసే ఛార్జీల్లోనే భాగంగా ఉన్నాయని కమిషన్ గమనించింది. అందువల్ల ప్రయాణికుడికి వాగ్దానం చేసిన సదుపాయాన్ని అందించకపోవడం సేవలో లోపం కిందకు వస్తుందని తేల్చింది. ఈ కేసులో ఫిర్యాదుదారుడు ప్రయాగ్‌రాజ్ నుంచి ఢిల్లీకి ప్రయాణించాడని, ఆర్ఏసీ సీటులో అపరిచితుడితో ప్రయాణాన్ని పంచుకున్నాడని ఇరుపక్షాలు అంగీకరించినట్లు కమిషన్ పేర్కొంది. -
ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసా?
భారతదేశంలో రైలు ప్రయాణం అనేది కేవలం ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లే ప్రయాణం మాత్రమే కాదు. అది ఒక ప్రత్యేక అనుభవం కూడా. సందడిగా ఉండే రైల్వే స్టేషన్లు, ప్రకృతి అందాలను చూపించే మార్గాలు, ప్రయాణంలో కలిసే కొత్త వ్యక్తులు ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఇవన్నీ రైలు ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాయి. అయితే.. టికెట్ బుకింగ్ సమయంలో లేదా రిజర్వేషన్ స్టేటస్ చెక్ చేసే సమయంలో కనిపించే కొన్ని రైల్వే పదాలు చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఈ పదాల అర్థం తెలుసుకుంటే మీ ప్రయాణం మరింత సులభంగా.. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సాగుతుంది.ఆర్ఏసీ (RAC)RAC అంటే రిజర్వేషన్ అగెనెస్ట్ క్యాన్సిలేషన్. ఈ స్టేటస్ ఉన్న ప్రయాణికుడికి ఫుల్ బెర్త్ లభించదు. కానీ రైలులో ప్రయాణించవచ్చు. అయితే.. ఒక సీటును ఇద్దరు ఆర్ఏసీ ప్రయాణికులు పంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళా ఇతర ప్రయాణికులు తమ టికెట్లు రద్దు చేసుకుంటే, అలాంటి సందర్భంలో ఆర్ఏసీ టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉండటానికి బదులుగా ఆర్ఏసీ మంచి ఎంపికగా భావిస్తారు.జీఎన్డబ్ల్యుఎల్ (GNWL)GNWL అంటే జనరల్ వెయిటింగ్ లిస్ట్. ఇది రైలు ప్రారంభమయ్యే స్టేషన్ నుంచి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు సాధారణంగా కనిపించే వెయిటింగ్ లిస్ట్ రకం. ఇతర వెయిటింగ్ లిస్ట్‌లతో పోలిస్తే GNWL టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముందుగా టికెట్ బుక్ చేస్తే కన్ఫర్మేషన్ అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి.టీక్యూడబ్ల్యుఎల్ (TQWL)TQWL అంటే తత్కాల్ కోటా వెయిటింగ్ లిస్ట్. తత్కాల్ పద్ధతిలో టికెట్ బుక్ చేసినప్పుడు సీటు దొరకకపోతే ఈ స్టేటస్ వస్తుంది. తత్కాల్ కోటాలో సీట్లు పరిమితంగా ఉండటంతో, TQWL టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు GNWL కంటే తక్కువగా ఉంటాయి. ప్రయాణం ప్రారంభమయ్యే వరకు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే అది ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది. అయితే మీ డబ్బు రీఫండ్ అవుతుంది.యూటీఎస్ (UTS)UTS అంటే అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్. ఇది రిజర్వేషన్ అవసరం లేని ప్రయాణాల కోసం ఉపయోగించే టికెట్ విధానం. సాధారణంగా చిన్న దూర ప్రయాణాలు లేదా రోజువారీ ప్రయాణాలకు ఇది ఉపయోగపడుతుంది. UTS టికెట్లను కౌంటర్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా పొందవచ్చు. రద్దీ సమయాల్లో ఈ కోచ్‌లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతాయి, కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది.ఈ-క్యాటరింగ్ఈ-క్యాటరింగ్ అనేది ప్రయాణికులు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి, ప్రయాణ సమయంలో దానిని తమ సీటు వద్దకే తెప్పించుకునేందుకు వీలు కల్పించే ఒక సర్వీస్. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా వివిధ రెస్టారెంట్ల నుంచి భోజనాన్ని సెలక్ట్ చేసుకుని, రైలు ప్రయాణ సమయంలో స్టేషన్ వద్ద మీరున్న చోటుకే డెలివరీ పొందవచ్చు. లాంగ్ జర్నీ సమయంలో తాజా, రుచికరమైన ఆహారం (ప్రాంతీయ వంటకాలు) రుచి చూడవచ్చు.ఎల్‌హెచ్‌బీ కోచ్‌లుLHB అంటే లింకే హోఫ్మాన్ బుష్. ఇవి ఆధునిక సాంకేతికతతో రూపొందించిన రైల్వే కోచ్‌లు. పాత ఐసీఎఫ్ కోచ్‌లతో పోలిస్తే ఇవి చాలా సురక్షితమైనవి. ప్రయాణ సమయంలో తక్కువ కుదుపులు ఉండటం వల్ల ప్రయాణికులకు మెరుగైన అనుభవం లభిస్తుంది. ప్రస్తుతం రాజధాని, శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లలో ప్రధానంగా LHB కోచ్‌లను ఉపయోగిస్తున్నారు.వికల్ప్ పథకంవికల్ప్ పథకం అనేది వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రైలులో ప్రయాణించే అవకాశం కల్పించే ప్రత్యేక సదుపాయం. మీ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే, అదే మార్గంలో వెళ్లే మరో రైలులో సీటు కేటాయించే అవకాశం ఉంటుంది. ఈ సేవ పూర్తిగా ఉచితం. ముఖ్యంగా పండుగల సమయంలో లేదా అధిక రద్దీ ఉన్న రోజుల్లో ఇది ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుంది.భారతీయ రైల్వేలో ఉపయోగించే ఈ ముఖ్యమైన పదాల అర్థం తెలుసుకోవడం వల్ల టికెట్ బుకింగ్ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. RAC, GNWL, TQWL వంటి స్టేటస్‌ల అర్థం తెలిసి ఉంటే మీ టికెట్ పరిస్థితిని సులభంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే UTS, E-Catering, LHB కోచ్‌లు, వికల్ప్ పథకం వంటి సదుపాయాల గురించి అవగాహన ఉండటం వల్ల మీ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. కాబట్టి ప్రతి రైలు ప్రయాణికుడు ఈ పదాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: రతన్ టాటా స్వయంగా మెయిల్ చేశారు!.. కానీ.. -
ఆర్ఏసీ.. ఉండదిక వెయిట్ అండ్ సీ
సాక్షి, అమరావతి: రైళ్లలో రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైన తరువాత ఆర్ఏసీ (రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సిలేషన్) జాబితాలో ఉన్న ప్రయాణికులకు బెర్త్‌లను పారదర్శకంగా కేటాయించేందుకు, కొందరు టీసీల అవినీతికి చెక్ పెట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం రైల్వే టీసీలకు ‘హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్ (హెచ్‌హెచ్‌టీ)’ ట్యాబ్‌లు అందించాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా విజయవాడ డివిజన్ పరిధిలోని 16 రైళ్లలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టి.. టీసీలకు హెచ్‌హెచ్‌టీ ట్యాబ్‌లను అందించింది. ఆ రైళ్లలో రిజర్వేషన్ రద్దు, ఆర్ఏసీ జాబితాలో ఉన్నవారికి బెర్త్‌ల కేటాయింపు పక్కాగా చేసేందుకు మార్గం సుగమమైంది. సాధారణంగా టికెట్ రిజర్వ్ చేసుకున్న రైలు ప్రయాణికులకు ఆర్ఏసీ వస్తే ఒకటే కంగారు పుడుతుంది. ఎవరు రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకున్నారో.. ఆ బెర్త్ ఎవరికి కేటాయిస్తారో కూడా తెలీదు. దాంతో రైల్వే స్టేషన్లో అడుగుపెట్టిన క్షణం నుంచీ బెర్త్ కన్ఫర్మేషన్ కోసం టీసీ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. టీసీ ప్లాట్‌ఫామ్ మీద ఉన్నా.. రైలులో ఉన్నా ఆయన వెంటపడుతూనే ఉంటారు. అయితే.. ఎందరు రిజర్వేషన్లు రద్దు చేసుకున్నారో.. వాటిని ఎవరికి ఏ ప్రాతిపదికన కేటాయిస్తున్నారో కూడా ఎవరికీ తెలీదు. ఈ విషయంలో రైల్వే కార్యాలయాల్లో ఉండే ఉన్నతాధికారులకు సైతం నిర్దిష్టమైన సమాచారం ఉండదు. దానివల్ల వాటి కేటాయింపు అంతా టీసీల ఇష్టం మీద ఆధారపడి ఉంటోంది. కొందరు టీసీలు ప్రయాణికుల నుంచి డబ్బులు తీసుకుని ప్రాధాన్యత క్రమంలో లేని వారికి కూడా బెర్త్‌లు కేటాయిస్తూ ఉంటారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయడానికే హెచ్‌హెచ్‌టీ ట్యాబ్‌లను ప్రవేశపెట్టాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. త్వరలో మరిన్ని రైళ్లలో.. గతంలో రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లలోని టీసీలకు ఈ ట్యాబ్‌లను అందించారు. తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 16 రైళ్లలో టీసీలకు వీటిని అందించారు. రెండువైపులా తిరిగే 3 దురంతో ఎక్స్‌ప్రెస్‌లు (సికింద్రాబాద్–విశాఖ, సికింద్రాబాద్–నిజాముద్దీన్, సికింద్రాబాద్–లోకమాన్య తిలక్ టెర్మినల్), 5 సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు (శాతవాహన, పినాకిని, రత్నాచల్, కాగజ్ నగర్, విజయవాడ ఇంటర్ సిటీ)లలో వీటిని ప్రవేశపెట్టారు. త్వరలో మరిన్ని రైళ్లలోని టీసీలకూ హెచ్‌హెచ్‌టీ ట్యాబ్‌లను అందించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. పారదర్శకత కోసమే.. ► ఈ హెచ్‌హెచ్‌టీ ట్యాబ్‌లతో టీసీలు బెర్త్‌ల కేటాయింపును పరిశీలిస్తారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు వస్తే ఆ ట్యాబ్‌లోనే టిక్ పెడతారు. ఆ వివరాలన్నీ రైల్వే జోనల్, డివిజనల్ కార్యాలయాలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ► రిజర్వేషన్ రద్దు చేసుకున్న వివరాలు కూడా ఆ ట్యాబ్‌లలో అందుబాటులో ఉంటాయి. ► రద్దు చేసుకున్న బెర్త్‌లను ఆర్ఏసీలో వరుస క్రమంలో ఉన్నవారికే కేటాయించాలి. ఆ వెంటనే ట్యాబ్‌లో టిక్ పెట్టాలి. ► ఎవరైనా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే జోనల్, డివిజనల్ కార్యాలయాల్లోని ఉన్నతాధికారులు ఆన్లైన్ ద్వారా గుర్తిస్తారు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటారు. ► ఈ విధానంతో బెర్త్‌ల కేటాయింపు పూర్తి పారదర్శకంగా సాగుతుంది. ఎక్కడా లంచాలకు.. ఇతర అక్రమాలకు అవకాశం ఉండదు. ► రిజర్వేషన్ బోగీలలో అనధికారికంగా ఎవరూ ప్రయాణించడానికి అవకాశం ఉండదు. ఎవరూ ఎలాంటి సాకులు చెప్పేందుకు కూడా వీలుండదు. ► ఆర్పీఎఫ్ సిబ్బంది తరచూ తనిఖీలు చేస్తూ రిజర్వేషన్ బోగీలలో అనధికారికంగా ఉన్నవారిపై చర్యలు తీసుకుంటారు. -
రైలు ఆర్ఏసీ బెర్తుల పెంపు
న్యూఢిల్లీ: మరింత మంది ప్రయాణికులకు స్లీపర్ తరగతిలో చోటు కల్పించేలా రైల్వే శాఖ ఆర్ఏసీ బెర్తుల సంఖ్యను పెంచింది. ఈ నిర్ణయం జనవరి 16 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం స్లీపర్ బోగీల్లో ఉన్న 5 ఆర్ఏసీ బెర్తులను 7కు పెంచారు. దీని వల్ల 10 మందికి బదులు 14 మందికి స్థానం దొరుకుతుంది. 3 ఏసీ కోచ్‌లలో ప్రస్తుతం ఉన్న 2 ఆర్ఏసీ బెర్తులను 8 మందికి చోటు కల్పించేలా 4కు పెంచారు. 2 ఏసీ కోచ్‌లలో ఈ బెర్తులను 2 నుంచి 3కు పెంచారు. దీంతో ఆరుగురికి స్థానం లభిస్తుంది. ఆర్ఏసీ టికెట్‌దారునికి సీటు ఖరారైనా రాత్రి పడుకునేందుకు అవసరమైన బెర్తు నిరీక్షణ జాబితాలో ఉంటుంది. రిజర్వేషన్ టికెట్ కొనుగోలుదారులు సమయానికి రైలెక్కకపోయినా, రద్దు చేసుకున్నా వారి బెర్తును ఆర్ఏసీ టికెట్ కొనుగోలుదారులకు కేటాయిస్తారు. ఇద్దరికి ఆర్ఏసీ టికెట్లుంటే బెర్తును రెండు సీట్లుగా విభజిస్తారు.


