breaking news
quits TDP
-
టీడీపీకి బన్నాల ప్రవీణ్ రాజీనామా
ఉప్పల్ (హైదరాబాద్) : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఉప్పల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి బన్నాల ప్రవీణ్ టీడీపీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని టీడీపీ ప్రధాన కార్యాలయానికి ఫ్యాక్స్ చేసినట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితుడినై టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. తనతో పాటు జిల్లా తెలుగు యువత కార్యదర్శి కొంపల్లి రవీందర్, బీసీ సెల్ డివిజన్ ఉపాధ్యక్షుడు ఇ.రవీందర్ గౌడ్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి, సీనియర్ నాయకులు కొంపల్లి రాజు, ఏలే వెంకటేశ్వర్లు కూడా రాజీనామా చేసినట్లు తెలిపారు. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు, ఉప్పల్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జ్ భేతి సుభాష్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. -
టీడీపీకి గుడ్‌బై చెప్పిన పడాల అరుణ
-
టీడీపీకి వంటేరు ఝలక్
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన జిల్లా సీనియర్ నేత వంటేరు వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వంటేరు వేణుగోపాల్ రెడ్డి ఆ పార్టీలో చేరారు. గతంలో జరిగిన ఎన్నికలలో నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వంటేరు వేణుగోపాల్ రెడ్డి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన అపజయం పాలైన సంగతి తెలిసిందే.