breaking news
Quality of Life Survey
-
కరోనా వల్ల 1.8 ఏళ్లు తగ్గిపోయిన సగటు జీవితకాలం
న్యూయార్క్: కోవిడ్–19 సృష్టించిన విలయం మర్చిపోలేనిది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఈ మహమ్మారి బలి తీసుకుంది. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా మనుషుల సగటు జీవిత కాలం 1.8 సంవత్సరాలు పడిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఈ తాజాగా ‘ప్రపంచ ఆరోగ్య గణాంకాలు–2025’ నివేదికను విడుదల చేసింది. మహమ్మారి ప్రజల ప్రాణాలను హరించడమే కాదు, జీవన నాణ్యతను సైతం దెబ్బతీసినట్లు నివేదిక పేర్కొంది. 2019 నుంచి 2021 మధ్య సగటు జీవిత కాలం 1.8 ఏళ్లు పడిపోయిందని, చరిత్రలో ఇదే అతిపెద్ద పతనమని స్పష్టంచేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు... → కరోనా విపత్తు సమయంలో కేవలం ఆందోళన, కుంగుబాటు వల్ల ఆరోగ్యకరమైన సగటు జీవితకాలం ఆరు వారాలు పడిపోయింది. → ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో కొంత ప్రగతి నమోదైనప్పటికీ, సాధించాల్సింది ఇంకెంతో ఉంది. → పొగ తాగడం తగ్గించుకోవడం, మెరుగైన వాయు నాణ్యత, సురక్షితమైన తాగునీరు, పారిశుధ్య వసతులు అందుబాటులోకి రావడం వల్ల 1.4 బిలియన్ల మంది ఆరోగ్యంగా జీవిస్తున్నారు. → మరోవైపు అత్యవసర వైద్య సేవలు పొందడం వేగంగా మెరుగుపడడం లేదు. కేవలం 431 మిలియన్ల మంది మాత్రమే ఈ సేవలు పొందగలుగుతున్నారు. → మాత, శిశు మరణాలు ఆశించిన స్థాయిలో తగ్గడం లేదు. 2000 నుంచి 2023 దాకా ఈ విషయంలో కొంత ప్రగతి సాధ్యమైంది. బాలింతల మరణాలు 40 శాతం తగ్గాయి. → ఆరోగ్య రంగానికి ప్రభుత్వాలను తగనన్ని నిధులు కేటాయించడం లేదు. నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బంది కొరత వేధిస్తోంది. → ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే 2030 నాటికి అదనంగా 7 లక్షల మాత మరణాలు, 80 లక్షల శిశు మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. → ప్రస్తుతం 70 ఏళ్లలోపు వయసున్న వారిలో అత్యధిక మరణాలకు హృదయ సంబంధిత వ్యాధులు, గుండె పోటు, క్యాన్సర్, డయాబెటిస్ కారణమవుతున్నాయి. → చైల్డ్‌హుడ్ వ్యాక్సినేషన్ రేటు కోవిడ్‌కు ముందున్న స్థాయికి ఇంకా చేరుకోలేదు. దీనివల్ల బాలలకు ముప్పు పొంచి ఉంది. -
ముంబై, తిరువనంతపురం టాప్
న్యూఢిల్లీ: దేశంలోని నగరాల్లో ముంబై, తిరువనంతపురం పాలనలో, మెరుగైన జీవనంలో ఉమ్మడిగా అత్యున్నత స్థానంలో నిలిచాయి. 21 నగరాల్లో సర్వే చేయగా చండీగఢ్, జైపూర్లు అట్టడుగున ఉన్నట్లు సర్వేలో తేలింది. పట్టణ ప్రణాళిక, డిజైన్, సామర్థ్యం, వనరులు), పారదర్శకత తదితర అంశాల ఆధారంగా జనాగ్రహ సెంటర్ ఫర్ సిటిజన్‌షిప్ అండ్ డెమోక్రసీ (జేసీసీడీ) సర్వే నిర్వహించింది. 0-10 రేటింగ్ స్కేల్‌పై లండన్, న్యూయార్క్‌లు 9.4, 9.7 రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉండగా, భారత నగరాలు 2 నుంచి 4.2 రేటింగ్తోనే ఉన్నాయి. తిరువనంతపురం, ముంబైలు 4.2 రేటింగ్‌ను, ఢిల్లీ 3.7, చెన్నై, హైదరాబాద్, కాన్పూర్‌లు 3.6, జైపూర్ 2.8, చండీగఢ్‌లు 2 రేటింగ్‌ను సాధించాయి.