breaking news
Promising future
-
ఈ ఇన్స్టిట్యూట్లు.. ఉజ్వల భవితకు వేదికలు..
సాధారణంగా ప్రభుత్వ రంగంలో ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు అంటే మనకు గుర్తొచ్చేది ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు) లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎంలు). అందుకు ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ విద్యకు ఉన్న క్రేజ్ ఒక కారణమైతే.. ఐఐటీలు, ఐఐఎంలు అందిస్తున్న కోర్సులకున్న డిమాండ్ మరో కారణం..! ఐఐటీలు, ఐఐఎంలే కాకుండా.. ఆర్ట్స్ నుంచి ఫైన్ ఆర్ట్స్ వరకూ.. ఎన్నో విభాగాల్లో మరెంతో పేరెన్నికగల పబ్లిక్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. అద్భుతమైన కోర్సులు అందిస్తూ.. ఉజ్వల భవితకు వేదికలుగా నిలుస్తున్నాయి. ఇవే కాకుండా ఆయా కోర్సుల్లో మరెన్నో ప్రముఖ ప్రయివేటు విద్యా సంస్థలూ ఉన్నాయి. కొత్త విద్యా సంవ త్సరం ప్రారంభమైన తరుణంలో దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గడించిన పబ్లిక్ ఇన్స్టిట్యూట్లపై ఈ వారం ఫోకస్.. ఆర్ట్స్.. విభాగంలో అనేక కళాశాలలు ఆర్ట్స్.. పలకడానికి రెండక్షరాలే. కానీ ఈ విభాగం పరిధి ఎంతో విస్తృతం. పదుల సంఖ్యలో కోర్సులు. హిస్టరీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్, ఎకనామిక్స్.. ఇలా అనేకం. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పేరుతో ఎన్నో స్పెషలైజేషన్స్, కాంబినేషన్స్‌తో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆర్ట్స్ విభాగంలో.. నిరంతరం సామాజిక, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా భిన్నమైన కోర్సులకు రూపకల్పన చేస్తూ.. అనేక ప్రముఖ ప్రభుత్వ కళాశాలలు గుర్తింపు పొందుతున్నాయి. గతంలో పోటీ పరీక్షలకు మాత్రమే ఉపయుక్తం అనే రీతిలో ఉండే ఆర్ట్స్ కోర్సులకు.. ఆధునిక రూపమిస్తూ కార్పొరేట్ కల్చర్‌కు శ్రీకారం చుడుతున్నాయి ఈ కాలేజీలు. ప్రముఖ ఆర్ట్స కళాశాలలు: లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ - ఢిల్లీ మిరండా హౌస్ (యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ)- ఢిల్లీ నేషనల్ పీజీ కాలేజ్- లక్నో ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ - ఢిల్లీ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్ - హైదరాబాద్ నిజాం కాలేజ్ - హైదరాబాద్ ఇంజనీరింగ్.. ఐఐటీలతోపాటు.. ఇంజనీరింగ్ కోర్సుకు సంబంధించి పేరుగాంచిన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీలతోపాటు మరెన్నో ప్రభుత్వరంగ విద్యా సంస్థలు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్‌లో రాణించాలనుకుంటున్న ప్రతిభావంతులకు వేదికగా నిలుస్తూ.. మరోవైపు పరిశ్రమ అవసరాలకు తగిన రీతిలో నిపుణులైన భవిష్యత్తు ఇంజనీర్లను తీర్చిదిద్దుతున్నాయి. బీటెక్ స్థాయిలో కోర్ బ్రాంచ్‌లు మొదలు.. పీహెచ్డీ స్థాయిలో.. సమకాలీన అవసరాలకు అనుగుణంగా సరికొత్త స్పెషలైజేషన్స్ అందిస్తూ విద్యార్థి లోకం, పరిశ్రమ వర్గాల నుంచి ఆదరణ పొందుతున్నాయి. ప్రముఖ సంస్థలు: ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (16 క్యాంపస్‌లు) iii ఐటీలు ఎన్ఐటీలు యూనివర్సిటీ క్యాంపస్‌ల ఇంజనీరింగ్ కళాశాలలు ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ సైన్స్‌కు సమున్నత విద్యా సంస్థలు సైన్స్‌కు సంబంధించి ఫిజికల్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్, లైఫ్ సెన్సైస్ ఇలా.. అన్ని విభాగాల్లోనూ మంచి పేరున్న ఇన్స్టిట్యూట్లు ప్రభుత్వ రంగంలో ఏర్పాటయ్యాయి. ప్యూర్ సెన్సైస్‌లో.. ప్రధానంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్ఈఆర్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) వంటి విద్యాసంస్థలతోపాటు వివిధ కేంద్రీయ, రాష్ర్ట స్థాయి యూనివర్సిటీలు అద్భుత కోర్సులకు వేదికలుగా నిలుస్తున్నాయి. అకడెమిక్ బోధనతోపాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ నిర్వహిస్తూ పరిశ్రమ వర్గాల గుర్తింపు పొందుతున్నాయి. వీటిలో బ్యాచిలర్ నుంచి, పీజీ, పీహెచ్డీ, పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ వరకు అధ్యయన అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ సైన్స కళాశాలలు: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ క్యాంపస్‌లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ - బెంగళూరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ - బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ - శిబ్పూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ-తిరువనంతపురం పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్-బెంగళూరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ - భువనేశ్వర్ కామర్స్‌లో.. ఎవర్గ్రీన్ కళాశాలలు కామర్స్.. బ్యాచిలర్ స్థాయి నుంచి పీహెచ్డీ వరకు నేటి పోటీ ప్రపంచంలో విస్తృతంగా అవకాశాలు కల్పిస్తున్న విభాగం. పారిశ్రామికీకరణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, వాణిజ్య కార్యకలాపాలతో ఆయా సంస్థల వ్యాపార అవసరాలకు సుశిక్షితులైన మానవ వనరుల అవసరం ఏర్పడుతోంది. కామర్స్ అంటే పద్దుల నిర్వహణ మాత్రమే అనేది గతం. ఇప్పుడు సంస్థలకు అనేక నైపుణ్యాలున్న మానవ వనరుల అవసరం పెరుగుతోంది. వీటిని అందించే విధంగా ప్రభుత్వ రంగంలో దేశవ్యాప్తంగా వివిధ ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీలు.. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులకు శ్రీకారం చుడుతూ గుర్తింపు పొందుతున్నాయి. దశాబ్దాల చరిత్ర ఉన్న శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ మొదలు ఎన్నో కళాశాలలు కామర్స్ విభాగంలో విభిన్న కోర్సులను అందిస్తూ కెరీర్ పరంగానూ చక్కటి అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రముఖ కాలేజీలు: రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ - ఢిల్లీ ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ - ఢిల్లీ నిజాం కాలేజ్ - హైదరాబాద్ ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్- న్యూఢిల్లీ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ - న్యూఢిల్లీ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ - హైదరాబాద్ బెనారస్ హిందూ యూనివర్సిటీ - వారణాసి మేనేజ్మెంట్.. మేనేజ్మెంట్ కోర్సులకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు కేరాఫ్ అనేది నిస్సందేహం. వీటికి ధీటుగా ప్రభుత్వ రంగంలో మరెన్నో మేనేజ్మెంట్ కళాశాలలు.. వ్యాపార నిర్వహణలో మెళకువలను అందిస్తూ విద్యార్థులను పరిశ్రమ అవసరాలకు తగిన రీతిలో తీర్చిదిద్దుతున్నాయి. ఈ విషయంలో సెంట్రల్ యూనివర్సిటీలు ముందంజలో నిలుస్తున్నాయని చెప్పొచ్చు. వీటితోపాటు రాష్ట్ర స్థాయిలో యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు ప్రముఖంగా ఆదరణ పొందుతున్నాయి. ప్రైవేటు కళాశాలలతో పోటీపడుతూ నాణ్యమైన విద్యనందిస్తున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ క్యాంపస్‌లు ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్- న్యూఢిల్లీ బెనారస్ హిందూ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ న్యాయశాస్త్రం.. నేషనల్ లా యూనివర్సిటీస్ ఒకప్పుడు కేవలం న్యాయవాద వృత్తికి మాత్రమే సోపానంగా నిలిచిన న్యాయశాస్త్రం.. ఇప్పుడు ఆధునిక రూపు సంతరించుకుంది. ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్, కార్పొరేట్ కల్చర్ల నేపథ్యంలో న్యాయశాస్త్ర ప్రాధాన్యం పెరిగింది. ప్రతి రంగంలోనూ.. ప్రతి సంస్థలోనూ అంతర్గతంగా న్యాయ నిపుణుల అవసరం ఏర్పడుతోంది. ప్రభుత్వ నియంత్రణ సంస్థలతో సంప్రదింపులు సాగించేందుకు, సదరు సంస్థ చట్టాలకు అనుగుణంగా సమర్థంగా పనిచేసేందుకు న్యాయ నిపుణులను నియమించుకుంటున్నాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం దేశవ్యాప్తంగా 14 నేషనల్ లా యూనివర్సిటీలను ఏర్పాటు చేసింది. తెలంగాణలో నల్సార్ యూనివర్సిటీకి దేశవ్యాప్త గుర్తింపు లభిస్తోంది. ఇదేవిధంగా న్యాయ విద్యలో మరికొన్ని ప్రభుత్వ యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లు ఉత్తమ ప్రమాణాలతో లా కోర్సులు అందిస్తూ విద్యార్థులకు కార్పొరేట్ అవకాశాలు అందిస్తున్నాయి. ప్రముఖలా విద్యా సంస్థలు: నేషనల్ లా యూనివర్సిటీలు (మొత్తం 14) ఫ్యాకల్టీ ఆఫ్ లా - యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఫ్యాకల్టీ ఆఫ్ లా - బెనారస్ హిందూ యూనివర్సిటీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా - ఉస్మానియా యూనివర్సిటీ దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ - విశాఖపట్నం బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగల్ స్టడీస్ మెడికల్ కోర్సుల్లో మెరుగైన ఇన్స్టిట్యూట్లు మెడికల్.. ఎంబీబీఎస్ అంటే ఎయిమ్స్, జిప్మర్ వంటివి మాత్రమే మనకు తెలుసు. అయితే, వీటితోపాటు మరెన్నో ప్రముఖ వైద్య కళాశాలలు ఎంబీబీఎస్ ఔత్సాహికులకు అందుబాటులో ఉన్నాయి. ఎంబీబీఎస్ నుంచి డీఎన్బీ వరకు అన్నిస్థాయిల్లో కోర్సులను అందిస్తూ.. వైద్య విద్య ఔత్సాహికుల ఆదరణ పొందుతున్నాయి. వీటిలో ప్రవేశించాలంటే.. జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సిందే. ప్రముఖ వైద్య కళాశాలలు: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ - న్యూఢిల్లీ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ - పుణె యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అండ్ జీటీబీ హాస్పిటల్ - ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ - బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉస్మానియా మెడికల్ కాలేజ్ - హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ - అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ - లక్నో ఫ్యాషన్ కోర్సులకు కేరాఫ్.. నిఫ్ట్ క్యాంపస్‌లు.. ఫ్యాషన్ టెక్నాలజీ.. ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఇందులోనూ ఎన్నో విభాగాలు. కంటికి ధరించే కళ్లజోడు నుంచి కాళ్లకు ధరించే షూస్ వరకు కొత్త డిజైన్లు ఆవిష్కృతమవుతున్నాయి. ఈ నైపుణ్యాలను అందించే కోర్సులు.. ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులు. ఫ్యాషన్ టెక్నాలజీ అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. జౌళి శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలకు రూపకల్పన చేసింది. ఆ తర్వాత క్రమంలో మరెన్నో ప్రభుత్వరంగ యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లు ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులను అందిస్తున్నాయి. ప్రముఖ ఇన్స్టిట్యూట్లు: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ - 15 సెంటర్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ - అహ్మదాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్ అండ్ డిజైన్ - జైపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అపేరల్ మేనేజ్మెంట్ (గుర్గావ్) వంటి మరికొన్ని సంస్థలు.. ఇటీవల కాలంలో ఫ్యాషన్ రంగానికి సంబంధించి ఎన్నో కోర్సులను అందిస్తున్నాయి. ఫైన్ ఆర్ట్స్‌కు.. వెరీ ఫైన్ కాలేజెస్.. చిత్ర లేఖనం, శిల్ప కళ, ఫొటోగ్రఫీ ప్రధాన కోర్సులుగా భావించే ఫైన్ ఆర్ట్స్ విభాగంలోనూ ఎన్నో ప్రభుత్వ రంగ ఇన్స్టిట్యూట్లు రూపుదిద్దుకున్నాయి. హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ మొదలు.. దేశవ్యాప్తంగా ఎన్నో యూనివర్సిటీలు.. ఇన్స్టిట్యూట్లు ఈ కోర్సులను అందిస్తున్నాయి. ప్రారంభంలోనే రూ. వేలల్లో జీతాలు అందుకునే అవకాశం కల్పిస్తున్నాయి. ఆసక్తి, అభిరుచికి తోడుగా ఈ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందితే అవకాశాలకు ఆకాశమే హద్దు. ప్రముఖ విద్యా సంస్థలు: జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ - హైదరాబాద్ ఫ్యాకల్టీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (ఎం.ఎస్. యూనివర్సిటీ- బరోడా) ఫ్యాకల్టీ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ - బెనారస్ హిందూ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (జామియా మిలియా యూనివర్సిటీ) డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (కురుక్షేత్ర యూనివర్సిటీ) డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ) నిఫ్ట్లలో ప్రవేశం కెరీర్‌కు బెస్ట్ లిఫ్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీల్లో ప్రవేశం పొందితే అద్భుత కెరీర్‌కు పునాది పడినట్లే. ఈ కోర్సుల్లో రాణించాలంటే సహజ ఆసక్తి, సృజనాత్మకత, మార్కెట్ ట్రెండ్స్ అధ్యయనం వంటి స్కిల్స్ అవసరం. ఈ మూడు లక్షణాలకు అకడెమిక్ నైపుణ్యాలు తోడైతే కెరీర్ పరంగా ఆందోళన చెందక్కర్లేదు. - ఎన్.జె. రాజారాం, డెరైక్టర్, నిఫ్ట్-హైదరాబాద్ ప్రత్యామ్నాయ వేదికలు ఎన్నో.. మేనేజ్మెంట్ ఔత్సాహిక విద్యార్థులకు ఐఐఎంలకు ప్రత్యామ్నాయంగా ఎన్నో ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఇవి కూడా ఐఐఎంలకు సరితూగే విధంగా బోధన ప్రమాణాలు పాటించడంతోపాటు.. ఎప్పటికప్పుడు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త స్పెషలైజేషన్స్ అందిస్తున్నాయి. వీటిపై అవగాహన ఏర్పరచుకుంటే ఎన్నో అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. - ప్రొఫెసర్॥ఎం.ఎల్.సాయి కుమార్, డీన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ప్రామాణిక కళాశాలల్లో చేరితే పరిధి విస్తృతం ఆర్ట్స్ కోర్సులకు సంబంధించి ప్రామాణిక కళాశాలల్లో ప్రవేశం పొందితే.. అవకాశాల పరిధిని విస్తృతం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్ట్స్, హ్యుమానిటీస్‌లో ఎన్నో పేరెన్నికగల కళాశాలలు కొత్త కాంబినేషన్లు అందిస్తూ కార్పొరేట్ రంగ అవసరాలను తీర్చే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయి. - ప్రొఫెసర్ టి.ఎల్.ఎన్. స్వామి, ప్రిన్సిపాల్, నిజాం కాలేజ్, హైదరాబాద్ సైన్స్ కోర్సుల్లో మేటి భవిష్యత్తు.. ప్యూర్‌సైన్స్ కోర్సుల విషయంలో విద్యార్థులకు ఎన్నో ప్రత్యామ్నాయ వేదికలు అందుబాటులోకి వస్తున్నాయి. సాధారణంగా సైన్స్ అంటే బీఎస్సీ, బీజెడ్సీ కోణంలో ఆలోచిస్తారు. డిగ్రీ కళాశాలల్లో ప్రవేశిస్తారు. అయితే ఈ విభాగంలో పేరెన్నిక గల ఇన్స్టిట్యూట్లలో అడుగుపెడితే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. - ప్రొఫెసర్॥రాజశేఖరన్, స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. -
ఆవేశంలో ఆత్మహత్యలు బాధాకరం
వైఎస్సార్ సీపీ నేత మొండితోక అరుణ్‌కుమార్ వీరులపాడు : ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న విద్యార్థి ఆవేశంలో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నందిగామ నియోజకవర్గనేత డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని పెద్దాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యిప్పల నాగిరెడ్డి కుమారుడు రాజశేఖర్‌రెడ్డి గురువారం విజయవాడ కృష్ణా బ్యారేజిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పరిటాల అమృతసాయి కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మృతదేహాన్ని శుక్రవారం పెద్దాపురం తీసుకువచ్చారు. మృతుడు రాజశేఖర్‌రెడ్డి మృతదేహానికి అరుణ్‌కుమార్‌తో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు కోటేరు ముత్తారెడ్డి, బండి జానకీరామయ్య, ఆవుల రమేష్‌బాబు, కోటేరు సత్యనారాయణరెడ్డి, పరిమి కిషోర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కన్నీరు, మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు రోజూ మాదిరిగానే గురువారం ఉదయం కళాశాలకు వెళ్లిన తన కుమారుడు శవమై రావడం చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతదేహంపై పడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి నామకరణం చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 1994వ సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెద్దాపురం గ్రామానికి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆ నాటి బహిరంగ సభలో నాగిరెడ్డి కుమారుడిని ఎత్తుకుని యిప్పల రాజశేఖర్రెడ్డిగా నామకరణం చేశారు. ఆ విషయాన్ని పదేపదే గుర్తు చేసుకుని బోరున విలపిస్తున్నారు. అమృతసాయి కళాశాలకు సెలవు.... తమ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి యిప్పల నాగిరెడ్డి మృతికి సంతాపం సూచికంగా అమృత సాయి కళాశాలకు సెలవు ప్రకటించారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు మృతుడు రాజశేఖర్‌రెడ్డి మృతదేహాన్నిసందర్శించి నివాళులర్పిస్తూ కంటతడి పెట్టారు. -
మేనేజ్మెంట్ కోర్సులతో ఉజ్వల భవిష్యత్తు
సాగునీరు లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదు సామాజిక అడవులతో భూగర్భజలాల పెంపు చలసాని శ్రీనివాస్ కురబలకోట: మంచి అవకాశాలు పొందడానికి మేనేజ్మెంట్ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర మేధావుల, విద్యావంతుల వేదిక అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన కురబలకోట మండలంలోని విశ్వం ప్రాంగణంలో ఉన్న విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్ కళాశాల (ఎస్విటీఎం)లో ఎంబీఏ విద్యార్థులకు అతిథి ఉపన్యాసమిచ్చారు. ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో మేనేజ్‌మెంట్‌ది కీలకపాత్రగా మారిందన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు పొందడానికి నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. సమయస్ఫూర్తి, విభిన్న ఆలోచనలు, సృజనాత్మకత తప్పనిసరి అన్నారు. వ్యక్తిత్వం మనిషికి ఆభరణం లాంటిదన్నారు. విశిష్ట వ్యక్తిత్వంతో మనిషి మహనీయుడు కావచ్చన్నారు. ఎంబీఏ అంటే నేడు క్రేజీ పెరుగుతోందన్నారు. కష్టించేతత్వం, మారుతున్న పరిణామాలను అంచనా వేయడం, కంపెనీల వర్తమాన పరిస్థితులను పసిగట్టగలగాలని చెప్పారు. దీనికి తోడు ఎప్పటికప్పుడు ఓర్పు, ఆపై నేర్పుతో ముందుకు సాగాలన్నారు. పర్యాటక కారిడార్‌లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. వారసత్వ సంపద గొప్పది మనకు ఎంతో గొప్ప వారసత్వ సంపద ఉందని, వివిధ రంగాల్లో తెలుగువారు సత్తా చాటారని చలసాని శ్రీనివాస్ అన్నారు. ఇది తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు. విశ్వేశ్వరయ్య గొప్ప ఇంజినీరుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొం దారన్నారు. చదువు సంధ్యతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలపై విద్యార్థులు దృష్టి సారిం చాలన్నారు. ఇకపోతే రాష్ర్ట విభజన అప్రజాస్వామికంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక రాయలసీమ కోరితే నష్టపోయేది సీమ వాసులేనన్నది గుర్తుంచుకోవాలన్నారు. సాగునీరు లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిరాశను కల్గిస్తోందన్నారు. రూ. 17 వేల కోట్ల లోటు బడ్జెట్ లో ఉందన్నారు. రాయలసీమకు పోలవరం వరప్రసాదిని అన్నారు. హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల కు నికర జలాలను కేటాయించాలన్నారు. విద్యు త్ పంపిణీలో కూడా సీమాంధ్రకు అన్యాయం జరుగుతోందన్నారు. సీమ ప్రాంతంలో సామాజి క అడవుల పెంపకం భూగర్భ జలాలకు దోహదపడుతుందని ఆయన అన్నారు. మదనపల్లె ఏరి యా అభివృద్ది సంస్థ సలహాదారు దేవరబురుజు శేఖర్‌రెడ్డి, ఎంబీఏ విభాగాధిపతి నూర్మహమ్మ ద్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్నెట్తో పెడదోవ పడుతున్న యువత
జన్నారం, న్యూస్‌లైన్ : ఇంటర్నెట్ ద్వారా భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాల్సిన యువత అశ్లీల అంశాలకు ప్రాధాన్యమిస్తూ ఉజ్వల భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. ఆటపాటలతో గడపాల్సిన వయసులో కుర్చీలో బందీలైపోతున్నారు. పాశ్చాత్య విష సంస్కృతికి బానిసలుగా మారుతున్నారు. గంటల తరబడి ఇంటర్నెట్తో గడుపుతున్నారు. గతంలో నగరాలకే పరిమితమైన ఈ వ్యసనం నేడు పల్లెలకూ విస్తరించింది. సాంకేతిక పరిజ్ఞానం గ్రామాలకు సైతం అందడం ఓ విధంగా సంతోషకరమే అయినా.. అందిపుచ్చుకున్న విజ్ఞానం చెడుపోకడలకు దారితీయడం బాధాకరంగా పరిణమిస్తోంది. కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, సెల్ఫోన్ల వాడకం విపరీతంగా పెరగడం ఇందుకు ప్రధాన కారణం. ఈ మెయిల్స్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వినియోగం ప్రధానంగా దుష్ర్పభావం చూపుతోంది. ఇంటర్నెట్ నుంచి అశ్లీల చిత్రాలను డౌన్లోడ్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్లు చాటింగ్ చేసుకుంటూ గంటల కొద్ది సమయాన్ని వృథా చేస్తున్నారు. పిల్లలపై నెట్ ప్రభావం పిల్లలపై ఇంటర్నెట్ ప్రభావం విపరీతంగా ఉంది. పెద్దల మాదిరిగానే సెల్‌ఫోన్, ఇంటర్నెట్లను పిల్లలు సైతం వినియోగిస్తున్నారు. ఎక్కువగా ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, అశ్లీల వెబ్సెట్లు చూస్తున్నట్టు సర్వేలు చెప్తున్నాయి. ఫేస్బుక్లో యూజర్‌కు 12 ఏళ్ల పరిమిత వయస్సు ఉండాలని నిబంధన ఉంది. అయితే తప్పుడు వయస్సుతో అకౌంట్ ఓపెన్ చేసి చాటింగ్‌లు చేస్తున్నారు. పాఠశాల నుంచి ఇంటికి చేరుకోగానే నెట్ మాయాజాలం వారిని కట్టి పడేస్తోంది. ఈ కారణంతో చదువులో కూడా వెనుకబడిపోతున్నారు. తల్లిదండ్రులు తమ పనిలో బిజీగా ఉండటం, పిల్లల అలవాట్లపై దృష్టి పెట్టకపోవడం కూడా దీనికి కారణమవుతోంది. ఏ సమాచారమైనా క్షణాల్లో.. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా, ఏ సమాచారం కావాలన్నా, ఎలాంటి చరిత్రలు తెలుసుకోవాలన్నా, సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, దరఖాస్తులు, ఉద్యోగాలు, ఫలితాలు తదితర వివరాల కోసం గూగుల్ సెర్చ్‌లోకి వెళ్తే క్షణాల్లో సమాచారం వస్తుంది. అశ్లీలతపై ఆసక్తి సమాజంలో వ్యసనాలకు బానిసలైన యువకులపై ఇంటర్నెట్ ప్రభావం అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. నెట్ వేగంగా విస్తరించినప్పటికీ మరోవైపు యువత భవిష్యత్తు ఆందోళనకరంగా మారింది. యూట్యూబ్‌లో అశ్లీల చిత్రాలు చూడడానికే యువత అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు పలు సర్వేల్లో వెల్లడైనట్లు తెలుస్తోంది. కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్‌ల ద్వారా ఇంటర్నెట్ను వినియోగించే వారితో పాటుగా సెల్‌ఫోన్‌ను వినియోగిస్తున్న వారు కూడా ఈ విషయంలో పోటీ పడుతున్నారు. అర్ధరాత్రి సమయంలో కూడా యువత ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారని సర్వేలు చెప్తుతున్నాయి. ఫోర్న్సైట్ను బ్లాక్ చేయడంతో అసభ్యకర చిత్రాలు చూసే వీలు లేనందున యువత ఇంటర్నెట్ సెంటర్లకు వచ్చేందుకు సుముఖత చూపడం లేదని ఇంటర్నెట్ నిర్వాహకులు చెప్తుతున్నారు. దీంతో అరచేతిలో అందుబాటులో ఉండేలా స్మార్ట్‌ఫోన్, సెల్ఫోన్లను ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. ఫేస్బుక్ మాయలో... ఫేస్బుక్ మాయలో పడి యువతులు సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. అవగాహన లేని కారణంగా ఫేస్బుక్లో ఫొటోలు పెడితే ఆ ఫొటోలను కొందరు డౌన్లోడ్ చేసి అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి నెట్లో అందరికీ పంపుతున్నారు. ఇలాంటి విషయంలో హైదరాబాద్‌కు చెందిన ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్న విషాదకర ఘటన కూడా ఉంది. ఫొటోల అప్లోడ్ విషయంలో యువతులు జాగ్రత్తలు పాటించకపోతే సమస్యలు ఎదుర్కోక తప్పదు. బినామీలు తస్మాత్ జాగ్రత్త బినామీ పేరుతో, ప్రొఫైల్స్‌తో అకౌంట్లు కొనసాగిస్తున్న వారు ఇకపై జాగ్ర త్త వహించాలి. అసభ్యకరమైన మెసేజ్‌లు పంపితే సాంకేతిక నైపుణ్యంతో అటువంటి వారిని ఇట్టే పసిగట్టే పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉంది. సర్వర్ల ద్వారా ఆచూకీని తెలుసుకునే వెసులుబాటు ఉంది. సదరు వ్యక్తులు ఉపయోగించిన కంప్యూటర్లు, సెల్ఫోన్లను ఇట్టే కనిపెట్టేస్తారు.