breaking news
Prof. Jayashankar birth anniversary
-
సార్.. ఆశయ సాధన కోసం కృషి
సూర్యాపేట : ప్రొ. జయశంకర్ సార్ ఆశయ సాధన కోసమే కృషి చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలో తన స్వగృహంలో మంత్రి ప్రొ. జయశంకర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రొ. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం సార్ ఆశయ సాధన కోసమే కృషి చేస్తోందన్నారు. నల్లగొండ జిల్లా ప్లోరిన్ సమస్యను ప్రపంచానికి తెలిసేలా చేసిన మహోన్నత వ్యక్తి ప్రొ. జయశంకర్ సార్ అని ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు. నిజామాబాద్: ప్రొ. జయశంకర్ జయంతోత్సవాలను నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఎంపీడీవో కార్యాలయం, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు అధికారులు, పార్టీ కార్యకర్తలు ప్రొ. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
టీ.భవన్లో ప్రొ.జయశంకర్ జయంతి వేడుకలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఢిల్లీలోని తెలంగాణ భవన్లో గురువారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఉద్యోగ సంఘాల నేతలు ప్రొ.జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మరోవైపు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఉద్యోగులు ఘనంగా అంజలి ఘటించారు. అలాగే కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ప్రొఫెసర్ జయశంకర్‌కు పలు రాజకీయ పార్టీ నేతలు నివాళులు అర్పించారు.