breaking news
Prime Minister of Sri Lanka
-
శ్రీలంకలో ‘కనిపిస్తే కాల్చివేత’
కొలంబో: దేశంలోని వాయవ్య ప్రావిన్స్సహా పలు పట్టణాల్లో మత ఘర్షణలు చెలరేగడంతో శ్రీలంక దేశవ్యాప్తంగా సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 4 గంటల వరకూ కర్ఫ్యూ విధించింది. నిబంధనలను అతిక్రమించే వారిని కన్పించినచోటే కాల్చిచంపాలని ఆర్మీకి ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా శాంతియుతంగా ఉండాలనీ, తప్పు డు వార్తలను, వదంతులను నమ్మవద్దని ప్రధాని విక్రమసింఘే విజ్ఞప్తి చేశారు. ‘ముస్లిం’ షాపులు ధ్వంసం శ్రీలంకలోని వాయవ్య ప్రాంతంలో ఉన్న కులియపిటియా, బింగిరియా, దుమ్మలసురియా, హెట్టిపోలా పట్టణాల్లో మెజారిటీ సింహాళీయులు, ముస్లింల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హింసాత్మక ఘటనల నేపథ్యంలో వదంతులు వ్యాపించకుండా ఫేస్బుక్, వాట్సాప్లపై మళ్లీ నిషేధం విధిస్తున్నామని సైన్యం తెలిపింది. ఈస్టర్ ఉగ్రదాడులకు సంబంధించి శ్రీలంక పోలీసులు ఇప్పటివరకూ వెయ్యి మందికిపైగా అనుమానితులను అరెస్ట్ చేశారు. -
వెంకన్న సేవలో శ్రీలంక ప్రధాని జయరత్నే
శ్రీలంక ప్రధాన మంత్రి ఎండీ.జయరత్నే శుక్రవారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. బెంగళూరు నుంచి రోడ్డుమార్గం ద్వారా ఉదయం 8.30 గంటలకు తిరుమలకు వచ్చారు. టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు ఆయనకు స్వాగతం పలికారు. జయరత్నే ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత పచ్చకర్పూరపు వెలుగులో మూలమూర్తిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేద పండితులు జయరత్నేకు ఆశీర్వచనం చేశారు. - సాక్షి, తిరుమల