breaking news
priest strike
-
‘వారికి గాడిదలకున్న దయ కూడా లేదు’
శబరిమల : గాడిదలు బరువులు మోస్తూ బండ చాకిరీ చేస్తాయి కానీ వారిలా(పూజారుల్లా) నిరసన తెలపవంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కేరళ పీడబ్ల్యూడీ మంత్రి జీ సుధాకరన్. గత కొద్ది కాలంగా శబరిమల ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ఆందోళనల గురించి తెలిసిందే. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈనేపథ్యంలో కేరళ ప్రభుత్వం, సుప్రీం తీర్పును అమలు చేయడానికి ప్రయత్నించడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రైట్ వింగ్ కార్యకర్తల చేస్తోన్న ఆందోళనలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఈ క్రమంలో సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా ఆలయ పూజారులు వారం రోజుల పాటు విధులు బహిష్కరించి.. నిరసన తెలుపుతున్నారు. దాంతో పూజారులను విమర్శించే ఉద్దేశంతో సుధాకరన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాడిదలు బరువులను మోస్తూ.. పంబా నది తీరంలో విశ్రాంతి తీసుకుంటాయి. అవి చాలా కష్టపడతాయి కానీ ఆందోళన చేయవు. కానీ శబరిమల పూజారులకు గాడిదలకున్న దయ కూడా లేదు. అందుకే వారు ఆలయాన్ని మూసి వేసి భక్తులకు ఇబ్బంది కల్గిస్తున్నారంటూ విమర్శించారు. -
ఖమ్మంలో అర్చకుల నిరవధిక సమ్మె
హైదరాబాద్ సిటీ: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖమ్మంలోని జలాంజనేయస్వామి దేవాలయంలో అర్చకులు నిరవధిక సమ్మెకు దిగారు. నిరవధిక దీక్షకు చేస్తున్న అర్చకులను పినపాక వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కలిసి వారికి మద్ధతు తెలిపారు. అర్చకులు కోరుతున్న కోరికలు చాలా చిన్నవని, వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోరారు.