breaking news
The price of milk
-
సామాన్యుడిపై పాల పిడుగు
లీటర్ పాలపై రూ.2 నుంచి రూ.3 వరకు పెరిగే అవకాశం ముఖ్యమంత్రి ఆమోదమే తరువాయి బెంగళూరు : కొత్త సంవత్సరంలో సామాన్యుడిపై ధరా భారాన్ని మోపేందుకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సన్నద్ధమైంది. లీటర్ పాలపై రూ.2 నుంచి రూ.3 వరకు పాల ధరను పెంచుతూ ప్రజలపై పాల పిడుగును మోపేందుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఫైలును ఇప్పటికే ముఖ్యమంత్రికి అందజేయగా, ముఖ్యమంత్రి ఆమోదముద్ర లభించిన తక్షణం పెరిగిన ధరలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల ధర పెంపుపై పాలక మండి సభ్యులు చర్చించారు. కేఎంఎఫ్ సిబ్బంది వేతనాలు, పాల రవాణా, తదితర నిర్వహణా వ్యయం చాలా వరకు పెరిగిపోయిందని, పాల ఉత్పత్తుల అమ్మకాల వల్ల వచ్చే లాభాల కన్నా నిర్వహణా వ్యయమే ఎక్కువగా ఉందన్న విషయం పాలక మండలి సమావేశంలో ముఖ్య చర్చనీయాంశమైంది. కాగా ఈ నిర్వహణా వ్యయాన్ని తట్టుకోవాలంటే పాల ధర పెంచక తప్పదని పాలక మండలి తీర్మానించింది. ఇదే అంశాలను ప్రస్తావిస్తూ పాల ధరను లీటరుకు రూ.2 నుంచి రూ.3కు పెంచేందుకు అనుమతించాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఇప్పటికే నివేదికను అందజేశారు. దీంతో ముఖ్యమంత్రి ఆమోద ముద్ర లభించిన తక్షణం పెరిగిన పాల ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కేఎంఎఫ్ వర్గాలు చెబుతున్నాయి. -
ఏపీలో పాలధర పెంపు ఏదీ?
హెరిటేజ్ కోసం పాడి రైతుల ప్రయోజనాలు బలి: మంత్రి హరీశ్ సిద్దిపేట: టీడీపీ అధినేత చంద్రబాబు జేబు సంస్థ హెరిటేజ్‌ను రక్షించుకోవడానికి పాడి రైతుల ప్రయోజనాలను బలిపెట్టారని భారీ నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో ఆదివారం మిల్క్‌గ్రిడ్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో విజయ డెయిరీ ఎదగకుండా చేశారని ఆరోపించారు. పాడిపరిశ్రమ రైతులు బతకకుండా వ్యూహాలు పన్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కావడంతో రైతుల సమస్యల మూలాలు తెలిసి లీటర్ పాలధరను రూ. 4 పెంచారని, తద్వారా ఇక్కడి రైతులకు పరిశ్రమ లాభదాయకంగా మారుతోందన్నారు. ఇదే సమయంలో ఏపీలో పాల ధరను అక్కడి ప్రభుత్వం పెంచలేదన్నారు.