breaking news
Prevention of Corruption
-
ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి ఉండకూడదు: సీఎం వైఎస్ జగన్
-
అవినీతి తగ్గించడానికి దృష్టి పెట్టాలి: సీఎం జగన్
-
అవినీతిని అంతం చేయాల్సిందే: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అన్ని స్థాయిల్లో అవినీతిని రూపుమాపడానికి అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అవినీతి నిరోధానికి ఏర్పాటు చేసిన 14400 టోల్‌ఫ్రీ నంబర్‌పై ప్రచార వీడియోలను ఆయన మంగళవారం విడుదల చేశారు. సీఎం జగన్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సందేశంతో ఈ వీడియోలను తయారుచేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎట్టిపరిస్థితుల్లోను అవినీతి ఉండకూడని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో అవినీతిని ఏరివేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. (ఎవరికీ అన్యాయం జరగకూడదు: సీఎం జగన్) వారిద్దరికీ అభినందనలు: సీఎం జగన్ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకోనున్న బండి నారాయణస్వామి, పి. సత్యవతి (అనువాద విభాగం)లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. తెలుగు సాహిత్యానికి ఇరువురు విశేషమైన సేవలను అందించారని ప్రశంసించారు. రాష్ట్రం నుంచి ఇద్దరు రచయితలను ఈ అవార్డులు వరించడం తెలుగువారందరికీ గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. (నారాయణస్వామికి కేంద్ర సాహిత్య పురస్కారం) చదవండి: (ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ) -
స్టాంపులు, రిజస్ట్రేషన్ల శాఖలో అవినీతికి చెక్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పదేపదే నొక్కి చెబుతున్న అవినీతి రహిత, పారదర్శక పాలనకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి మాటలను స్ఫూర్తిగా తీసుకున్న ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ చర్చించుకుని, రిజిస్ట్రార్ల పోస్టింగ్‌లు, బదిలీలకు కొత్త విధానాన్ని రూపొందించి తక్షణమే అమలు చేశారు. అవినీతి కట్టడే లక్ష్యంగా రాష్ట్రంలో అత్యధిక రాబడి ఉన్న 12 రిజిస్ట్రేషన్ కార్యాలయాల సబ్ రిజిస్ట్రార్లుగా కొత్త వారికి పోస్టింగ్‌లు ఇచ్చారు. కొత్తగా ఉద్యోగంలో అడుగుపెట్టేవారు ఉత్సాహంగా, నిజాయతీగా పనిచేస్తారని, అవినీతికి పాల్పడరనే ఉద్దేశంతో ఈ నియామకాలు జరిపారు. ఇందుకోసం రాష్ట్రంలో అత్యధిక రాబడి ఉన్న 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పరిపాలనా సౌలభ్యం పేరుతో కౌన్సెలింగ్ నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి దాఖలాల్లేవ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ద్వారా గ్రూప్–2కు ఎంపికై, ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకుని పోస్టింగ్‌ల కోసం ఎదురు చూస్తున్న 12 మందిని మెరిట్ (గ్రూప్ –2లో వచ్చిన మార్కులు) ఆధారంగా 12 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్లుగా బుధవారం ప్రభుత్వం నియమించింది. గ్రూప్–2 ద్వారా సబ్ రిజిస్ట్రార్లుగా ఎంపికైన వారు మారుమూల చివరి గ్రేడ్‌లో ఉన్న ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్లుగా నియమితులు కావడం మొదటి నుంచి రివాజుగా వస్తోంది. అయితే ఈ పర్యాయం దీనికి పూర్తి భిన్నంగా రిజిస్ట్రేషన్ శాఖ వారికి కీలక స్థానాలను అప్పగించింది. జోన్–1లో విశాఖపట్నం, మధురవాడ, భీమిలి, జోన్–2లో గాంధీనగర్, విజయవాడ పటమట, గుణదల, రాజమండ్రి, జోన్–3లో మంగళగిరి, నెల్లూరు, నల్లపాడు, జోన్–4లో అనంతపురం, కర్నూలు ఆదాయపరంగా ముందున్నాయి. అందువల్ల వీటిని అత్యంత ఫోకల్ కేంద్రాలుగా ఎంపిక చేసిన రిజిస్ట్రేషన్ శాఖ పరిపాలనా సౌలభ్యం పేరుతో (అవినీతి కట్టడి లక్ష్యంగా) ఇక్కడ సబ్ రిజిస్ట్రార్లుగా కొత్తవారిని నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 12 మంది కొత్తవారిని ఆయా ప్రాంతాల్లో నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకూ ఇలా పోస్టింగ్‌లు ఇచ్చిన దాఖలాలు లేవని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ‘‘సాధారణంగా అధిక ఆదాయం ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ పోస్టు ఖాళీ అవుతుందని తెలియగానే పలుకుబడి గల అధికారులు సిఫార్సులు చేయించుకుని, అక్కడికి బదిలీ అయ్యేవారు. కీలకమైన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఖాళీలు ఉండేవి కావు. కొత్తగా సబ్ రిజిస్ట్రార్లుగా ఎంపికైన వారు అప్రధానమైన ప్రాంతాల్లోనే నియమితులయ్యేవారు. మొదటినుంచీ ఇదే విధానం అమలవుతోంది. ఈసారి అవినీతికి చరమగీతం పాడాలన్న లక్ష్యంతో కొత్త ఉద్యోగులను కీలకమైన స్థానాల్లో నియమించాం’’ అని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, ఇన్స్పెక్టర్ జనరల్ వెంకట్రామిరెడ్డి చెప్పారు. పకడ్బందీగా నిబంధనల అమలు కొత్తవారికి పోస్టింగ్‌లు ఇచ్చిన 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మినహా మిగిలిన చోట్ల పోస్టింగులకు ప్రభుత్వం కౌన్సెలింగ్ విధానం పాటించింది. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కేసుల్లో ఉన్న వారికి ప్రధానమైన చోట్ల (ఫోకల్) పోస్టింగులు ఇవ్వరాదని, ప్రధానమైన ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి అప్రధాన ప్రాంతాల్లో, అప్రధాన ప్రాంతాల్లో ఉన్న వారికి ప్రధాన ప్రాంతాల్లో పోస్టింగులు ఇవ్వాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పేర్కొంది. ఈ మేరకు పకడ్బందీ నిబంధనలు రూపొందించింది. ఎక్కడ ఎలాంటి అతిక్రమణలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇన్స్పెక్టర్ జనరల్ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో నోడల్ అధికారులుగా ఉన్న డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్స్/ జిల్లా రిజిస్ట్రార్లు పక్కాగా నిబంధనల ప్రకారమే బదిలీల కౌన్సెలింగ్‌ను బుధవారం నిర్వహించారు. కొత్త రక్తానికి ప్రాధాన్యం ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్–1కు ఎంపికై జిల్లా రిజిస్ట్రార్లుగా నియామకం కోసం ఎదురుచూస్తున్న వారిని ఆరు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్లుగా నియమించాలని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రెండు రోజుల క్రితమే ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే జిల్లా రిజిస్ట్రార్ కేడర్‌లోని వారిని సబ్ రిజిస్ట్రార్లుగా నియమించడం సాంకేతికంగా తప్పవుతుంది. అందువల్ల స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, ఐజీ వెంకట్రామిరెడ్డి వెళ్లి ఉప ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయాన్ని వివరించారు. కొత్తగా ఎంపికైన 12 మంది సబ్ రిజిస్ట్రార్లను అధిక రాబడి ఉన్న 12 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్లుగా నియమిస్తే బాగుంటుందని వారు విన్నవించారు. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్–1కు ఎంపికైన ఆరుగురిని కూడా ఇదే తరహాలో అతి ముఖ్యమైన రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జిల్లాల రిజిస్ట్రార్లుగా నియమిద్దామని తెలిపారు. దీనికి సమ్మతించిన ఉప ముఖ్యమంత్రి ఇందుకు అనుగుణంగా అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గ్రూప్–2లో మెరిట్ ఆధారంగా 12 మంది కొత్త వారిని కీలక ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రార్లుగా నియమించారు. ఆరు ముఖ్యమైన జిల్లాల్లో జిల్లా రిజిస్ట్రార్లుగా త్వరలో కొత్త వారికి పోస్టింగులు ఇవ్వనున్నారు. -
బల్లకింద చేతులు పెడితే ఏడేళ్ల జైలు
న్యూఢిల్లీ: లంచావతారులకు చేదువార్త. బల్లకింద చేతులు పెడితే ఇక ఏడేళ్లు జైల్లో కూర్చోవాల్సిందే. లంచగొండులకు విధిస్తున్న ఐదేళ్ల జైలుశిక్షను ఏడేళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. తదనుగుణంగా అవినీతి వ్యతిరేక చట్టంలో చేసిన సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతేకాదు లంచం కేసులను క్రూరమైన నేరాల జాబితాలో చేర్చింది. తాజా సవరణలతో 1988 నాటి అవినీతి వ్యతిరేక చట్టానికి మరింత పదును పెట్టినట్టైంది. దీనికి ప్రకారం లంచం ఇచ్చినా, తీసుకున్నా నేరంగానే పరిగణిస్తారు. ఇంతకుముందు 3 నెలల నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్ష విధించేవారు. ఇప్పుడు ఈ పరిమితిని ఐదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు పెంచినట్టు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
గతంలో పరిశ్రమలకు చేసిన భూ కేటాయింపులన్నీ రద్దు
మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో 2008వ సంవత్సరం నుంచి పలు పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వం చేసిన భూముల కేటాయింపులన్నీ రద్దు చేయాలంటూ.. అవినీతి నిరోధంపై ఏర్పాటైన మంత్రుల ఉపసంఘం రాష్ట్ర మంత్రివర్గానికి సిఫారసు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర సమాచార, ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఉపసంఘం బుధవా రం హైదరాబాద్‌లోని సచివాలయంలో సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ వివరాలను రఘునాథరెడ్డి వెల్లడించారు. వాన్‌పిక్ ప్రాజెక్టుకు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కేటాయించిన 18,878 ఎకరాలు కేటాయించేందుకు ఒప్పందం జరిగిందని.. అందులో 6,608 ఎకరాలు అప్పగించారని ఆ ఎంఓయూ, కేటాయింపులన్నీ రద్దు చేయాలని నిర్ణయించామన్నారు. అప్పగించిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. అనంతపురం జిల్లా చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు 8,840 ఎకరాలు కేటాయించారని, ఇందులోపెద్ద కుంభకోణం జరిగిందని మంత్రి తెలిపారు. సర్వీసు చార్జీ 15 శాతం వసూలు చేయాల్సి ఉండగా, 2 శాతం మాత్రమే వసూలు చేశారని, ప్రభుత్వానికి రావాల్సిన రూ. 15.19 కోట్ల సొమ్ము ఎగ్గొట్టారని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా చిలకూరు మండలంలో కినెటా పవర్ ప్రైవేటు లిమిటెడ్‌కు వపర్ ప్రాజెక్టుకు కేటాయించిన 814.77 స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.