breaking news
Positive News
-
శభాష్.. గోలూ భాయ్!
భిక్షాటన చేసే యాచకులను చూసి అయ్యో పాపం అనుకుంటాం. కుదిరితే సాయం కూడా చేస్తాం. చీదరించుకునే వారు కూడా ఉంటారు. కానీ ఆ యువకుడు అలా కాదు. ఎవరూ ఊహించని విధంగా స్పందించి అందరి దృష్టిలో హీరోగా నిలిచాడు. అతడు చేసిన పని ఎంతో మందిని ఆకట్టుకుంది. దీంతో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. ఇంతకీ ఎవరతడు, ఏం చేశాడు?బిహార్‌లోని బక్సర్ జిల్లాకు (Buxar district) చెందిన గోలు యాదవ్ అనే యువకుడు ఒక రోజు రైలు ప్రయాణిస్తున్నాడు. అదే సమయంలో తన బోగిలో ఓ అనాథ బాలిక భిక్షాటన చేస్తూ కనిపించింది. ప్రయాణికుల అసౌకర్యకరమైన చూపులు, అనుచిత వ్యక్తీకరణల నడుమ ఆమెను అలా చూడటం గోలు యాదవ్‌కు బాధనిపించింది. ఆమె కోసం ఏదైనా చేయాలని గట్టిగా అనుకున్నాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముందడుగు వేశాడు. తనతో పాటు ఇంటికి వస్తే బాగా చూసుకుంటానని ఆమెను అడిగాడు. ఆ బాలిక ఒప్పుకోవడంతో తన ఇంటికి తీసుకెళ్లాడు.ఇంటికి చేరుకున్న తర్వాత.. గోలు ఆ అమ్మాయి దుస్థితిని తన తల్లిదండ్రులకు వివరించాడు. వారు ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా స్వాగతించారు. ఆమెకు భద్రమైన జీవితంతో పాటు ప్రేమను పంచాలని గోలు భావించాడు. కొద్దిరోజుల తర్వాత తల్లిదండ్రుల అనుమతితో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral) మారడంతో గోలు గొప్పదనం గురించి బయట ప్రపంచానికి తెలిసింది. సంస్కార్ కుమార్ అనే యూజర్ వీరి గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సమాజంలో మంచి మనుషులు ఉన్నారని చెప్పడానికే సోషల్ మీడియాలో కనిపించిన వీరి స్టోరీని తాను పంచుకున్నానని, మెయిన్ స్ట్రీమ్ మీడియా ధ్రువీకరించాల్సి ఉందని పేర్కొన్నారు.చదవండి: మా వాళ్లు వద్దంటున్నారు.. నేను రాజీనామా చేయనునెటిజన్ల స్పందనరియల్ లైఫ్ హీరో అంటూ గోలు యాదవ్‌పై నెటిజనులు (Netizens) ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమెకు ఇల్లు మాత్రమే కాకుండా గౌరవప్రదమైన జీవితాన్ని కూడా ఇచ్చాడని అంటున్నారు. మరీ ముఖ్యంగా నిస్సహాయురాలికి ఆపన్నహస్తం అందించేందుకు ముందుకు రావడం అనేది అత్యంత ప్రశంసార్హమని వ్యాఖ్యానిస్తున్నారు. గోలు యాదవ్ చేసింది తప్పా, ఒప్పా అనేది పక్కపెట్టి.. అతడు స్పందించిన విధానాన్ని మెచ్చుకోవాల్సిందే అంటున్నారు. View this post on Instagram A post shared by Sinu Mohanta (@_sanskarr_kumarc_) -
అన్నం తినిపించిన పోలీసులు
సాక్షి, జేంద్రనగర్ (హైదరాబాద్): రోడ్డు పక్కన అచేతనంగా ఒంటిపై దుస్తులు లేకుండా పడి ఉన్న ఓ మహిళ (45)ను రాజేంద్రనగర్ పోలీసులు ఆదుకున్నారు. దుస్తులు వేసి తినేందుకు ఆహారాన్ని అందించారు. అన్నం కలిపి తినేందుకు సైతం శక్తి లేకపోవడంతో మహిళా కానిస్టేబుళ్లు ఆమెకు అన్నం తినిపించి మానవత్వం చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని హార్టికల్చర్ యూనివర్సిటీ ద్వారం పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో ఓ మహిళ పడి ఉందని 100 నంబర్‌కు సమాచారం అందింది. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. (చదవండి: ప్రధాన మంత్రి ప్రశంసలు అందుకున్న హిమేష్ ) ఓ మహిళ ఒంటిపై దుస్తులు లేకుండా అచేతనంగా పడి ఉండడంతో ఇద్దరు మహిళా పోలీసులను రప్పించి ఆమెకు దుస్తులు వేశారు. మంచినీరు అందించారు. తినేందుకు ఏమైనా ఇవ్వాలని ఆమె సైగలు చేయడంతో పోలీసులు అన్నం తీసుకొచ్చి అందించారు. అన్నం కలిపి నోట్లో పెట్టుకునేందుకు కూడా ఆ మహిళ ఇబ్బంది పడుతుండడంతో మహిళా కానిస్టేబుళ్లు ఆమెకు తినిపించి ఠాణాకు తీసుకొచ్చారు. తన పేరు రాజమణి.. కుమారుడి పేరు మహేశ్ అని మహిళ తెలిపింది. మహిళను హైదర్షాకోట్లోని కస్తూర్బా ట్రస్ట్‌కు తరలించారు. మహిళ అక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు స్థానికంగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.


