breaking news
ponnala lakshaiah Telengana
-
బీఆర్ఎస్లో చేరిన పొన్నాల లక్ష్మయ్య
వరంగల్: బహిరంగసభలో సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య.. సీఎం సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈసందర్భంగా ఆయననుద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘పొన్నాల సీనియర్ నేత. కాంగ్రెస్‌లో అణగారిన వర్గాలకు అవకాశం లేదు.. నాలుగున్నర దశాబ్దాలుగా అంకిత భావంతో పనిచేస్తే చివరికి అవమానమే మిగిలింది.. నాకు బాధేసి ఫోన్లో మాట్లాడి.. పార్టీలోకి రమ్మన్నా.. ఇప్పడు గులాబీ జెండా కప్పుకున్నడు.. అన్ని వర్గాలను బీఆర్ఎస్ ఆదరించి పెద్ద పీట వేస్తుంది’ అని కేసీఆర్ పేర్కొన్నారు. పొన్నాల మనసు గాయపడితే.. బీఆర్ఎస్ మందు వేసి నయం చేస్తుందని చెప్పుకొచ్చారు. -
అహంకారి.. పచ్చి అవకాశవాది
కేసీఆర్‌పై టీ-పీసీసీ అధ్యక్షుడు ‘పొన్నాల’ ధ్వజం కరీంనగర్ , టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఓ పిల్లకాకి.. అహంకారి, పచ్చి అవకాశవాది..తెలంగాణ ద్రోహి అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. రాజకీయ పార్టీగా మారి 35రోజులు కూడా కాని పిల్లకాకి నుంచి 125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న మేం మేనిఫెస్టోను కాపీకొట్టడమా? అంటూ మండిపడ్డారు. కరీంనగర్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి పదవి దక్కడం లేదనే నిరాశ నిస్పృహలతోనే అహంకారిగా మారాడని ఆరోపిం చారు. సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్ లాంటి మహోద్యమాలు జరిగినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు.. ఫాంహౌస్‌లో పడుకున్నాడా అని ప్రశ్నించారు. ‘ఒక్క టమాటా మొక్కకు 300 కిలోల టమాటాలు కాస్తాయట.. ఎకరా పంటకు రూ.కోటి సంపాదించొచ్చట.. ఈ డబ్బులన్నీ హెలిక్యాప్టర్లకు ఖర్చు పెడుతున్నావా...’ అంటూ ఎద్దేవా చేశారు.