Pink color
-
జైపూర్‌లో గులాబీ రంగు ఏనుగు
-
అత్యంత అరుదైన పావురం!చూస్తే..షాకవ్వడం ఖాయం
పావురం అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. పూర్వం వాటిని సమాచారాన్ని చేరే వేసే సాధనాలుగా ఉపయోగించేవారు. ఇటీవల ఈ పావురాలను పెంచేందుకు భయపడే పరిస్థితులు తలెత్తాయి కూడా. వాటి విసర్జకాల వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని పలువురు హెచ్చరించడం జరిగింది. దీంతో ఒకరకంగా వాటిని పెంచడం, ఆహారం వేయడం తగ్గించారు ప్రజలు. వాటి సంఖ్యను తగ్గించాలని చూస్తున్నారు ఆరోగ్య నిపుణులు కూడా. ఇలా ఉండగా గూలాబీ రంగులో ఉన్న ఓ పావురం ప్రజల ముందు హఠాత్తుగా ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. యూకేలోని గ్రేట్ మాంచెస్టర్ వద్ద టౌన్ సెంటర్ సమీపంలో వాకింగ్ చేసేవాళ్లు ఓ పక్క, మరోవైపు పోలీసుల పెట్రోలింగ్‌తో జన సందోహంగా ఉన్న ప్రదేశంలో ఈ పక్షి కనువిందుఉ చేసింది. ఏదైన రంగు దానిపై పడటం వల్ల అలా ఉందా అని అనుమానాలు కూడా మొదలయ్యాయి. నిజానికి పావురాలు తెలుపు, నలుపు, బుడిద రంగులోనే ఎక్కువగా ఉంటాయి. అవేమి కాకుండా పింక్ రంగులో ఉండడం అనేది అత్యం అరుదు అనే చెప్పాలి. మొదటగా చూసిన వెంటనే దాన్ని పావురమే ప్రజలు అనుకోలేదు. ఏదో వింత పక్షి అనే అనుకున్నారు అంతా. కాసేపటికి గానీ అర్థకాలేదు అది పింక్కలర్లో ఉన్న ఓ పావురమేనని. ఇదిలా ఉండగా గతంలో న్యూయార్క్ నగరంలో జెండర్ రివీల్ పార్టీలో అట్రాక్షన్ కోసం అని ఓ పావురానికి గూలాబిరంగు వేసి ఉంచారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ పావురాన్ని రక్షించడమే గాక అది పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దాన్ని వైల్డ్ బర్డ్ ఫండ్‌కు తరలించారు. అలానే ఈ పక్షికి కూడా ఎవరైన గూలాబీ రంగు వేశారేమోనని సందేహిస్తున్నారు. అయితే ఈ పావురం బంధింపబడలేదు. మిగతా పావురాల్లో స్వేచ్ఛగా ఎగురుతూ కనిపించింది. ఎందువల్ల ఆ పావురం ఇలా గూలాబీ రంగులో ఉందనేది తెలియాల్సి ఉంది. అందుకు సంబంధించిన ఫోటోను నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో చూసిన యూకేలోని స్థానికులు, పోలీసు అధికారులు తాము కూడా ఈ వింత పావురాన్ని చూసినట్లు తెలపడం విశేషం. Has anyone else seen this pink pigeon in Bury and does anyone know why it is pink?! #Bury #pinkpigeon #pigeon #pink #bird pic.twitter.com/wrx63R21TP — Harriet Heywood (@Heywoodharriet_) September 9, 2023 (చదవండి: కుక్కలా మారిన వ్యక్తి..ఆడ కుక్కతో ప్రేమలో..) -
ఆకాశంలో ‘గులాబీ’ మాయతో హడలెత్తిన జనం.. ఏలియన్స్ పనేనా?
కాన్బెర్రా: ఆకాశం ఏ రంగులో ఉంటుందంటే నీలం అంటూ టక్కున చెప్పేస్తారు. కానీ.. ఆకాశంలో కొద్ది ప్రాంతం గులాబీ రంగులోకి మారితే ఆశ్చర్యమే కాదు.. ఏదో జరుగుతోందనే భయం కూడా కలుగుతుంది. సినిమాల్లో చూపించినట్లుగా ఆకాశం నుంచి ఎవరో భూమిపైకి వస్తున్నప్పు ఏర్పడిన మాదిరిగా ఉంటే.. అది మరింత భయాన్ని పెంచుతుంది. అలాంటి అనుభూతే ఆస్ట్రేలియాలోని మిల్దురా ప్రజలకు ఎదురైంది. గత బుధవారం సాయంత్రం వేళ ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఆకాశం లేత గులాబీ రంగులోకి మారిపోయింది. కొందరు దానిని అద్భుతం అంటూ వర్ణించగా.. కొందరు గ్రహాంతర వాసుల పనేనుంటూ భయాందోళనలకు గురయ్యారు. గులాబీ రంగులోకి మారిన ఆకాశం ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. గులాబీ రంగు కనిపించిన ప్రాంతం మధ్యలో భూమిని నుంచే కాంతి ప్రసారమవుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో భూమిపైన ఉన్న దాని నుంచే ఆ కాంతి వెలువడుతోందని, దాని ద్వారానే ఆకాశం గులాబీ రంగులోకి మారిపోయిందని పలువులు విశ్లేషించారు. మరోవైపు.. దీనిపై కొందరు నెటిజన్లు జోకులు పేల్చారు. అది ఏలియన్స్ సృష్టిగా కొందరు పేర్కొనగా.. మరికొందరు మాహా అద్భుతం అంటూ తెలిపారు. గులాబీ రంగుకు కారణమదే.. అయితే.. ఆకాశంలో ఏర్పడిన గులాబీ రంగుకు కారణం ఆ ప్రాంతంలో ఓ ఫార్మాసిటికల్ సంస్థ సాగు చేస్తున్న గంజాయి మొక్కలేనని తేల్చారు. ‘మా సంస్థలో కొత్త సాగు ప్రాంతం కోసం ప్రయోగాలు చేస్తున్న క్రమంలో ఆకాశంలోకి కాంతి ప్రసరణ జరగటం స్థానికులు గమనించారు. అది సోలార్ ఫ్లేర్ లేదా ఇంటర్ డైమెన్షనల్ పోర్టల్ కాదని మేము నమ్మకంగా చెప్పగలం.’ అని ట్విట్టర్ వేదికగా తెలిపింది ఫార్మా సంస్థ. గంజాయి మొక్కలు ఎదిగేందుకు వివిధ రకాల కాంతి అవసరమవుతుందని, పూలు పూసే సమయంలో ఎర్ర లైట్ ఉపయోగించాలని తెలిపారు ఫార్మా సంస్థ సీఈవో పీటర్ క్రాక్. కొత్త సాంకేతికతను ఈ ఏడాదే తీసుకొచ్చామని, ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆకాశంలో అద్భుత దృశ్యం ఏర్పడటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. An eerie pink glow lit up over Mildura - https://t.co/5vUMebCsDb pic.twitter.com/q2mxsSpWXz — Cann Group (@Cann_Group) July 22, 2022 ఇదీ చదవండి: Sri Lanka: శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్తత.. నిరసనలపై కొత్త అధ్యక్షుడి ఉక్కుపాదం! -
గులాబీ రంగు అమ్మాయిలకే కాదు బ్రిటిష్ ఆర్మీకీ ఇష్టమే!.. పింక్ పాంథర్స్ విశేషాలు తెలుసా!
అమ్మాయిలకు గులాబీలన్నా.. గులాబీ రంగన్నా ఇష్టం అంటారు. నిజానికి గులాబీ రంగు బ్రిటిష్ ఆర్మీకి ఇష్టమట. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఎడారి ప్రాంతాల్లోని సైనిక దళాలకు సహాయం చేసిన వాహనాల రంగు ఈ గులాబీనే. వీటికి ‘పింక్ పాంథర్స్’ లేదా ‘పింకీస్’అని పేరు. సాధారణంగా అడవులు, కొండల్లో కాపలాకాసే సైనికులను, శత్రువులు త్వరగా గుర్తించకుండా ఉండటానికి ఆర్మీ ఎక్కువగా ఆకుపచ్చ, గోధుమరంగులను ఉపయోగిస్తుంది. కానీ, ఈ రంగులు ఎడారి ప్రాంతాల్లో ఉపయోగపడవు. ఇందుకోసం 1968– 1984 బ్రిటిష్ ఎస్ఏఎస్ ఈ పింక్ పాంథర్ జీప్లను ఉపయోగించింది. ఈ ఉపాయం బాగా పనిచేసింది. దగ్గరగా చూస్తే కాని కనిపించని ఈ వాహనాలు ఎంతోమంది సైనికుల ప్రాణాలను కాపాడాయి. తర్వాత ఇదే ఉపాయాన్ని ఇంకొన్ని దేశాలు కూడా ఉపయోగించాయి. అయితే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వీటి వినియోగం ఆగిపోయింది. అప్పట్లో మిగిలిపోయిన వాటిలో ఇరవై వాహనాలను ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. 2019లో నిర్వహించిన ఓ వేలంలో 1968 ల్యాండ్‌రోవర్ 2ఏ పింక్ పాంథర్ రూ. 64 లక్షలకు అమ్ముడుపోయింది. మిగిలినవి మ్యూజియంలో ప్రదర్శనల్లో ఉపయోగిస్తున్నారు. చదవండి: శీతాకాలంలో చలిని తట్టుకోవాలంటే ఇది ఎక్కువగా తినాలి..! -
పత్తిపై ‘గులాబీ’ పంజా
సాక్షి, హైదరాబాద్: పత్తిపై గులాబీ రంగు పురుగు పంజా విసురుతోంది. మూడేళ్ల క్రితం పంటపై పెద్దెత్తున దాడి చేసిన ఈ పురుగు ఇప్పుడు మరోసారి విజృంభిస్తుందన్నది శాస్త్రవేత్తల అంచనా. ఇప్పటికే ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ రూరల్, నల్లగొండ, సూర్యాపేట, నిర్మల్, ఆసిఫాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల సహా మిగిలిన జిల్లాల్లోనూ పత్తిని పీడిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పురుగు ప్రారంభ దశలోనే ఉన్నా, మున్ముందు దీని విస్తరణ మరింత వేగవంతం కానుందని వ్యవసాయ శాస్త్రవేత్త ఒకరు హెచ్చరించారు. ఒకచోట గులాబీ రంగు పురుగుంటే, చుట్టుపక్కల 30–40 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుందని విశ్లేషిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అనేకచోట్ల గులాబీ పురుగును గుర్తించినట్లు అక్కడి వ్యవసాయాధికారులు చెబుతున్నారు. మరో వారంలోగా దాని ఉధృతి కనిపించనుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదు లక్షల ఎకరాల్లో... రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 60.52 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. వాణిజ్య పంట కావడంతో పత్తిని ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది. మద్దతు ధర కూడా ఆశాజనకంగా ఉంది. ఇలాంటి సమయంలో గులాబీ పురుగు పత్తి చేలల్లో కనిపిస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల ఎకరాల్లో పత్తి పంటకు ఈ పురుగు సోకినట్లు అంచనా. లింగాకర్షక బుట్టల ఏర్పాటుతో పురుగును గుర్తించవచ్చు. ఒక బుట్టలో నాలుగు పురుగులు పడితే ఉధృతి అధికంగా ఉందని అంచనా. పురుగును గుర్తించాక అవసరమైన క్రిమిసంహారక మందులు వేస్తే చనిపోతుంది. అయితే లింగాకర్షక బుట్టలను సకాలంలో సరఫరా చేయడంలో వ్యవసాయశాఖ యంత్రాంగం విఫలమైందని, దీంతో పురుగు ఉధృతి పెరుగుతోందని రైతులు మండిపడుతున్నారు. బీటీ–2 విత్తన వైఫల్యమే... బీటీ పత్తి విత్తనాలు రాకముందు కాయతొలిచే పురుగుల ఉధృతితో తీవ్ర ఇబ్బందులు ఉండేవి. బీటీ రాకతో ఈ కాయతొలిచే శనగ పచ్చ పురుగు, మచ్చల పురుగు, పొగాకు లద్దె పురుగు, గులాబీ రంగు పురుగు తాకిడి తగ్గింది. కానీ, తర్వాత పరిస్థితులు మారాయి. బీటీ–1 టెక్నాలజీని 2002లో మోన్శాంటో పరిచయం చేసింది. 2006 వరకు బాగానే ఉన్నా తర్వాత ఈ బీటీ–1 గులాబీరంగు పురుగును నాశనం చేసే శక్తి కోల్పోయింది. దీంతో దాని స్థానే బీటీ–2ని తీసుకొచ్చింది. 2012 నాటికి దీనికి కూడా గులాబీ రంగు పురుగును తట్టుకునే శక్తి నశించింది. తర్వాత బీటీ–3ని తీసుకొచ్చినా.. దీంతో జీవ వైవిధ్యానికే నష్టం జరుగుతుందని నిర్ధారణ కావడంతో దేశంలో దానికి అనుమతివ్వలేదు. బీటీ టెక్నాలజీ విఫలమైనా దేశంలో బీటీ–2 విత్తనాలనే రైతులు వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కేంద్రం ప్రత్యామ్నాయం వైపు చర్యలు తీసుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. ఎకరాకు సరాసరిన 10–12 క్వింటాళ్ల వరకు పత్తి ఉత్పత్తి కావాల్సి ఉండగా, గులాబీ రంగు పురుగుతో 6–7 క్వింటాళ్లకు పడిపోయింది. పైగా గులాబీ రంగు పురుగుతో పత్తి పంట పోయినా రైతులకు బీమా సౌకర్యమే లేదు. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం గులాబీ రంగు పురుగుతో నష్టపోయిన రైతులకు ఆర్థికసాయం చేసింది. పైగా విత్తన కంపెనీల నుంచి కూడా పరిహారం ఇప్పించింది. గులాబీ రంగు పురుగుతో నష్టం ఇలా.. ఈ పురుగు తాకిడి పంట పూత దశ నుంచి మొదలై పంట చివరి దశలో ఎక్కువగా నష్టపరుస్తుంది. గులాబీ రంగు పురుగు సోకిన పత్తి కాయలను చూస్తే దాంట్లో దూది నల్లగా మారి, నాణ్యత దెబ్బతిని ఉంటుంది. బరువు తగ్గటంతో దిగుబడి తగ్గుతుంది. లేత కాయలపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. కాయలపై 2 మిల్లీమీటర్ల పరిమాణం వరకు రంధ్రాలు కనిపిస్తాయి. పంట కాలాన్ని నవంబర్ తర్వాత పొడిగించడం వల్ల కూడా గులాబీరంగు పురుగు వస్తుంది. లింగాకర్షక బుట్టలతో పురుగును నియంత్రించవచ్చు. పంట నాశనం 12 ఎకరాల్లో పత్తి సాగు చేశా. అధిక వర్షాలకు తోడు పం టకు గులాబీ రంగు పురుగు ఆశించింది. పూత, కాతను పురుగు నాశనం చేసింది. ఎకరాకు రెండు క్వింటాళ్లకు మించి దిగుబడి వచ్చేలా లేదు. – మిర్యాల విక్రమ్‌రెడ్డి, బీరోలు, ఖమ్మం జిల్లా కాయ రాలిపోయింది 8 ఎకరాల్లో పత్తిని సాగు చేశా. కౌలుతో కలుపుకొని ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి అయ్యింది. గులాబీ రంగు పురుగుతో కాయ రాలిపోయింది. అధిక వర్షాలు కూడా తోడుకావడంతో పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. – బాగం రవి,సిద్దిక్‌నగర్, ఖమ్మం జిల్లా దున్నేద్దామనుకుంటున్నా... 15 ఎకరాల్లో పత్తి వేశా. అందులో నాలుగు ఎకరాలు కౌలు తీసుకున్నా. ఒకసారి దూది తీసినం. ఐదు క్వింటాళ్లు వచ్చింది. ఇప్పుడు రెండోసారి తీద్దామంటే పురుగువచ్చింది. ఎకరానికి రూ. 35 వేలు పెట్టుబడి పెట్టిన. పంట నాశనం కావడంతో దీన్ని దున్నేద్దామని అనుకుంటున్నా. – అండె అశోక్, పొన్నారి, ఆదిలాబాద్ జిల్లా -
మెక్‌గ్రాత్ చేతికి గులాబీ టోపీలు
సిడ్నీ టెస్టు మూడో రోజు భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ సంతకాలతో కూడిన గులాబీ రంగు టోపీలను దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌కు తిరిగిచ్చారు. రొమ్ము క్యాన్సర్‌తో మృతి చెందిన మెక్‌గ్రాత్ భార్య జేన్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌కు నిధుల సమీకరణలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న తెలిసిందే. ఇందులో భాగంగా ఏటా జనవరిలో నిర్వహించే తొలి టెస్టులో ఆటగాళ్లు ‘పింక్’ కలర్లోని క్రీడా సామాగ్రితో మైదానంలో దిగుతారు. దీనికోసం భారత కెప్టెన్ కోహ్లి సైతం గులాబీ రంగు గ్రిప్‌తో బ్యాటింగ్‌కు దిగాడు. ఇదే సందర్భంలో మ్యాచ్‌కు ముందురోజు ఇరు జట్ల ఆటగాళ్లకు గులాబీ టోపీలు ఇచ్చారు. వీటినే ఆటగాళ్లు శనివారం తిరిగిచ్చారు. దీనిపై ‘మైదానంలోనే కాదు... బయట కూడా భారత క్రికెట్ జట్టు అభిమానం పొందింది. అద్భుతమైన సహకారం’ అంటూ మెక్‌గ్రాత్ ఫౌండేషన్ ట్వీట్ చేసింది -
పింక్ బాబా
చేతనబడి ఐదేళ్లు వైద్యం చదివితే డాక్టర్ అవుతారు. ఐదు వేళ్లను గాలితో తిప్పి మంత్రం వేస్తే భూతవైద్యుడు అవుతాడు. అయితే ఈ భూతవైద్యుడు... మంత్రానికి మందు కలిపాడు. మాయలు చేశాడు. పింక్ రంగు దెయ్యాన్ని పట్టేశాడు. జనవిజ్ఞానవేదిక వాళ్లు వచ్చి ఇతడి అసలు రంగుని బయటపెట్టేశారు! అది అనంతపురం జిల్లా, బుక్కపట్నం మండలంలోని మరాలాగ్రామం. గ్రామానికి ఒక చివరగా విసిరేసినట్లుగా ఉంది బాలే నాయక్ తండా. మార్చి నెలాఖరు రోజులు. ఎండలు మండుతున్నాయి. ఆ తండాలో మంగ్లీబాయి, భీకే నాయక్ దంపతుల ఇంటి జనం గుమిగూడి ఉన్నారు. మంగ్లీబాయి ఇంటి ముందు అరుగు మీద కూర్చుని ఉంది. ఆమె కొడుకు ఉదయ్‌కిరణ్ పదేళ్ల వాడు. తల్లి ఒళ్లో తల పెట్టుకుని అరుగుమీద అచేతనంగా పడుకుని ఉన్నాడు. ‘ఏమైంది’.. ఒకరినొకరు అడుగుతున్నారు. ఇంతలో నాగులయ్య రంగ ప్రవేశం చేశాడు. ఆ తండా అంతటికీ వైద్యుడు ఆయనే. భూతవైద్యుడూ ఆయనే. వస్తూనే ఆ పిల్లాడి నాడి పట్టుకుని చూశాడు. నుదురు తాకి చూశాడు... తల పంకిస్తూ ‘పిల్లాడికి దెయ్యం పట్టింది’ అని ఒక్కమాటలో నిర్ధారించేశాడు. కుర్రాడిని లేపి కూర్చోబెట్టి ముఖం మీద నీళ్లు చల్లాడు. ఇంటి ముందు నేల మీద నీళ్లు చల్లి ముగ్గు వేశాడు. సాంబ్రాణి ధూపం వేసి, అగరువత్తి వెలిగించాడు. తమలపాకుల మధ్య వక్కలు పెట్టాడు. మంగ్లీబాయి బిడ్డను తడుముకుంటూ ఆకాశంలోకి చూస్తూ దణ్ణాలు పెట్టుకుంటోంది. భయంతో వణికిపోతున్నాయామె చేతులు. నాగులయ్య సంచిలో నుంచి దాకీ బొమ్మను బయటకు తీశాడు. దాన్ని చూడగానే అందరూ భయకంపితులయ్యారు. దాకీ బొమ్మ అంటే కీడుబొమ్మ. ఆ బొమ్మను తీశాడంటే దెయ్యాన్ని పారదోలడానికేనని, నాగులయ్య దెయ్యాన్ని ముగ్గులోకి రప్పిస్తాడని అక్కడ ఉన్న వారందరికీ గట్టి నమ్మకం. దాకీ బొమ్మ తీశాడంటే పిల్లాడికి సోకింది చిన్న గాలి కాదనే నిర్ధారణకు వచ్చేశారు. ఆ బొమ్మను ముగ్గు మధ్యలో పెట్టాడు నాగులయ్య. మంత్రాలు చదువుతున్నాడు. అది ఏ భాషో తెలియడం లేదు. స్వరంలో తీవ్రతను బట్టి ఎవర్నో తిడుతున్నాడని మాత్రం అర్థమవుతోంది. ఆ బొమ్మను ముగ్గులో పెట్టిన కొద్ది క్షణాలకే నాగులయ్య ముఖం రౌద్రంగా మారిపోయింది. కొప్పు ముడి విప్పి జుట్టు విరబోసాడు. మంత్రాలు చదవడంలో స్వరం పెంచాడు. తననెవరో గట్టిగా కొట్టినట్లు విసురుగా పక్కకు పడిపోయాడు. ఒక్క క్షణం మంత్రాలు ఆపి ‘నన్నే పడేస్తావా, నీ అంతు చూస్తా’ అంటూ గుప్పెట్లోకి సాంబ్రాణి తీసుకుకి విసురుగా నిప్పుల మీద చల్లాడు. సంచిలో నుంచి ఇంకా ఏవేవో వస్తువులు బయటకు తీశాడు. గట్టిగా అరుస్తూ నాగులయ్య మధ్య మధ్యలో విరుచుకు పడిపోతున్నాడు. మళ్లీ లేస్తున్నాడు. పూజ తంతు పూర్తి కావస్తోంది. పిల్లాడిని ముగ్గు దగ్గరకు తెచ్చి కూర్చోబెట్టమన్నాడు. పిల్లాడి కనురెప్పలు తెరిచి చూశాడు. చేతులను చాపించి అరచేతులను తెరిచి చూశాడు. ‘త్వరగా సున్నం తీసుకురండి’ అని గట్టిగా అరిచాడు. అక్కడే ఉన్న మంగ్లీబాయి కూతురు పరుగున వెళ్లి సున్నం పిడత తెచ్చింది. ‘పిల్లవాడి చేతికి సున్నం రాయి’.. అదే కంచుకంఠంతో అరిచాడు. భీకూ నాయక్ భయపడుతూనే సున్నం తీసుకుని ఉదయ్‌కిరణ్ అరచేతికి రాశాడు. అంతే... సున్నం రాసినంత మేర చేయి ముదురు గులాబీరంగులోకి మారిపోయింది. నాగులయ్య ముఖం విజయగర్వంతో వెలిగిపోయింది. ‘అమ్మో! గాలి దెయ్యమే’ అంటూ గుసగుసలు మొదలయ్యాయి. ‘ఇట్లాంటి దెయ్యాలనెన్నింటినో వదిలించాను. ఇదో లెక్కా’ అంటూ పెద్దగా నవ్వి... మళ్లీ మంత్రాలు మొదలెట్టి పూజతంతు త్వరగానే ముగించాడు. గిన్నెలో మజ్జిగ తెప్పించాడు. సంచిలో నుంచి బిట్వాకు తీసుకుని అరచేతుల్లో వేసి నలిపి మజ్జిగలో కలిపి పిల్లాడి నాలుక మీద పిండాడు. కొద్దిసేపటికి మిగిలిన మజ్జిగను కూడా తాగించాడు. ‘పిల్లాడిని పట్టిన దెయ్యం వదిలింది. అయినా దాని ఆశ తొందరగా చావదు. ఈ చుట్టుపక్కలే తిరుగుతూ ఉండి మళ్లీ పిల్లాడి మీద వాలుతుంది. వరుసగా మూడు రోజులు ఇక్కడే ఇదే సమయానికి ముగ్గుపెట్టాలి. ఆ తర్వాత అమావాస్య రోజు పెద్ద పూజ చేస్తే తప్ప పూర్తిగా వదలదు’ అంటూ సంచి సర్దుకున్నాడు నాగులయ్య. ఉదయ్‌కిరణ్ కొంత వరకు సాంత్వన పడుతున్నాడు. స్కూలుకెళ్లడం లేదు, కానీ మంచం మీద పడుకోకుండా ఇంట్లో తన పనులు చేసుకుంటున్నాడు. నాగులయ్య రెండవ రోజు, మూడవ రోజు పూజ చేసి వెళ్లాడు. ఇక అమావాస్య రోజు పూజ భారీ ఎత్తున జరగాలి. మేకను బలివ్వాలి. తాంబూలంలో డబ్బు పెట్టాలి. పిల్లాడి నిలువెత్తు ధాన్యం పోయాలి. ఊర్లో డబ్బు వడ్డీకి అప్పిచ్చే గోవిందు దగ్గరకెళ్లాడు భీకే నాయక్. అవతల కొడుకు ప్రాణం. దెయ్యం తిరగబెడితే ఇక పిల్లాడు దక్కడేమోననే భయమే... ఎంత వడ్డీకైనా డబ్బు అప్పు తీసుకునే తెగువను తెస్తుంది. తండా అంతటా నాగులయ్య పెద్ద పూజ చేస్తాట్ట అని తెలిసింది. వెళ్లి చూడాలనే ఉత్సుకత అందరిలోనూ పెరిగింది. విషయం ఆ ఊర్లోనే ఉన్న ‘యంగ్ ఇండియా’ ప్రతినిధికి కూడా తెలిసింది. అతడు పూజ సమయానికి భీకే నాయక్ ఇంటికి చేరాడు. అతడిని చూడగానే నాగులయ్య ముఖం జేపురించింది. ‘ఫినాప్తలీన్ పొడి ఉందా, పర్గోలాక్స్ మాత్రలున్నాయా నాగులయ్యా’ అనగానే భయంతో వణికిపోయాడు. అమావాస్య పూజ ఆగిపోయింది. ఉదయ్‌కిరణ్ సంఘటనతో తండా చైతన్యవంతం అయింది. అప్పటి నుంచి నాగులయ్య ఆ ఊళ్లో ఎవరికీ భూతవైద్యం చేయలేదు. ఆ తండా వాసులు అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్తున్నారు. తండాలోని పిల్లలు, యువత సరదాగా పర్గోలాక్స్ మాత్రను పొడిచేసి చేతికి అద్దుకుని దానిపై తడి సున్నం రాసి గులాబీరంగులోకి మారిన చేతులను చూస్తూ ‘అరె! నీకు దెయ్యం పట్టిందిరా’ అంటూ ఒకరినొకరు ఆటపట్టించుకోసాగారు. ఇప్పుడు ఉదయ్‌కిరణ్ ఖరగ్‌పూర్ ఐఐటిలో చదువుతున్నాడు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి నాగులయ్య ఎంత తెలివైన వాడంటే... రోగిని చూడగానే వ్యాధి ఏమిటనేది పట్టేస్తాడు. తన వైద్యంతో నయం అయ్యే వ్యాధి అయితేనే కేసు టేకప్ చేస్తాడు. తనకు చేతగానిదయితే ‘ఇది నన్నే చంపేసే దెయ్యం. పెద్ద దేవుళ్లకు మొక్కాలి’ అంటూ ఇతర ఊళ్లలో ఉన్న గుళ్లకు పంపిస్తాడు. ఉదయ్కిరణ్కి వడదెబ్బ కొట్టిందని గ్రహించాడు. మజ్జిగ, బిట్వాకు పసరుతో స్వస్థత చేకూరుతుందనీ తెలుసు. అయితే సాధారణ వైద్యానికి భూతవైద్యం ముసుగు వేసి ఎక్కువ డబ్బు గుంజేవాడు. తండా అందరికీ వైద్యం చేసే నాగులయ్య... తనకు అనారోగ్యం వస్తే అల్లోపతి డాక్టర్ దగ్గరకు వెళ్లేవాడు. ఒకరోజు విడిగా కూర్చుని నీకు నిజంగా శక్తులున్నాయా అని నేనడిగితే పెద్దగా నవ్వేసి ‘శక్తులుంటే నేనిలా ఎందుకుంటాను’ అన్నాడు. నాకు తెలిసిన వైద్యంతో ఏడాదంతా భుక్తి గడవదు. అందుకే ఇదంతా అని అసలు విషయం చెప్పేశాడు. - ఎస్. శంకర శివరావు, కన్వీనర్, జెవివి నేషనల్ మేజిక్ కమిటీ ఉదయ్‌కిరణ్ ఎందుకు పడిపోయాడంటే... బాలే నాయక్ తండా మరాలా గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 1997 ప్రాంతంలో ఊరికీ తండాకూ మధ్య పెద్ద చింతతోపు, ఈతవనం ఉండేవి. వాటి మధ్య గుండ్లవాగు. చింతతోపులో దెయ్యాలు తిరుగుతుంటాయని నమ్మేవారు. మార్చినెలలో మధ్యాహ్నం స్కూలు వదిలిన తర్వాత ఉదయ్‌కిరణ్, అక్కతో కలిసి ఆకలి కడుపుతో, దాహంతో పిడచకట్టుకు పోయిన నాలుకను లాలాజలంతో ఆర్చుకుంటూ రెండు కిలోమీటర్లు నడిచి వస్తున్నారు. ఇంతలో పెద్ద ఎత్తున లేచిన సుడిగాలి దాటికి పడిపోయాడు. -
రంగుల్లో పింఛన్ కార్డులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేయనున్న వివిధ సామాజిక భద్రతా పింఛన్ కార్డులకు రంగులు ఖరారయ్యాయి. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అధికారులు నమూనా పింఛన్ కార్డులను 20 రకా ల రంగుల్లో రూపొందించగా వాటిలో మూడింటిని సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. వృద్ధాప్య పింఛన్ కార్డుకు గులాబీ రంగును ఖరారు చేయగా, వికలాంగ పింఛన్ కార్డుకు ఆకుపచ్చ రంగు, వితంతు పింఛన్లకు ఉదారంగు(వయోలెట్)ను ఎంపిక చేశారు. పింఛన్‌కార్డుల జారీకి గడువు సమీపిస్తున్నా, దరఖాస్తుల ప్రక్రియ మాత్రం నత్తనడకనే సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 39.95 లక్షల దరఖాస్తులు రాగా, శుక్రవారం నాటికి 24.30లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఆహారభదత్ర కార్డులకు సంబంధించి మొత్తం 92.22లక్షల దరఖాస్తులకు గాను 22.68 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయింది.


