breaking news
penal interest
-
రూ. వేల కోట్ల చార్జీల ఎఫెక్ట్: బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు 2018 నుంచి జరిమానా ఛార్జీల రూపంలో ఖాతాదారుల నుంచి రూ. 35,000 కోట్లకు పైగా వసూలు చేశాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటుకు తెలిపింది. ఇందులో మినిమమ్ బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవడంపై రూ.21,044.4 కోట్లు, అదనపు ఏటీఎం లావాదేవీల కోసం రూ.8,289.3 కోట్లు, ఎస్ఎంఎస్ సేవల ద్వారా రూ.6,254.3 కోట్లు వసూలు చేశాయి. బ్యాంకులు చార్జీల రూపంలో కస్టమర్ల నుంచి ఇన్ని వేల కోట్లు వసూలు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సురక్షిత రుణ విధానాలపై తన ఆదేశాలలో భాగంగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన రుణగ్రహీతలపై జరిమానా రూపంలో అదనపు వడ్డీని విధించవద్దని బ్యాంకులను కోరింది. బ్యాంకులు జరిమానా రూపంలో విధించే వడ్డీలు, ఛార్జీలను ఆదాయ మార్గంగా చూడకూడదని, ఒప్పందం ప్రకారం విధించే వడ్డీని మించి అదనపు వడ్డీని కస్టమర్ల నుంచి వసూలు చేయడానికి వీల్లేదని ఆర్బీఐ ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. రుణ ఖాతాలపై విధించే జరిమానా ఛార్జీలను నియంత్రించాలని ప్రతిపాదించిన ఏప్రిల్ 12 నాటి ముసాయిదా సర్క్యులర్‌కు ప్రతిస్పందనగా ఆర్బీఐ ఆదేశాలను జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలు ఇవే.. నిబంధనల ఉల్లంఘించినందుకు రుణ ఖాతాలపై ఎలాంటి వడ్డీ విధించకూడదు. ఒక సారి అపరాధ రుసుము విధించిట్లయితే, ఈ ఛార్జీలపై అదనపు వడ్డీ వేయకూడదు. వసూలు చేసే వడ్డీపై అదనంగా ఎటువంటి వడ్డీలు కానీ, చార్జీలు కానీ విధించకూడదు. జరిమానాలు సహేతుకంగా నిబంధనల ఉల్లంఘనల తీవ్రతకు అనుగుణంగా ఉండాలి. ఏదైనా నిర్దిష్ట రుణ ఉత్పత్తిపై ఇవి మరీ ఎక్కువగా ఉండకూడదు. వ్యక్తిగత రుణగ్రహీతలకు విధించే జరిమానా ఛార్జీలు.. ఇతర రుణగ్రహీతలకు విధించే దాని కంటే ఎక్కువగా ఉండకూడదు. జరిమానా మొత్తం, విధించడానికి గల కారణాలను ఆయా బ్యాంకులు, సంస్థలు స్పష్టంగా వెల్లడించాలి. సురక్షిత రుణ విధానాలకు సంబంధించిన కొత్త నిబంధనలు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే, ఇవి క్రెడిట్ కార్డ్‌లు, బాహ్య వాణిజ్య రుణాలు, వాణిజ్య క్రెడిట్లు, స్ట్రక్చర్డ్ ఆబ్లిగేషన్లకు వర్తించవు. ఇదీ చదవండి: Search of Unclaimed deposits: బ్యాంకుల్లో మిగిలిపోయిన డిపాజిట్లు.. మీవీ ఉన్నాయా? ఆర్బీఐ పోర్టల్‌లో చెక్ చేయండి.. -
ఎస్బీఐ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు!
మాజీ ఉద్యోగులు, రైతులు, వితంతువులు నుంచి వసూలు చేసే పీనల్, ఇతర వడ్డీరేట్ల విషయంలో ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్బీఐ కఠినతరమైన విధానాన్ని అవలంభిస్తున్నట్టు తెలుస్తుందని దానిలో నిజనిజాలు వెల్లడించాలని రాజ్యసభలో ఆర్థిక మంత్రిత్వశాఖను వైస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, హర్యానాల్లో ఈ విధమైన పాలసీని అవలంభిస్తున్నట్టు తెలిసిందని పేర్కొన్నారు. రుణాల వసూల విషయంలో ఎస్బీఐ పెట్టే ఒత్తిడిని తట్టుకోలేక పలువురు మాజీ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్న దాఖలు కూడా ఉన్నాయని, అసలు ప్రభుత్వానికి దీనిపై అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. హర్యానాలోని ఎస్బీఐ భివానీ బ్రాంచుకు సంబంధించిన కేసులు వివరాలున్నాయని, అలాంటి పాలసీలను ఎస్బీఐ ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. విజయ్‌సాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సమాధానమిచ్చారు. ఎస్బీఐతో పాటు బ్యాంకులన్నీ పెండింగ్‌లో ఉన్న రుణాన్ని రికవరీ చేసుకునేందుకు ఎలాంటి రుణగ్రహితలకైనా బోర్డు అంగీకారయోగ్యమైన పాలసీనే ఉంటుందని, వారు చట్టబద్ధంగానే వసూలుచేపడతారని సమాధానమిచ్చారు. ఎలాంటి చట్టబద్ధమైన ఉల్లంఘనలు లేకుండా మానవతావాదంతో, వ్యాపారాలు నిర్వహిస్తున్నామని ఎస్బీఐ చెప్పినట్టు తెలిపారు. భివాని బ్రాంచులో 917 రుణాలను పెన్షనర్లు ఇచ్చారని వాటి విలువ రూ.12.25 కోట్లగా ఉందని, వాటిలో మాజీ ఉద్యోగులవి రూ.7.10 కోట్లున్నాయని ఎస్బీఐ చెప్పింది. వీటిలో 10 లోన్ అకౌంట్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, భివానీ బ్రాంచుకు సంబంధించి ఏ మాజీ ఉద్యోగి కూడా ఆత్మహత్య చేసుకున్న విషయం ఎస్బీఐ నోటీసుకు వచ్చిన దాఖలా లేవన్నారు.