breaking news
Pav Bhaji
-
మహారుచి
కృష్ణ, గోదావరి, నర్మద, తపతి.. ‘మహా’నదులు. ముంబై, పుణె, నాగపూర్ .. ‘మహా’నగరులు. చాళుక్య, శాతవాహన, మరాఠీ.. ‘మహా’వంశాలు. పావ్‌బాజీ, మసాలాబాత్, రసీలా బూందీ.. ‘మహా’మీల్స్ నదుల్లో మునిగితే పుణ్యం. నగరాల్లో తిరిగితే జ్ఞానం. వంశాలు తిరగేస్తే చరిత్ర సారం. మీల్స్ ఆరగిస్తే మహారుచి! మహాద్భాగ్యం!! ఈవారం మీకోసం మహారాష ్టస్ప్రెషల్స్!! మసాలా టాక్ కావల్సినవి: పెరుగు - కప్పుడు; నీళ్లు - 2 కప్పులు; మసాలా (లవంగ,, దాల్చిన చెక్క, ఇలాచీ వేయించిన పొడి) - చిటికెడు, ఉప్పు - చిటికెడు; కొత్తిమీర తరుగు - అర టీ స్పూన్; వెల్లుల్లి - 1 తయారీ: పెరుగును బాగా చిలికి, కొత్తిమీర, వెల్లుల్లి, నీళ్లు కలిపి బ్లెండ్ చేయాలి. ఉప్పు, మసాలా కలిపి సర్వ్ చేయాలి. కడాయిలో అర టీ స్పూన్ నూనె వేసి, పోపు గింజలు వేసి కూడా మజ్జిగలో కలుపుకోవచ్చు. పావ్ భాజీ పావ్‌కి కావల్సినవి: లడి పావ్స్ - 4; నెయ్యి - 2 టేబుల్ స్పూన్; పావ్ భాజీ మసాలా - తగినంత (మసాలా తయారీ పక్కన ఇచ్చాం) భాజికి కావల్సినవి: బంగాళదుంప - 1 (ఉడికించి గుజ్జు చేయాలి); క్యాలీఫ్లవర్ తరుగు - అర కప్పు; పచ్చిబఠాణీ - పావు కప్పు; క్యారట్ తరుగు - పావు కప్పు; క్యాబేజీ తరుగు - అరకప్పు; క్యాప్సికమ్ తరు గు - పావు కప్పు; టొమాటో తరుగు - 1 1/2 కప్పు; కారం - అర టీ స్పూన్; పావ్ భాజీ మసాలా - టీ స్పూన్; నల్లుప్పు - అర టీ స్పూన్; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి - 2; వెల్లుల్లి రెబ్బలు - 4, బటర్- చిన్నముక్క సర్వ్ చే సేటప్పుడు... ఉల్లిపాయ - 1; నిమ్మముక్కలు - 2; కొత్తిమీర తరుగు - టీ స్పూన్ తయారీ: క్యాలీఫ్లవర్, క్యాబేజీ, క్యారట్, బఠాణీలను ఉడికించి, నీళ్లను వడకట్టి ముక్కలను పేస్ట్ చేసుకోవాలి కడాయిలో నెయ్యి వేసి, వేడయ్యాక ఉల్లిపాయ తరుగు, క్యాప్సికమ్ వేసి వేయించి కారం, అల్లం పేస్ట్ వేసి మెత్తగా అయ్యేంతవరకు ఉడికించాలి దీంట్లో టొమాటో తరుగు వేసి ఉడికించాలి పసుపు, కారం, పావ్ భాజీ మసాలా, నల్లుప్పు, ఉప్పు, కూరగాయల మిశ్రమం, బంగాళదుంప గుజ్జు, అరకప్పు నీళ్లు వేసి మిశ్రమం మెత్తబడే వరకు ఉడికించాలి పావ్లకు కొద్దిగా నెయ్యి రాసి, రెండు వైపులా పెనం మీద వేయించి, మసాలా చల్లి ప్లేట్లోకి తీసుకొవా లి. వాటి పక్కనే ఉల్లిపాయ తరుగు ఉంచాలి. భాజీ ఉడికాక ప్లేట్లోకి తీసుకొని, పైన బటర్ వేసి, కొత్తిమీర చల్లి, నిమ్మముక్కలతో సర్వ్ చేయాలి. మసాలా బాత్ కావల్సినవి: బియ్యం - కప్పు (15 నిమిషాలు నీళ్లలో నానబెట్టాలి); నూనె - టేబుల్ స్పూన్; జీలకర్ర - అర టీ స్పూన్; ఉల్లిపాయ తరుగు - అర కప్పు; ఇంగువ - చిటికెడు; అల్లం తరుగు - అర టీ స్పూన్; పచ్చిమిర్చి - 2 (తరగాలి); పచ్చి బఠాణీ, మొక్కజొన్నగింజలు - పావు కప్పు; ఉప్పు - తగినంత; పసుపు - అర టీ స్పూన్; కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్మసాలా పొడికి... జీలకర్ర - అర టీ స్పూన్; ధనియాలు - అర టీ స్పూన్; లవంగాలు - 3; నల్లమిరియాలు - 6 (మసాలా పొడికి కావల్సిన దినుసులన్నీ పెనం మీద వేయించుకొని, పొడి చేసి పక్కన ఉంచాలి) తయారీ: గిన్నె లేదా ప్రెజర్ కుకర్‌లో నూనె వేసి, వేడి చేయాలి. అందులో జీలకర్ర, ఉల్లిపాయలు, ఇంగువ వేసి 2 నిమిషాలు వేయించాలి. అల్లం తరుగు, పచ్చిమిర్చి, వడకట్టిన బియ్యం, పచ్చి బఠానీ, మొక్కజొన్న గింజలు, క్యారెట్, బీన్స్ వేసి మరో 2 నిమిషాలు ఉంచి, కలపాలి. దీంట్లో రెండున్నర కప్పుల నీళ్లు, ఉప్పు, పసుపు, మసాలా పొడి వేసి కలిపి మూత పెట్టాలి.అన్నం పూర్తిగా ఉడికాక చివరలో కొత్తిమీర వేసి దించాలి. మసాలా బాత్‌ని రైతా లేదా శనగల కూరతో వడ్డించాలి. నోట్: మసాలా బాత్‌లో దొండకాయలు, వంకాయ ముక్కలు, చిక్కుడు గింజలు కూడా వేసుకోవచ్చు. రసీలా బూందీ కావల్సినవి శనగపిండి - కప్పు; పంచదార - 2 కప్పులు; నూనె - వేయించడానికి తగినంత; రోజ్‌వాటర్ - పావు టీ స్పూన్ తయారీ: బూందీ తయారీకి శనగపిండిలో తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి కడాయిలో నూనె పోసి వేడి చేయాలి కడాయిపైన బూందీ జల్లి పెట్టి, దానిపైన శనగపిండి మిశ్రమం పోసి మృదువుగా రుద్దుతూ ఉండాలి. జల్లి నుంచి పిండి జారి, నూనెలో పడుతుంది. బూందీని వేయించి, తీసి పక్కన పెట్టుకోవాలి పంచదారలో 2 కప్పుల నీళ్లు పోసి, పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. గులాబ్‌జామూన్ కోసం ఎలా పంచదార పాకం చేసుకుంటామో అలాగే దీనిని తయారు చేసుకోవాలి. ఈ పంచదార పాకంలో రోజ్ వాటర్ కలపాలి. పంచదార పాకంలో వేయించిన బూందీ వేసి కలిపి, భోజనానంతరం వడ్డించాలి. పిత్లా కావల్సినవి: శనగపిండి - కప్పు; నూనె - 3 టీ స్పూన్లు; నీళ్లు - 4 కప్పులు;; పచ్చిమిర్చి - 6 ; వెల్లుల్లి - 4 ; ఉల్లిపాయ - 1 (తరగాలి); ఆవాలు - టీ స్పూన్; జీలకర్ర - టీ స్పూన్; ఉప్పు - రుచికి తగినంత; కొత్తిమీర - టీ స్పూన్ తయారీ: చిన్న గిన్నెలో శనగపిండి వేసి, అందులో కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి స్టౌ మీద గిన్నె పెట్టి వేడయ్యాక నూనె వేసి, అందులో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి పసుపు, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి దీంట్లో జారుగా కలిపిన శనగపిండి వేసి,4 కప్పుల నీళ్లు పోసి కలుపుతూ మిశ్రమం బాగా చిక్కబడేంతవరకు ఉడకనివ్వాలి చివరగా ఉప్పు కలిపి, కొత్తిమీర వేసి దించాలి. దీనిని చపాతీ, రైస్‌లోకి వడ్డించాలి. పావ్ భాజీ మసాలా... ఎండుమిర్చి - 6, ధనియాలు - 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర - 2 టేబుల్ స్పూన్లు, నల్లమిరియాలు - అర టీ స్పూన్, దాల్చిన చెక్క - అర అంగుళం ముక్క, లవంగాలు - 3, ఇలాచీలు - 4, సోంపు - టీ స్పూన్ తయారీ: కడాయిలో ఈ దినుసులన్నీ వేసి సన్నని మంటమీద వేయించుకోవాలి. చల్లారాక అన్నీ కలిపి పొడి చేసుకోవాలి. మహారాష్ర్ట వంటకాలు కొంత ఘాటుగా ఉంటాయి. గోధుమ, బియ్యం, జొన్నలు, సజ్జలు, పప్పులు, కూరగాయలు వీళ్ల వంటకాలలో ప్రధానంగా చూస్తాం. అలాగే పల్లీలు, జీడిపప్పులు కూడా వీరి వంటకాలలో విరివిగా ఉపయోగిస్తారు. సంప్రదాయ వంటకాలతో పాటు వీరి రుచులలో దేశంలోని ఇతర ప్రాంతాల ఘుమఘుమలు త్వరగా చేరిపోతాయి. వీరి వంటలలో మాంసాహారం చాలా చాలా తక్కువ. మహారాష్ట్రీయుల పైన ప్రముఖ నగరాలైన ముంబయ్, పునే పట్టణవాసుల ఆహారపు అలవాట్ల ప్రభావం ఎక్కువ. ఉడిపి రుచులు ముఖ్యంగా ఇడ్లీ, దోసెలే కాకుండా చైనీస్ వంటకాలూ వీరి ఆహారంలో భాగమయ్యాయి. అయితే మోదక్, పత్ల, పావ్ భాజీ.. వంటివి మాత్రం తమ ప్రాభవాన్ని కోల్పోలేదు. కొల్హాపురి మటన్ కావల్సినవి: మటన్ - అర కేజీ మటన్‌ని నానబెట్టడానికి... అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీ ; స్పూన్లు; నూనె - టీ స్పూన్; పసుపు - పావు టీ స్పూన్; ఉప్పు - టీ స్పూన్ కొల్హాపురి మసాలా.. (పెద్ద ఉల్లిపాయలు -2, ఎండు కొబ్బరి తురుము - అర కప్పు, నూనె - టేబుల్ స్పూన్, ధనియాలు - టీ స్పూన్, నువ్వులు - ఒకటిన్నర టీ స్పూన్, గసగసాలు - 3 టీ స్పూన్లు, ఎండుమిర్చి - 8, లవంగాలు - 2); ఉల్లిపాయలు - 2 (తరగాలి); నూనె - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత; కొత్తిమీర తరుగు - టీ స్పూన్; నీళ్లు - తగినన్ని తయారీ:మటన్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, నూనె బాగా కలిపి గంట సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. కడాయిలో నూనె వేసి మసాలాకు ఇచ్చిన దినుసులన్నీ వేసి వేయించుకోవాలి. చివరగా కొబ్బరి వేసి మరో 2 నిమిషాలు వేయించి, మంట తీసేయాలి. చల్లారాక వీటన్నింటినీ కలిపి పేస్ట్ చేయాలి. కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు.మరొక గిన్నె స్టౌ మీద పెట్టి, నూనె వేసి ఉల్లిపాయలు వేయించాలి. దీంట్లో బాగా నానిన మటన్ ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి కలపాలి. ముప్పావు భాగం మటన్ ఉడికాక దాంట్లో మసాలా మిశ్రమం వేసి, నూనె తేలేంతవరకు ఉడకనివ్వాలి. తర్వాత దీంట్లో 2 కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. పూర్తిగా ముక్క ఉడికేదాకా మంట తగ్గించి ఉంచాలి. చివరగా కొత్తిమీర వేసి, వేడి వేడిగా భోజనంలోకి వడ్డించాలి. కరె్టిసీ సంజయ్ కుమార్ షెఫ్ విలేజ్ సోల్ ఆఫ్ ఇండియా బేగంపేట్, హైదరాబాద్ -
భోజన ప్రియుల ‘స్వాద్’ !
క్లిక్ దూరంలో టేస్టీ వంటకాలు ⇒35 వేలకుపైగా వంటల సమాచారం ⇒స్వాద్ యాప్‌తో అందుబాటులోకి ⇒రూపొందించిన హైదరాబాదీ స్టార్టప్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్లూబెర్రీ చీస్‌కేక్ టేస్ట్ చేయాలని ఉందా? చట్పటా పావ్ భాజీ లాగించాలా? ఇంతకీ ఇవి ఏ రెస్టారెంట్లో దొరుకుతాయి? ఎక్కడ టేస్టీగా ఉంటుందన్నదే కదా మీ సందేహం. రెస్టారెంట్ల చిరునామాతోపాటు ఎక్కడ రుచికరంగా ఉంటాయో తెలిస్తే.. ఇంకేముంది ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో వీకెండ్ పార్టీ డిసైడ్ అయిపోయినట్టేగా. ఇదిగో మీ కోసమే హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ స్వాద్ వినూత్న అప్లికేషన్‌ను (యాప్) అభివృద్ధి చేసింది. భాగ్యనగరిలో ఉన్న రెస్టారెంట్లు, వాటి చిరునామా, ఫోన్ నంబర్లతోపాటు ఒక్కో రెస్టారెంట్లో లభించే వంటకాలు, ధరలు కూడా ఈ స్వాద్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. విశేషమేమంటే కావాల్సిన వంటకాలు ఎక్కడ బాగుంటాయో ఈ యాప్ ఇట్టే చెప్పేస్తుంది. ఫుడీస్ సహకారంతో.. హైదరాబాద్ ఫుడీస్ క్లబ్, దేశీ ఫుడీస్ వంటి ఫుడీస్ (భోజన ప్రియుల) క్లబ్ సభ్యుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని స్వాద్ సేకరిస్తుంది. ఈ రెండు క్లబ్‌లలో కలిపి 40 వేల మంది దాకా సభ్యులున్నారు. వీరంతా వారంలో మూడుసార్లయినా హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లకు వెళ్తుంటారు. కొత్త కొత్త రెస్టారెంట్లకు వెళ్లి విభిన్న రుచులను ఆస్వాదిస్తుంటారు. ఫుడీస్ నుంచి స్వాద్ టీమ్ సమాచారం సేకరించి బెస్ట్ ఫుడ్‌ను వెబ్సైట్లో అప్డేట్ చేస్తుంది. ఇక స్వాద్ యూజర్లు రెస్టారెంట్లో ఆరగించిన వంటకం రుచి ఎలా ఉందో చెబుతూ లైక్స్, కామెంట్ పోస్ట్ చేస్తుంటారు. ఈ సమాచారం ఆధారంగా ఇతర యూజర్లు ఒక్కో రెస్టారెంట్లో ఏ వంటకాన్ని టేస్ట్ చేయాలో నిర్ణయించుకోవచ్చని స్వాద్ సహ వ్యవస్థాపకురాలు శ్రావ్య రెడ్డి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కొత్తవీ తెలుసుకోవచ్చు.. రెస్టారెంట్లు తరచూ మెనూను మారుస్తుంటాయి. కొత్త కొత్త వంటకాలు వచ్చి చేరుతుంటాయి. ఈ సమాచారం రెస్టారెంట్‌కు వెళితేగానీ కస్టమర్లకు తెలియదు. అదే స్వాద్ యాప్‌లో సమాచారం అప్డేట్ అవుతూ ఉంటుంది. దీనికితోడు నచ్చిన ఫుడ్ ఎక్కడ రుచిగా ఉంటుందో తెలిస్తే కస్టమర్‌కు సమయం ఆదా అవుతుంది. హోటల్‌కు వెళితే మంచి ఫుడ్ తిన్నామన్న తృప్తి ఉంటుందని శ్రావ్య రెడ్డి తెలిపారు. ‘కొద్ది రోజుల్లో ఫేస్‌బుక్‌కు స్వాద్ను అనుసంధానించనున్నాం. స్వాద్ యాప్ యూజర్లకు ఫేస్‌బుక్‌లోనూ అకౌంట్ ఉన్నట్టయితే.. యూజర్లు ఏదైనా ఫుడ్‌ను లైక్ చేస్తే ఆ సమాచారం ఫేస్బుక్ ద్వారా వారి మిత్రులకు చేరుతుంది. ఇక కస్టమర్లు ఇచ్చే స్పందన సమాచారాన్ని అందించేందుకు భవిష్యత్తులో హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి కొంత ప్రీమియం చార్జీ చేస్తాం. ఈ సమాచారంతో పొరపాట్లేవైనా ఉంటే సరిదిద్దుకోవడానికి, వంటలను మరింత రుచిగా అందించేందుకు వీటికి వీలవుతుంది’ అని తెలిపారు. ఫుడీస్ కావడంతో.. హైదరాబాద్‌కు చెందిన శ్రావ్య రెడ్డి, ధ్రువతేజ రెడ్డి, శశికాంత్ రెడ్డి 2012లో బీటెక్ పూర్తి చేశారు. సొంతంగా కంపెనీ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. స్వతహాగా ఫుడీస్ కావడంతో స్వాద్ ఏర్పాటుకు బీజం పడింది. ప్రస్తుతం 900లకు పైగా హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌ల సమాచారం యాప్‌లో నిక్షిప్తమై ఉంది. 35 వేల పైచిలుకు ప్రముఖ, వినూత్న వంటకాలను పొందుపరిచారు. ప్రస్తుతానికి క్లయింట్ల నుంచి ఎటువంటి చార్జీ చేయడం లేదు. నవంబర్ 19న అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ను సుమారు 500 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. యాప్ అభివృద్ధికి ఇప్పటికే రూ.10 లక్షలకుపైగా వ్యయం చేశారు. ఇందుకు కావాల్సిన నిధులను ఒక ఎన్నారై సమకూరుస్తున్నారు. ఇతర నగరాలకు విస్తరించాలన్నది స్వాద్ ప్రణాళిక. ఇందుకోసం ఆరు నెలల్లో రూ.12 కోట్లను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది.