రూ. కోటి 50 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
విశాఖ: విశాఖ జిల్లాలోని అనకాపల్లిలో సుంకరమెట్ట వద్ద ఆదివారం సాయంత్రం 1400 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందిన పక్కా సమాచారం మేరకు పోలీసులు సుంకరమెట్ట వద్ద తనిఖీలు నిర్వహించగా.. గంజాయిని టిప్పర్లో తరలిస్తుండగా పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న పాడేరుకు చెందిన ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు.
అయితే స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. కోటీ 50 లక్షలు ఉండొచ్చని అంచనా. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.