breaking news
Over Draft policy
-
బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్.. వివరాలివే..
కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో అనేక మందికి బంగారం కేవలం ఆభరణంగా కాకుండా అత్యంత విశ్వసనీయమైన పెట్టుబడి సాధనంగా మారింది. అత్యవసర ఆర్థిక అవసరాల కోసం తమ బంగారాన్ని అమ్మివేయడం లేదా తాకట్టు పెట్టడం సర్వసాధారణం. అయితే అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు బంగారాన్ని సాధారణ పద్ధతిలో తాకట్టు పెట్టకుండా, అమ్ముకోకుండానే దాన్ని ఉపయోగించుకునే అద్భుతమైన మార్గం ఉంటే? అవును, అదే బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్ (Overdraft on Gold Jewellery) సదుపాయం. పెరుగుతున్న బంగారం ధరల నేపథ్యంలో అనేక ప్రముఖ బ్యాంకులు తమ వినియోగదారులకు ఈ ప్రత్యేక సౌకర్యాన్ని అందిస్తూ వారి ఆర్థిక అవసరాలకు భరోసా కల్పిస్తున్నాయి.గోల్డ్ ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే?బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం అనేది ఒక రకమైన సురక్షితమైన రుణం (Secured Loan). ఇది వ్యక్తిగత రుణం లాంటిది కాకుండా, ఒక క్రెడిట్ లైన్‌లాగా పనిచేస్తుంది. సాధారణంగా గోల్డ్ లోన్‌లో ఒకేసారి మొత్తం డబ్బు తీసుకుని దానిపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయంలో మీ బంగారు ఆభరణాల విలువను బట్టి బ్యాంక్ నిర్దిష్ట పరిమితి(Limit)తో రుణాన్ని మంజూరు చేస్తుంది. వినియోగదారుడు ఈ పరిమితి నుంచి అతనికి అవసరమైన మేరకు ఎప్పుడైనా, ఎంతైనా డబ్బును డ్రా చేసుకునే సౌలభ్యం ఉంటుంది.మీరు డ్రా చేసుకున్న అసలు మొత్తంపై (Utilised Amount) మాత్రమే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మంజూరైన మొత్తం పరిమితిపై కాదు. ఈ సౌకర్యం సాధారణంగా ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు చెల్లుబాటు అవుతుంది. మీ సౌలభ్యాన్ని బట్టి క్రమానుగతంగా రుణం తిరిగి చెల్లించవచ్చు.వినియోగదారులకు ఉపయోగాలుబంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం ద్వారా వినియోగదారులకు కీలక ప్రయోజనాలు ఉన్నాయి. యూజర్లు డ్రా చేసుకున్న మొత్తానికే వడ్డీ లెక్కిస్తారు. ఉదాహరణకు, మీకు రూ.5 లక్షల పరిమితి మంజూరైతే అందులో రూ.2 లక్షలు మాత్రమే వాడుకుంటే ఆ రూ.2 లక్షలపై మాత్రమే వడ్డీ చెల్లించాలి.ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాలో నిధులు జమ చేయడం ద్వారా తీసుకున్న రుణాన్ని ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా పాక్షికంగా లేదా పూర్తిగా తిరిగి చెల్లించవచ్చు. నెలవారీ ఈఎంఐ (EMI) లాంటి కఠిన నిబంధనలు ఉండవు.వ్యాపార అవసరాలు, వైద్య ఖర్చులు లేదా ఇతర అత్యవసరాల కోసం తక్షణమే నిధులు పొందవచ్చు.గోల్డ్ లోన్ లేదా గోల్డ్ ఓవర్‌డ్రాఫ్ట్‌లకు వ్యక్తిగత రుణాల కంటే వడ్డీ రేట్లు సాధారణంగా తక్కువగా ఉంటాయి.బంగారు ఆభరణాలు సురక్షితంగా బ్యాంకు వాల్ట్‌లో ఉంటాయి. వాటిని అమ్ముకోవాల్సిన అవసరం లేదు.బంగారం విలువను ఎలా లెక్కిస్తారు..బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందడానికి వినియోగదారులు సాధారణంగా కొన్ని అర్హతలు కలిగి ఉండి ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. సాధారణంగా 18 క్యారెట్ల (Carat) నుంచి 24 క్యారెట్ల మధ్య స్వచ్ఛత కలిగిన బంగారు ఆభరణాలపై బ్యాంకులు ఓడీ ఇస్తాయి. వినియోగదారుడికి కావలసిన పరిమితిని బట్టి తగినంత బరువున్న బంగారాన్ని సమర్పించాల్సి ఉంటుంది.బ్యాంక్ నియమించిన వాల్యుయేటర్ బంగారు ఆభరణాల స్వచ్ఛతను, బరువును నిర్ధారించి వాటి ప్రస్తుత మార్కెట్ విలువను లెక్కిస్తారు. ఈ విలువలో 70% నుంచి 75% వరకు ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితిని మంజూరు చేస్తారు.ఛార్జీలుబంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్ (OD) సౌకర్యాన్ని వినియోగించుకునేటప్పుడు వినియోగదారులు చెల్లించాల్సిన ప్రధాన ఛార్జీల్లో వడ్డీ రేటు ముఖ్యమైనది. ఓడీ పరిమితి నుంచి తీసుకున్న అసలు మొత్తానికి మాత్రమే లెక్కిస్తారు. ఈ వడ్డీ సాధారణంగా రోజువారీగా లెక్కిస్తారు. బ్యాంకును అనుసరించి సంవత్సరానికి 8% నుంచి 15% మధ్య మారుతూ ఉంటుంది.కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఇది బ్యాంక్ ఓవర్‌డ్రాఫ్ట్ దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి, అకౌంట్‌ను సెటప్ చేయడానికి వసూలు చేసే ఏకమొత్తం ఛార్జీ. ఈ ఫీజు సాధారణంగా మంజూరైన మొత్తం ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితిలో 0.5% నుంచి 1.5% వరకు ఉంటుంది.వాల్యుయేషన్ ఛార్జీలు.. బ్యాంక్ నియమించిన వాల్యుయేటర్ బంగారు ఆభరణాల స్వచ్ఛతను, బరువును తనిఖీ చేసి దాని ప్రస్తుత మార్కెట్ విలువను నిర్ణయిస్తారు. ఈ సర్వీసు కోసం వసూలు చేసే ఫీజునే వాల్యుయేషన్ ఛార్జీలు అంటారు. అలాగే రుణ ఒప్పందాలను చట్టబద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు స్టాంప్ డ్యూటీ ఛార్జీని వినియోగదారులే భరించాల్సి ఉంటుంది.ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని అందిస్తున్న బ్యాంకులు1. ఫెడరల్ బ్యాంక్: డిజి గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ పథకం2. సీఎస్బీ బ్యాంక్: ఓవర్ డ్రాఫ్ట్ గోల్డ్ లోన్ స్కీమ్3. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (TMB): టీఎంబీ గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ స్కీమ్4. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India): బంగారు ఆభరణాలపై ఎస్ఓడీ (Secured Overdraft on Gold Ornaments - SOD).ఇదీ చదవండి: ఇండియాలో ‘గూగుల్ మీట్’ డౌన్ -
పీఎంజేడీవై ఖాతాదారులకు తీపికబురు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన(పీఎంజేడీవై) ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఆగస్టు 18, 2021 నాటికి ఈ పథకం కింద 430 మిలియన్లకు పైగా ఖాతాలను తెరిచినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకం "ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక చేయుత కార్యక్రమాలలో ఒకటి" అని కేంద్రం పేర్కొంది. ఈ పథకం వల్ల దేశంలోని పేద, అణగారిన వర్గాలకు చెందిన వారు కోట్లాది మంది ఈ పథకం కింద జీరో బ్యాలెన్స్‌తో అకౌంట్లను ఓపెన్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద ఓపెన్ చేసిన ఖాతాల డిపాజిట్ల విలువ మొత్తం రూ.1.46 లక్షల కోట్లున్నట్లు కేంద్రం ఆర్థిక శాఖ వెల్లడించింది. రూ.10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాలకు చెందిన వారు జీరో బ్యాలెన్స్‌తో బ్యాంకుల్లో అకౌంట్లను తెరవడానికి ఉద్దేశించినదే ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన(పీఎంజేడీవై) పథకం. పీఎంజేడీఐ కింద ఖాతా ఓపెన్ చేసిన వారికి ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా లభిస్తుంది. ఓవర్ డ్రాఫ్ట్ అంటే.. ఖాతాదారుని ఖాతాలో బ్యాలెన్స్ లేనప్పటికీ అతడి/ఆమె బ్యాంకు ఖాతా నుంచి(పొదుపు లేదా కరెంట్) నిర్ణీత మొత్తం వరకు డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. ఇతర క్రెడిట్ ఫెసిలిటీ వలే, ఖాతాదారుడు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ద్వారా నగదు విత్ డ్రా చేసినప్పుడు కొంత వడ్డీ కట్టాల్సి ఉంటుంది. స్వల్పకాలిక రుణం రూపంలో జన్ ధన్ ఖాతాదారులు ₹10,000 వరకు డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ పరిమితి ఇంతకు ముందు ₹5,000 వరకు ఉండేది, కానీ ప్రభుత్వం గత సంవత్సరం ఈ మొత్తాన్ని రెట్టింపు చేసింది.(చదవండి: ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారికి ఊరట..!) ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఏవిధంగా పనిచేస్తుంది? పీఎంజేడీవై ఖాతాదారులు తమ ఖాతాల్లో ఉన్న దానికంటే ఎక్కువ డబ్బును అప్పు తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తోంది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి కొన్ని ప్రమాణాలను నిర్దేశించింది. ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలంటే పీఎంజేడీవై ఖాతా యజమాని కనీసం ఆరు నెలల పాటు దానిని ఆపరేట్ చేసి ఉండాలి. అదే విధంగా, ఒక నిర్ధిష్ట కుటుంబంలోని ఒక సభ్యుడు మాత్రమే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీకి అర్హులు. సాధారణంగా మహిళా సభ్యులకు అవకాశం ఉంటుంది. ఖాతాదారునికి మంచి క్రెడిట్ చరిత్ర ఉండాలి. పీఎంజేడీవై ఓవర్ డ్రాఫ్ట్ కింద ₹2,000 వరకు ఎలాంటి గ్యారెంటీ అవసరం లేదు. ఓవర్ డ్రాఫ్ట్ గరిష్ట వయోపరిమితిని కూడా ప్రభుత్వం 60 నుండి 65 సంవత్సరాలకు పెంచింది. -
వ్యవసాయ రుణాల రద్దు దుర్లభం
టంగుటూరు, న్యూస్‌లైన్: వ్యవసాయ రుణాలను రద్దు చేసే సామర్థ్యం ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రానికి లేదని.. ఈ ప్రకటనలపై రైతులు ఎలాంటి భ్రమలు పెట్టుకోవద్దని ఆంధ్రాబ్యాంక్ డీజీఎం డి.సురేంద్రరావు తెలిపారు. టంగుటూరులో ఆ బ్యాంకు ఏటీఎంను గురువారం ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. ఇలాంటి విధానాలు బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బతీస్తాయని హెచ్చరించారు. వ్యాపారుల ప్రయోజనార్థం ప్రవేశపెట్టిన సెక్యూర్డు ఓవర్ డ్రాఫ్టు విధానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రెండేళ్లుగా లెసైన్స్ పొంది చట్టబద్ధంగా వ్యాపారం చేస్తూ.. టర్నోవర్ లేదా ఇన్‌కంట్యాక్స్ వివరాలు చూపితే 100 శాతం సెక్యూరిటీతో రుణం అందిస్తామన్నారు. ఉదాహరణకు *75 రూపాయల రుణం కోరితే.. *100 విలువైన సెక్యూరిటీ ఉండాలని చెప్పారు. అయితే రూరల్ సెక్యూరిటీ కాకుండా.. కేవలం అర్బన్, సెమీ అర్బన్ సెక్యూరిటీ మాత్రమే స్వీకరిస్తామని స్పష్టం చేశారు. రుణాలను రెండేళ్లకోసారి పరిశీలించి.. తిరిగి కొనసాగించే అవకాశం ఎప్పుడూ ఉంటుందన్నారు. వ్యాపారుల పూర్తి వివరాలతో కూడిన పలు డాక్యుమెంట్ల జోలికిపోమని.. కేవలం టర్నోవర్ తెలిపితే చాలన్నారు. చిరువ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకూ ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు. రూపాయి వడ్డీకే రుణాలు రైతులకు బంగారంపై కేవలం 1 వడ్డీకే రుణాలు ఇస్తామని డీజీఎం చెప్పారు. ఎకరాకు అత్యధికంగా *20 వేలు ఇస్తామని, ఏడాదిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్నారు. బ్యాంకులో పరిమిత వడ్డీకి ఇచ్చే వ్యవసాయ రుణాలకు.. బంగారు రుణాలతో సంబంధం లేదన్నారు. త్వరలో 22 ఏటీఎంలు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మార్చి 14 నాటికి మరో 22 ఏటీఎంలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ నెల 13న బి.నిడమలూరు, మార్టూరు, పూనూరుల్లో ప్రారంభిస్తామని, అలాగే ఉలవపాడులో నూతన బ్రాంచ్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి తమ బ్యాంకు వ్యాపారం *5,500 కోట్లు ఉందని, మార్చి నాటికి *6,200 కోట్లకు పెంచాలని లక్ష్యం విధించినట్లువివరించారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ యు.రమణరావు, పారిశ్రామిక వేత్త బెల్లం కోటయ్య, సర్పంచ్ బెల్లం జయంత్‌బాబు, పాల కేంద్రం అధ్యక్షుడు కామని విజయకుమార్, పొగాకు వ్యాపారులు పాల్గొన్నారు.


