ongole central
-
నిర్లక్ష్యం
నిలిచిపోయిన ఎయిడ్స్ మందు సరఫరా రోగుల్లో భయాందోళన ఎప్పుడు వస్తుందో తెలియదంటున్న రిమ్స్ డెరైక్టర్ ఒంగోలు సెంట్రల్ రిమ్స్ ఎ.ఆర్.టి. (యాంటీ రిట్రో వైరల్ థెరపీ) సెంటర్లో మందుల సరఫరా నిలిచిపోయింది. గత వారం రోజులుగా ఓ రకం మందులు పూర్తిగా అయిపోవడంతో వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో హెచ్.ఐ.వి.తో బాధపడుతున్న పలువురు నగరంలోని ఎ.ఆర్.టి. సెంటర్‌కు వచ్చి మందుల తీసుకువెళుతుంటారు. ఈ మందులు క్రమపద్ధతిలో వాడితేనే ఫలితం ఉంటుంది. జిల్లాలోని చీరాల, మార్కాపురాల్లో ఏఆర్టీ సెంటర్లతోపాటు కందుకూరు, కనిగిరి, దర్శి, అద్దంకి, గిద్దలూరు తదితర ప్రాంతాలలో లింక్ ఎ.ఆర్.టి. సెంటర్లు రోగుల సౌకర్యం కోసం ఏర్పాటై సేవలందిస్తున్నాయి. రోగులు తమ ప్రాంతంలో మందులు తీసుకుంటే అందరికీ తెలుస్తుందని దూరాభారమైనా దాదాపుగా 6,500 మంది రోగులు ప్రతినెలా రిమ్స్‌కు వచ్చి మందులు తీసుకురావడానికి వచ్చీపోతుంటారు. వీరిలో దాదాపు 2,500 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు వాడే యాంటీ రిట్రో వైరల్ మందులు ‘టినోలాంబ్, నెవరపిన్’ మాత్రలు నెల రోజులకు సరిపడా ఇవ్వాల్సి ఉండగా స్టాకు లేకపోవడంతో గత వారం రోజుల నుంచి చేతులెత్తేస్తున్నారు. కనీసం మందులు ఎప్పుడు వస్తాయో కూడా అధికారులు చెప్పకపోవడంతో రోగులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. టినోలాంబ్ అనే మాత్రలు నెలకు సరిపడా కొనాలంటే బయట మార్కెట్లో రూ.1,400 ధర ఉంది. ఎప్పుడు వస్తాయో తెలియదు.. - డాక్టర్ అంజయ్య, రిమ్స్ డెరైక్టర్ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు వాడే రెండోరకం మందుల సరఫరా నిలిచిపోయింది. ఎప్పుడు వస్తాయో కుడా తెలియదు. -
ప్రీమెట్రిక్ స్కాలర్ షిప్పుల రిజిస్ట్రేషన్‌ను వేగవంతం చేయండి
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: ప్రీమెట్రిక్ ఉపకార వేతనాల రిజిస్ట్రేషన్‌ను వేగవంతం చేయాలని సాంఘిక సంక్షమ శాఖ డిప్యూటీ డైరక్టర్ కే సరస్వతి అన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్లో జిల్లాలోని అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ జిల్లాలో ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు అర్హత ఉన్న విద్యార్థులు 40 వేల మంది ఉండగా కేవలం 5 వేల మంది మాత్రమే ఇప్పటి వరకూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. వసతి గృహ సంక్షే మ అధికారులు తమకు కేటాయించిన 30 పాఠశాలల్లో విద్యార్థులను సందర్శించి వారంతా ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని సూచించారు. ఆధార్ ఎన్రోల్ అయి ఉండి ఆధార్ కార్డు లేని విద్యార్థులు తమ పాఠశాల ప్రిన్సిపాల్ లాగిన్ నుంచి ఈ- పాస్‌లో దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం విద్యార్థులకు ఆధార్ కార్డులు వేగంగా అందేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అదే విధంగా ఆధార్ కార్డులు లేని విద్యార్థులు 500 మంది ఉండవచ్చని ఒక అంచనాకు వచ్చామన్నారు. వీరందరికీ ప్రత్యేకంగా ఆధార్ శిబిరాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఐదు నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రాజీవ్ విద్యా దీనెన పథకంలో దరఖాస్తు చేసుకునేలా పాఠశాలల ప్రిన్సిపాల్స్‌తో సంక్షేమ అధికారులు సమావేశాలు నిర్వహించాలన్నారు. వసతి గృహాల్లోని హాజరు, స్టాక్ వివరాలు, ఆన్లైన్ బిల్స్‌ను ఈ- హాస్టల్ మేనేజ్మెంట్ వ్యవ స్థ ద్వారా నిర్వహించాలన్నారు. అదే విధంగా వసతి గృహాల్లో మెనూ తప్పనిసరిగా డిస్ప్లే చేయాలని, దాని ప్రకారం పిల్లలకు ఇవ్వాలన్నారు. కాస్మొటిక్ చార్జీలను విద్యార్థులకు అందించాలన్నారు. నూతన వసతి గృహాల నిర్మాణాలకు అనువైన స్థలాలు గుర్తించి వసతి గృహానికి కేటాయించేలా తహసీల్దార్లతో మాట్లాడాలన్నారు. పదో తరగతి ఫలితాలు నూరు శాతం సాధించే దిశగా సిబ్బంది కృషి చేయాలన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు దుప్పట్లు, కార్పెట్లు అందాయో లేదో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారులు పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో 8 మంది అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారులు, 117 వసతి గృహ సంక్షేమ అధికారులు, 20 కళాశాలల వసతి గృహ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.