breaking news
omji maharaj
-
మహిళలపై మరో స్వామీజీ సంచలన వ్యాఖ్యలు
ఒకవైపు మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోతుంటే, మరో స్వామీజీ మహిళల గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. హిందూ మహాసభ అధ్యక్షుడైన స్వామి ఓంజీ మహరాజ్ ఈ వివాదానికి కారణమయ్యారు. న్యూస్‌రూం అనే ప్రైమ్‌టైమ్ షోలోని ప్యానలిస్టులలో ఒకరైన ఈయన... మన దేశంలో మహిళలు ధరిస్తున్న దుస్తుల వల్లనే వారిమీద లైంగిక దాడులు జరుగుతున్నాయని అన్నారు. పొట్టి స్కర్టులు వేసుకోవడం వల్ల వాళ్లు ఇబ్బందులను కొనితెచ్చుకుంటున్నారని, బురఖాలో ఉన్నవాళ్లయితే సురక్షితంగా ఉంటారని చెప్పుకొచ్చారు. అమ్మాయిలు ఒంటినిండా దుస్తులు కప్పుకోకపోతే.. బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్లుగా లైంగిక దాడులు చేసేవాళ్లు వాళ్ల చుట్టూ చేరుతారని హెచ్చరించారు. బెంగళూరులో కొత్త సంవత్సరం రోజున జరిగిన ఘటనపై దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు తీవ్రంగా మండిపడుతున్న తరుణంలోనే ఈయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అబు అజ్మీ కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ''పెట్రోలు ఉంటే మంట వస్తుంది.. పంచదార ఉంటే చీమలు చేరుతాయి'' అని అమ్మాయిలే ఈ తరహా లైంగిక దాడులకు కారణమన్నట్లుగా ఆయన చెప్పారు. ఆధునిక కాలంలో ఎంతగా ఒళ్లు చూపిస్తే అంత ఫ్యాషన్ అని అమ్మాయిలు అనుకుంటున్నారని, డిసెంబర్ 31వ తేదీ సూర్యాస్తమయం అయిన తర్వాత సోదరుడు లేదా భర్త కాకుండా మరో మగాడితో తన సోదరి లేదా కూతురు కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొంటుంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోనని ఆయన స్పష్టం చేశారు. -
'లైవ్'లో బాబా చెంప చెళ్లుమంది..
ముంబై : అదో న్యూస్ చానల్ కార్యాలయం... సీరియస్‌గా లైవ్ డిస్కషన్ జరుగుతోంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు ... తాము ఎక్కడ ఉన్నామనే సంగతే మరిచిపోయి...చెంపలు వాయించుకున్న వీడియో... ప్రస్తుతం సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలో ఆదివారం ఐబీఎన్ 7 చానెల్ ప్రత్యక్ష ప్రసారాల్లో చర్చావేదికపై హిందూ మహాసభ ఆధ్యాత్మిక వేత్త ఓమ్జీ చెంపను ప్రముఖ జ్యోతిష్కురాలు దీపా శర్మ చెళ్లుమనిపించారు. తర్వాత ఇద్దరూ ఒకరినొకరు తోసుకుంటున్న దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. ఆధ్యాత్మిక విషయాలపై నిర్వహించిన చర్చకు అతిథులుగా విచ్చేసిన వీరిరువురు ఇలా గొడవపడ్డారు. ఇంతకీ వీళ్లిద్దరూ గొడవపడటానికి కారణం వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధే మా గురించి. ఆమె వ్యవహార శైలి సందర్భంగా చర్చ పక్కదారి పట్టింది. అది కాస్త కార్యక్రమంలో పాల్గొన్న వక్తల వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లటంతో రచ్చ మొదలైంది. ఈ సందర్భంగా ఓమ్జీ...దీపా శర్మ పర్సనల్ లైఫ్ గురించి విమర్శలు చేయటంతో ...ఆగ్రహానికి గురైన ఆమె..ఓమ్జీ చెంప మీద ఒక్కటిచ్చుకున్నారు. దీంతో ఆయన కూడా దీపా శర్మపై చేయి చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కొట్లాటకు దిగటంతో యాంకర్ వారిని శాంతింపచేయాల్సి వచ్చింది. కాగా ఈ ఘటనను బ్రాడ్కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్కే సింగ్ ఖండించారు.