breaking news
office opens
-
29–31 తేదీల్లో ఐటీ ఆఫీస్‌లు ఓపెన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆదాయపన్ను శాఖ కార్యాలయాలు మార్చి 29 నుంచి 31వ తేదీ వరకు (సెలవు రోజుల్లోనూ) తెరిచే ఉంటాయని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం ముగింపు రోజుల్లో ఆదాయపన్నుకు సంబంధించి పెండింగ్ పనులను పూర్తి చేసుకునేందుకు వీలుగా కార్యాలయాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.ఇదీ చదవండి: నెలకు రూ.25,432 స్టైపెండ్‌తో ఇంటర్న్షిప్మార్చి 30న ఉగాది ఆదివారం, 31న రంజాన్ కారణంగా సెలవు కావడం తెలిసిందే. ఆదాయపన్ను శాఖకు సంబంధించి మిగిలిపోయిన పనులను పూర్తి చేసుకునేందుకు కార్యాలయాలను తెరిచి ఉంచుతున్నట్టు సీబీడీటీ తెలిపింది. ఆర్థిక సంవత్సరం చివరి రోజు అయిన మార్చి 31న ప్రభుత్వ చెల్లింపులను పూర్తి చేయాల్సి ఉంటుంది. 2023–24 అసెస్మెంట్ సంవత్సరం అప్డేటెడ్ ఐటీఆర్‌లు దాఖలు చేసే గడువు కూడా మార్చి 31తో ముగియనుంది. ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే అన్ని బ్యాంక్‌లు మార్చి 31న కార్యకలాపాలు నిర్వహించాలంటూ ఆర్బీఐ సైతం ఆదేశించడం గమనార్హం. -
మలేషియాలో ఫేస్ బుక్ ఆఫీస్
కౌలాలంపూర్ : మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ స్థానిక ఆఫీసును తెరిచింది. మలేషియన్ల మరిన్ని సేవలందిస్తూ, అర్థవంతమైన రీతిలో బిజినెస్ లకు కనెక్టు అవ్వడానికి ఈ స్థానిక ఆఫీసును ప్రారంభించామని ఫేస్ బుక్ దక్షిణ-తూర్పు ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ కెనేథ్ బిషాప్ తెలిపారు. మలేషియాలో ఆఫీసును తెరవడం ఫేస్ బుక్ కు ఒక మైలురాయిని సూచిస్తుందని చెప్పారు. నేటి తరంలో మొబైల్ ప్రాధాన్యత పెరిగిందని, ఈ నేపథ్యంలో వ్యాపారాలను మొబైల్ కస్టమర్లకు కనెక్టు చేస్తూ సేవలందించడంలో ఇది అపూర్వమైన అవకాశమని పేర్కొన్నారు. స్థానిక టీమ్ దీనిపై ఎక్కువగా శ్రద్ధ వహిస్తుందని చెప్పారు. నికోల్ టాన్ అధ్యక్షతన ఈ స్థానిక ఆఫీసును ఫేస్ బుక్ ప్రారంభించింది. నికోల్ టాన్ అంతకు ముందు మలేషియా అడ్వర్టైజింగ్ కంపెనీ జె. వాల్టర్ థామ్ సన్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించేవారు. 94 శాతం మంది మలేషిన్లు ప్రొడక్ట్ లను, బ్రాండ్లను ఫేస్ బుక్ పేజీ ద్వారానే తెలుసుకుంటున్నారని, వాటిలో 62 శాతం వరకూ కొనుగోలు చేస్తున్నట్లు ఇటీవలే టీఎన్ఎస్ రీసెర్చ్ సంస్థ సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం 180 లక్షల మలేషియన్లు సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై సమయాన్ని వెచ్చిస్తున్నారని, వారిలో 65 లక్షల ప్రజలు ఇన్ స్టాగ్రాంపై గడుపుతున్నారని ఫేస్ బుక్ తెలిపింది. దక్షిణ-తూర్పు ఆసియాలో ఎక్కువగా మలేషియన్లే ఫేస్ బుక్ పేజీపై యాక్టివ్ లో ఉంటున్నారని, స్మార్ట్ ఫోన్లలో వీడియోలను చూడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపింది. దక్షిణ-తూర్పు ఆసియాలో మొబైల్ లు అధికంగా వాడే దేశంగా మలేషియాకు 144శాతం రేటును కలిగి ఉందని పేస్ బుక్ తెలిపింది.