breaking news
Non-subsidised
-
మళ్లీ పెరిగిన సిలిండర్ ధర
న్యూఢిల్లీ: వంట గ్యాస్ వినియోగదారుడిపై మళ్లీ గ్యాస్ ‘బండ’ భారం పడింది. క్రమంగా వంట గ్యాస్ సబ్సిడీ ఎత్తివేసే పథకాన్ని మరింత వేగవంతం చేసిన కంపెనీలు మరోసారి ధరలను సమీక్షించాయి. ప్రతి నెలా ధరల పెంపు నిర్ణయంలో భాగంగా ఎల్పీజీ సిలిండర్ ధరలను భారీగా పెంచేశాయి. శుక్రవారం ప్రకటించిన తాజా నిర్ణయం ప్రకారం నాన్-సబ్సిడీ సిలిండర్ ధర రూ.73.5 , సబ్సిడీ సిలిండర్ రూ. 7 ల మేర పెరగనుంది. ఏవియేషన్ టర్భైన్ ఫ్యూయల్ (ఎటీఎఫ్) ను 4శాతం పెంచింది. అలాగే, ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) ద్వారా అమ్మిన కిరోసిన్ ధరను కూడా లీటరుకు 25 పైసలు చొప్పున పెంచింది. దేశంలోని అతి పెద్ద ఇంధన రిటైలర్ అయిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకారం, దీంతో 14.2 కేజీల ఎల్పీజీ సబ్సిడీ సిలిండర్ 487.18గా ఉండనుంది. నాన్- సబ్సిడీ సిలిండర్ ధర రూ. 597.50 గా ఉండనుంది. అయితే గత సంవత్సరం జూలై నుంచి రూ .2 చొప్పున నెలకొల్పిన పాలసీ అమలులో సబ్సిడైజ్డ్ ఎల్పీజీ రేట్లు సిలిండర్‌కు 68 రూపాయల మేరకు పెరిగాయి. జూన్ నెలలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ .419.18 వద్ద ఉంది. ప్రతి నెల సిలిండర్‌పై 4 రూపాయల చొప్పున పెంచుతూ పూర్తిగా సబ్సిడీనీ ఎత్తివేయాలని ప్రభుత్వానికి చెందిన చమురు కంపెనీలను ప్రభుత్వం కోరింది. చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూలై 31 న లోక్‌సభలో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నాన్ సబ్సిడీ సిలిండర్ ధర పెంపు..
ఢిల్లీ: నాన్ సబ్సిడీ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. నాన్ సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ పై రూ.86 లను పెంచుతున్నట్టు బుధవారం ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఎల్పీజీ ధరలు భారీగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ ధరలు వెంటనే అమల్లోకి రానున్నాయని తెలిపింది. అయితే సబ్సిడీ సిలిండర్ల ధరలపై ఎలాంటి ప్రభావం ఉండదని కేంద్ర ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. మార్చి 1, 2017 నాటికి సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 737 గా ఉంటుందని, సబ్సిడీ రూ. 303 ఆయా ఖాతాల్లో జమ అవుతుందని వివరించింది. యథావిధిగా 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.434 ఉంటుందిని స్పష్టం చేసింది. మరోవైపు ఈ పెంపుప్రకటనతో ఐఓసీ కంపెనీ షేర్లు దాదాపు 1.2 శాతం పడిపోయింది -
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెంపుదల