breaking news
no water facities
-
దళితులు, గిరిజనులకు సముచిత గౌరవం
సాగర్: గత ప్రభుత్వాలకు దళితులు, ఓబీసీలు, గిరిజనులు ఎన్నికలప్పుడే గుర్తుకు వచ్చేవారని ప్రధాని మోదీ ఆరోపించారు. దళిత బస్తీలు, నిరుపేదలుండే ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో నీటి వసతి కూడా ఉండేది కాదన్నారు. తమ ప్రభుత్వం మాత్రం దళితులు, ఓబీసీలు, గిరిజనులకు సముచిత గౌరవం ఇచ్చిందని, జల్ జీవన్ మిషన్ ద్వారా వారి ఇళ్లలోకే మంచినీరు అందిస్తోందని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా బడ్తుమా గ్రామంలో శనివారం ప్రధాని సంత్ రవిదాస్ జ్ఞాపకార్థం 11 ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్లతో నిర్మించే ఆలయం–స్మారక నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం బినా–కోటా డబుల్ లేన్ రైలు మార్గాన్ని జాతికి అంకితం చేయడంతోపాటు వివిధ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ధానాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. -
పోలవరం ముంపుతిప్పలు
కాలినడకన వెళ్లేందుకూ పనికిరాని రోడ్డు..గుక్కెడు నీళ్ల కోసం చెలమలే గతి..వ్యవసాయ పనులు లేవు.. ఉపాధి పనులు ఉన్నా అవసరానికి వేతనాలు అందవు.. గ్రామాలువిడిచి వెళ్లిపోదామంటే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు కాదు.. ఉండాలంటే కనీస వసతుల్లేవు..కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం.. నిధులు విడుదల చేయని ప్రభుత్వం.. గ్రామాలు విడిచివెళ్లలేక, ఉండలేక ప్రత్యక్ష నరకం.. ఇదీ పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల దీనగాథ.. సాక్షి, పోలవరం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల జిల్లాలోని పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని 205 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. వీటిలో పోలవరం మండలంలో 26 గ్రామాలు ముంపు బారిన పడుతుండగా, ఇప్పటి వరకు ఏడు గ్రామాల్లోని 1,400 నిర్వాసిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇంకా దాదాపు మూడు వేల కుటుంబాలు 19 గ్రామాల్లో మగ్గిపోతున్నారు. వీరికి ప్రభుత్వం కనీస వసతులూ కల్పించటంలేదు. అవసరమైన నిధులూ మంజూరు చేయటంలేదు. దశాబ్ద కాలంగా ఇదే దుస్థితి. రెండేళ్ల కిందట జిల్లాలో కలిసిన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని పోలవరం నిర్వాసితులదీ ప్రస్తుతం ఇదే పరిస్థితి. కుక్కునూరు మండలంలో 120 ముంపు గ్రామాల్లో దాదాపు 9వేల కుటుంబాలు, వేలేరుపాడు మండలంలోని 59 ముంపు గ్రామాల్లో దాదాపు 5వేల కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. ఈ మండలాల్లోనూ కనీస వసతులు లేవు. ముంపు గ్రామాలు కావటంతో సర్కారు నిధులు కూడా మంజూరు చేయటంలేదు. దీంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురయ్యే పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని 198 గ్రామాల్లోని దాదాపు 17వేల కుటుంబాలు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నాయి. దీనికి సర్కారు నిర్లక్ష్య వైఖరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రోడ్డు శిథిలం : పోలవరం మండలంలో ముంపు గ్రామాల నిర్వాసితులు ఏ చిన్న పనికైనా నిత్యం పోలవరం రావాలి. 35కిలోమీటర్ల పొడవైన ఆర్అండ్బీ రోడ్డుపై ప్రయాణించాలి. పదేళ్ల కిందట ఈ రోడ్డు వేశారు. మూడేళ్ల కిందట తాత్కాలిక మరమ్మతులు చేశారు. ప్రస్తుతం రోడ్డు పూర్తిగా శిథిలమైంది. ఫలితంగా ఆర్టీసీ బస్సులు తరచూ మరమ్మతులకు గురై నిలిచిపోతున్నాయి. ఒక్కోసారి రోజుల తరబడి బస్సులు రావటం లేదు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే పరిస్థితి కూడా లేదు. ఆటోలకు వందలాది రూపాయలు ఖర్చు అవుతోంది. ఈ గ్రామాల్లోని నిర్వాసితులకు చెందిన 2,600ఎకరాల భూమిని ప్రభుత్వం ప్రాజెక్టు కోçసం సేకరించింది. దీంతో వ్యవసాయ పనులు లేవు. ఉపాధి పనులు ఉన్నా, అవసరానికి సొమ్ములు అందవు. ఇక తాగునీటి పథకాలు ఉన్నా, నిర్వహణా లోపంతో పాటు, భూగర్భ జలాలు అడుగంటడంతో కొన్ని గ్రామాల్లోనే అవి అక్కరకు వస్తున్నాయి. ఎర్రవరం, శివగిరి, చీడూరు, టేకూరు వంటి గ్రామాల ప్రజలు తాగునీటి కోసం గోదావరినదిపై ఆధారపడుతున్నారు. విద్యుత్ సరఫరా కూడా సక్రమంగా ఉండదు. కొన్ని సార్లు విద్యుత్‌కు రోజుల తరబడి అంతరాయం కలుగుతోంది. ఫలితంగా తాగునీటి పథకాలు పనిచేయటంలేదు. కనీసం వీధిలైట్లు కూడా వెలగవు. విలీన మండలాల్లోనూ అదే దైన్యం : అలాగే కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోనూ దయనీయ పరిస్థితులు ఉన్నాయి. నిర్వాసితులు రోడ్లు, తాగునీటి వసతి లేక అవస్థలు పడుతున్నారు. ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్నారు. వీధిలైట్లు కూడా వెలగని దుస్థితి. ఫలితంగా ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇంకా చెలమల నీటిపై ఆధారపడుతున్నారు. రోడ్లు అధ్వానంగా ఉండడంతో పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఎవరికైనా సుస్తీ చేసినప్పుడు ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు ఎన్నో అవస్థలు పడుతున్నారు. దీంతో నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, అధికారులు వారికి అవసరమైనప్పుడే గ్రామాలకు వస్తున్నారని నిర్వాసితులు చెబుతున్నారు. ఎప్పుడు గ్రామాలు ఖాళీ చేయాలో మాకు తెలీదు. ఎప్పుడు ఖాళీ చేయిస్తారో అధికారులకు కూడా తెలీదు. అయినా ఇక్కడ ఉన్నంతకాలం కూడా వసతులు కల్పించటం లేదు అంటూ నిర్వాసితులు తామా బుచ్చిరాజు, మణుగుల చంటబ్బాయిరెడ్డి, కత్తుల భీమిరెడ్డి, కుంజం సంకురు తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోవటం లేదు మాది పోలవరం మండలం శివగిరి. ప్రాజెక్టు వల్ల మా గ్రామం మంపునకు గురవనుంది. ప్రస్తుతం కొడుకు, కోడలితో కలిసి ఉంటున్నా. సెంటు భూమి కూడా లేదు. నా కొడుకుతోపాటు నేనూ కూలిపనికి వెళ్తున్నా. వ్యవసాయ పనులు లేవు. బతుకు కష్టంగా ఉంది. వారానికి ఒకసారి పోలవరం వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నాం. రోడ్డు పాడవటంతో బస్సు సరిగ్గా తిరగక ఆటోలకు వెళ్తున్నాం. మనిషికి రూ.150 ఖర్చు అవుతోంది. తాగు నీటి కోసం గోదావరినదికి వెళ్తున్నాం. బయటకు వెళ్లిపోదామంటే ప్యాకేజీ అమలు చేయరు. ఇక్కడ ఉందామంటే వసతులు కల్పింటం లేదు. అధికారులు పని ఉన్నప్పుడే గ్రామానికి వస్తున్నారు. కరెంట్ కూడా సక్రమంగా ఉండదు. ప్రభుత్వం పట్టించుకోవటంలేదు. – బేలం జోగమ్మ, నిర్వాసితురాలు, శివగిరి, ఎన్నో బాధలు పడుతున్నాం ముంపు గ్రామాల్లో ఉంటూ ఎన్నో బాధలు పడుతున్నాం. రోడ్డు బాగాలేదు. బస్సు సక్రమంగా తిరగడంలేదు. ఆటోలపై ఆధారపడుతున్నాం. ఎవరికైనా సుస్తీ చేస్తే ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు పడే ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావు. అధికారులు, ప్రభుత్వం కూడా పట్టించుకోవటంలేదు. – ముచ్చిక కృష్ణ, నిర్వాసితుడు, సరుగుడు, పోలవరం మండలం పునరావాసం గురించి తెలీదు ఇక్కడ ఉందామంటే వసతులు లేవు. బయటకు వెళ్లిపోదామంటే ప్యాకేజీ ఇవ్వటంలేదు. ఎప్పుడు వెళ్తామో తెలీదు. ఎప్పుడు పంపుతారో అధికారులకూ తెలీదు. అయినా ఇక్కడ ఉన్నంతకాలం కూడా వసతులు కల్పించటంలేదు. రోడ్డుతోపాటు సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవటం లేదు. – చింతలాడ సోమిరెడ్డి, నిర్వాసితుడు, తూటిగుంట, పోలవరం మండలం -
సమస్యల ఒడి.. ‘ చిప్పకుర్తి’ బడి
5తరగతులు... ఒకే తరగతి గది పాఠశాలకు తాగునీరు లేదు.. మరుగుదొడ్ల సౌకర్యం కరువు.. పట్టించుకోని అధికారులు రామడుగు : విద్యార్థులు లేక మూతపడిన పాఠశాల అది.. మళ్లీ తెరుచుకుంటుందో తెలియని పరిస్థితి. అలాంటి సందర్భంలో పాఠశాలకు బదిలీపై వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు రాళ్లబండి శశికళారెడ్డి గ్రామస్తుల సహకారంతో ఆ బడిని బతికించుకున్నారు. ఇంటింటికీ తిరిగి విద్యార్థులను సమీకరించారు. ఇంగ్లిష్‌మీడియం ప్రారంభించడంతో పక్క గ్రామాల విద్యార్థులు వచ్చి చేరారు. దీంతో పాఠశాల చిన్నారులతో కళకళాడుతోంది. అయితే సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రామడుగు మండలం చిప్పకుర్తి ప్రాథమిక పాఠశాల సమస్య వలయంగా మారింది. చిప్పకుర్తి గ్రామంలో విద్యార్థులు ప్రై వేట్ పాఠశాలల వైపు మెుగ్గు చూపడంతో ప్రాథమిక పాఠశాలను మూసేశారు. మూడేళ్ల క్రితం బదిలీపై వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు రాళ్లబండి శశికళారెడ్డి తిరిగి తెరిపించారు. పిల్లలు బడిలో చేర్పించే విధంగా గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఆమెకు వారి సహకారం తోడవడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఇంగ్లిష్‌మీడియం ప్రవేశపెట్టడంతో సమీప గ్రామాల ప్రజలు తమ పిల్లలను చిప్పకుర్తికి పంపించడం ప్రారంభించారు. ఇప్పడు విద్యార్థుల సంఖ్య 74కు చేరింది. వేధిస్తున్న సమస్యలు... విద్యార్థుల సంఖ్య పెరిగిందనే ఆశ ఎంతోసేపు నిలవలేదు. కనీస సౌకర్యాలుకరువై విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి, మరుగుదొడ్ల వసతి లేదు. తరగతి గదులు లేవు. –పాఠశాలలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 1 నుంచి 5 తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు వేర్వేరుగా తరగతులు నిర్వహించలేని పరిస్థితి ఉంది. ఒకటే తరగతి గది ఉంది. మరొకటి శిథిలావస్థకు చేరగా కూలగొట్టారు. దీంతో పిల్లలకు చెట్ల కిందనే చదువులు చెప్పాల్సి వస్తోంది. నలుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా.. వారు కనీసం కూర్చుండడానికి వసతి కూడా లేదు.. – పాఠశాలలో నీటి వసతి లేదు. పాఠశాల ఆవరణలో మట్టిపోయడం బోర్వెల్ కూరుకుపోయింది. దానికి అదనపు పైపు బిగించాల్సి ఉండగా.. పట్టించుకునేవారులేరు. –వంట గదిపైకప్పు లేదు. దీంతో ఒక మూలకు వంట చేస్తున్నారు. – మూడేళ్లుగా పాఠశాలకు అటెండర్ లేకపోవడంతో విద్యార్థులే అన్ని పనులు చేస్తున్నారు. –ప్రహరీ లేకపోవడంతో పశువులు పాఠశాల ఆవరణలోకి తిరుగుతున్నారు. – పాఠశాలకు అదనంగా తరగతి గదులను నిర్మాణానికి ప్రభుత్వం రూ.6.50 లక్షలు మంజూరు చేసింది. వంటగది మంజూరైంది. అధికారుల పర్యవేక్షణలోపం అయినా ఇంకా పనులు ప్రారంభించలేదు. తరగతుల నిర్వహణ ఇబ్బందిగా ఉంది ఎనిమిది తరగతులకు ఒక్కటే గది ఉంది. విద్యార్థులకు తాగునీటి వసతి కూడాలేదు. మరుగుదొడ్లు, మూత్రశాల సౌకర్యం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. అధికారులకు విన్నవించినా పరిష్కారం కనిపించడంలేదు. వసతులు కల్పిస్తే మరింత ఉన్నతంగా విద్యాబోధన చేయగలుగుతాం. –రాళ్లబండి శశికళారెడ్డి, హెచ్ఎం చదువు బాగా చెబుతున్నారు.. పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం చెబుతున్నారని రామడుగు నుంచి చిప్పకుర్తికి ఆటోలో వస్తున్నాం. సార్లు పాఠాలు బాగా చెబుతున్నారు. పెద్దసార్లు పాఠశాలకు తరగతి గదులను నిర్మాణం చేస్తే చాలా బాగుంటుంది.. –రిత్విహ, 5వ తరగతి విద్యార్థి రేకుల షెడ్డు కింద.. తరగతి గది లేకపోవడంతో చెట్లు, రేకుల షెడ్డు కింద చదువుకోవాల్సి వస్తోంది. బడిలోకి పశువులు రావడంతో ఇబ్బంది కలుగుతోంది. మూత్రశాలలు లేకపోవడంతో చాలా బాధ పడుతున్నాం. – నిహారిక, 4వ, తరగతి విద్యార్థి