breaking news
ninth classs students
-
యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు..
రాయవరం: రాష్ట్ర ప్రభుత్వం విద్యలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోంది. ఇప్పటికే మనబడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల భౌతిక స్వరూపాన్ని మార్చడమే కాకుండా తరగతి గదిలో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. పూర్తి స్థాయిలో ఇంగ్లీషు విద్యకు బాటలు వేసిన ప్రభుత్వం పాఠశాల దశ నుంచే సాంకేతిక విద్యను అందించేందుకు కృషి చేస్తోంది. విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నూతనంగా తొమ్మిదో విద్యార్థులకు పారిశ్రామిక మనస్తత్వ పెంపుదలకు శిక్షణ ఇవ్వనున్నారు. వారిని యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన లక్షణాలు, 21వ శతాబ్దపు నైపుణ్యాలను వారికి అందివ్వనున్నారు. ఈ శిక్షణలో ఐదు స్వచ్ఛంధ సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. 450 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని తొమ్మిదో తరగతి బోధించే తరగతి ఉపాధ్యాయులకు తొలుతగా శిక్షణ అందజేస్తున్నారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన 63 మంది రీసోర్స్ పర్సన్లు, మండల స్థాయిలో 9వ తరగతి క్లాస్ టీచర్లకు ఈ నెల 10, 11, 12, 13 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నారు. 10, 11 తేదీల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల ఉపాధ్యాయులకు, 12, 13 తేదీల్లో కాకినాడ జిల్లాలోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. జీఏఎంఈ, అస్లాటోన్, ఉధ్యం, మేకర్గాట్, రీపీ బెనిఫిట్ స్వచ్ఛంద సంస్థలు జిల్లా రీసోర్స్ పర్సన్స్‌కు శిక్షణ ఇవ్వడంతో పాటు బోధనకు అవసరమైన మెటీరియల్ అందజేశారు. 25వేల మంది విద్యార్థులకు ప్రయోజనం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులకు ‘పారిశ్రామిక వ్యవస్థాపక మనస్తత్వ పెంపుదల’(ఈఎండీపీ)పై శిక్షణ ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 25 వేల మంది విద్యార్థులకు ఈ శిక్షణ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. వారంలో ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమంపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవసరమైన శిక్షణనిస్తారు. ఈ నెల 14 నుంచి విద్యార్థులకు శిక్షణ ప్రారంభమవుతోంది. ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు పారిశ్రామిక రంగాల వైపు మళ్లేలా, వారిలో ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, నైపుణ్యాల అభివృద్ధిని పెంచుతారు. ఈ శిక్షణ ద్వారా భవిష్యత్తులో విద్యార్థులు వారి కాళ్లపై వారు నిలబడేలా ఆత్మస్థైర్యాన్ని పెంచుకునే అవకాశం కలుగుతుంది. అలాగే వారిలో భవిష్యత్తుపై భయం పోయి, ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యావేత్తలంటున్నారు. (క్లిక్: వీడు అసలు మనిషేనా! ఎముకలు విరిగేంత బలంగా 15 కత్తిపోట్లు..) లక్ష్యాలు చేరుకునేందుకు విద్యార్థి దశ నుంచే వారి భవిష్యత్తుపై ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు ఈ శిక్షణ ఎంతగానో దోహద పడుతుంది. చదువుకున్న అనంతరం ఉద్యోగం కోసం చూడకుండా, విద్యార్థులే పదిమందికి ఉద్యోగాలు కల్పించేలా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ శిక్షణ ద్వారా కచ్చితంగా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందనడంలో సందేహం లేదు. – సీహెచ్ ఉదయ్‌కుమార్, డిస్ట్రిక్ట్ మేనేజర్, ఈఎండీపీ సద్వినియోగం చేసుకోవాలి నేటి నుంచి ఇస్తున్న రెండు రోజుల శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకుని, తిరిగి విద్యార్థులకు అందించాలి. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు అవసరమైన శిక్షణను అందించాలి. ప్రభుత్వ ముందుచూపుకు ఇది ఒక్క చక్కని ఉదాహరణగా చెప్పొచ్చు. మండల స్థాయి శిక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేశాం. – ఎన్వీ రవిసాగర్, డీఈవో, కోనసీమ జిల్లా మంచి ఆలోచన విద్యార్థి దశ నుంచే పారిశ్రామిక వ్యవస్థాపక మనస్తత్వ పెంపుదలపై శిక్షణ ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ప్రతి వారం విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. – ఎస్ఏ అబ్రహం, డీఈవో, తూర్పు గోదావరి జిల్లా -
నడిచే బడికెళ్తా!
ఒంగోలు టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదివే బాలికలకు ‘బడికెళ్తా’ పేరుతో ప్రభుత్వం గత ఏడాది ఆర్భాటంగా సైకిళ్లు పంపిణీ చేసి.. ఈ ఏడాది మాత్రం మొండి చేయి చూపింది. బాలికల డ్రాప్ అవుట్స్ శాతాన్ని తగ్గించాలని, ముఖ్యంగా తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికలు మధ్యలో పాఠశాల మానివేయకుండా ఉండేందుకు ప్రభుత్వం గత ఏడాది బడికెళ్తా పథకంలో సైకిళ్లు పంపిణీ చేసింది. గత ఏడాది తమ సీనియర్ల్కు ఇచ్చినట్లుగా తమకు సైకిళ్లు ఇస్తారని ఈ ఏడాది తొమ్మిదో తరగతికి వచ్చిన బాలికలు ఎంతగానో ఎదురు చూశారు. పాఠశాలలు తెరిచి రెండు నెలలు దాటినా సైకిళ్ల పంపిణీ టెండర్ల గడప కూడా దాటలేదు. టెండర్లు ఎప్పుడు పిలుస్తారో, ఎప్పుడు సైకిళ్లను సిద్ధం చేస్తారో, వాటిని బాలికలకు ఎప్పుడు పంపిణీ చేస్తారో ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో బాలికలకు కాలినడనే పాఠశాలలకు వెళుతున్నారు. ప్రచార ఆర్భాటమే.. చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటానికే కేరాఫ్‌గా నిలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న బాలికలు మధ్యలో పాఠశాల మానివేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో బడికొస్తా కార్యక్రమానికి గత ఏడాది శ్రీకారం చుట్టింది. జిల్లాలో గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న 10,941మంది బాలికలకు ప్రభుత్వం సైకిళ్లు పంపిణీ చేసంఇ. ఈ ఏడాది 11,230 మంది బాలికలు తొమ్మిదవ తరగతి చదువుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేకపోవడంతో బాలికలు సైకిళ్లపై ఆశలు వదులుకున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లాల వారీగా తొమ్మిదో తరగతిలో ప్రవేశించే బాలికలు ఎంతమంది ఉన్నారన్న లెక్క అన్ని జిల్లాల్లోని సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల వద్ద ఉన్నాయి. ఆ డేటాను ఆధారం చేసుకొని మొదటి విడతలో బడికెళ్తాపథకం కింద సైకిళ్లు సిద్ధం చేయవచ్చు. కానీ, ప్రభుత్వానికి ముందు చూపు కొరవడింది. పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, సైకిళ్లు.. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు సరఫరా చేయలేదు. యూనిఫాం కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ అనేక పాఠశాలల్లోని విద్యార్థులు పాఠ్య పుస్తకాలు, యూనిఫాం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ జాబితాలోకి తాజాగా సైకిళ్లు వచ్చి చేరాయి. పాఠశాలలు పునః ప్రారంభానికి ముందు ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల సంఖ్యను పెంచాలన్న ఉద్దేశంతో బడికెళ్తా కార్యక్రమం గురించి ఉపాధ్యాయులతో విస్తృతంగా ప్రచారం చేయించింది. బాలికలు తాము నివాసం ఉంటున్న ప్రాంతాల నుంచి పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో సైకిళ్లు అందించాలని నిర్ణయించింది. పథకానికి రూపకల్పన చేసినప్పటికీ ఆచరణలో మాత్రం ఘోరంగా విఫలమైంది. -
అంతర్జాతీయ కరాటే పోటీల్లో చందన ప్రతిభ
వర్ధన్నపేట టౌన్: మండల కేంద్రంలోని ఫుస్కోస్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న కాట బోయిన చందన అంతర్జాతీయ కరాటే పోటీ ల్లో వెండి, రజత పతకాలు సాధించినట్లు పా ఠశాలప్రిన్సిపాల్ సిస్టర్ ఆనిస్ తెలిపారు. ఇటీవల వరంగల్, ఖమ్మంలో నిర్వహించిన రాష్ట్ర, జాతీయ స్థాయి 13 సంవత్సరాల బాలికల విభాగం పోటీలలో బంగారు పతకం సాధించిన చందన అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ముంబ యిలో ఈనెల 24న నిర్వహించిన అంతర్జాతీయ 18వ వరల్డ్‌కప్ కరాటే పోటీల్లో కెనడా బాలికతో తలపడిన చందన రెండో స్థానంలో నిలి స్పారింగ్లో వెండి, కటాస్‌లో రజత పతకం సాధించినట్లు వివరించారు. ఈ సందర్భంగా శిక్షణ ఇచ్చిన కోచ్ సోమ శ్రీధర్‌ను ఆమె అభినందించారు.