breaking news
New Testament
-
ఎన్నికల్లో అభ్యర్థులకు కొత్త నిబంధన
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఇకపై నామినేషన్ దాఖలు సమయంలో సొంత ఆదాయ మార్గాలతో పాటు జీవిత భాగస్వామివి కూడా వెల్లడించాలి. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడానికి ఈ చర్య దోహదపడుతుందని ఎన్నికల సంఘం ఈసీ పేర్కొంది. ఈమేరకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ కేంద్రం...అఫిడవిట్లో ప్రత్యేక కాలమ్‌ను కేటాయించింది. ఇప్పటి వరకు అమలవుతున్న నిబంధనల ప్రకారం...అభ్యర్థి తన సొంత ఆస్తులు, అప్పులతో పాటు జీవిత భాగస్వామి, తనపై ఆధారపడిన ముగ్గురి ఆస్తులు, అప్పులను వెల్లడించాలి. ఆదాయ మార్గాలను ప్రకటించనక్కర్లేదు. -
వీసా, వర్క్ పర్మిట్ లేనివారికి సెల్ కనెక్షన్ కట్
సౌదీలో కొత్త నిబంధన తీసుకొచ్చిన ప్రభుత్వం మోర్తాడ్: వీసా, వర్క్ పర్మిట్ లేకుండా ఉంటున్న వలసదారుల సెల్ఫోన్లలో రీచార్జి చేయడాన్ని సౌదీ అరేబియా ప్రభుత్వం నిషేధిం చింది. సెల్ఫోన్లో బ్యాలెన్స్ రీచార్జి చేయాలంటే వీసా, వర్క్ పర్మిట్ నంబర్లను సెల్‌నంబరుతో జత చేస్తేనే బ్యాలెన్స్ రీచార్జి అయ్యే విధంగా సాఫ్ట్‌వేర్‌ను సౌదీలో రూపొందించారు. గతంలో ఏదో ఒక గుర్తింపు కార్డు చూపించి సిమ్‌కార్డు తీసుకుంటే ఎప్పుడంటే అప్పుడు సెల్ రీచార్జి చేసుకునే వీలుండేది. సౌదీలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో బిన్‌లాడెన్, సౌదీ ఓజర్ వంటి ప్రముఖ కంపెనీలతోపాటు ఇతర చిన్న కంపెనీలు మూతపడి వేలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు. పాస్‌పోర్టులు, వీసా, వర్క్ పర్మిట్లను సైతం తమ అధీనంలోనే ఉంచుకున్నాయి. దీంతో కార్మికులకు ఆధారం లేకుండా పోయింది. మొబైల్ కోసం ప్రాధేయపడుతున్నారు సౌదీలో ఎంతో మంది తెలుగువారు ఇక్కడ ఉన్న లీగల్ కార్మికుల మొబైల్ఫోన్లను కొన్ని నిమిషాలు వాడుకోవడానికి ప్రాధేయపడుతున్నారు. అడిగినవారికి మొబైల్ఫోన్లు ఇచ్చి మాట్లాడుకోవడానికి అవకాశం ఇస్తున్నాం. - పాలకుర్తి అజయ్‌గుప్తా, రిసార్ట్ మేనేజర్, సౌదీ(భీమ్‌గల్ వాసి) -
కొత్త నిబంధనలతో పాఠాలు చెప్పలేం!
సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు - కొత్త నిబంధనలతో మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు స్పష్టీకరణ - ప్రభుత్వ కార్యదర్శి ఎక్కాతో చర్చల బహిష్కరణ సాక్షి, హైదరాబాద్: కొత్త నిబంధనలతో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో పాఠాలు చెప్పే పరిస్థితులు లేవని, తాము తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని అందులో పనిచేసే ఉపాధ్యాయులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ‘మాకు వీఆర్ఎస్ ఇచ్చి ఇళ్లకైనా పంపండి... లేదా వేరే ప్రభుత్వ విభాగాల్లోకైనా పంపించండి’ అని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి బెన్హర్ మహేశ్ దత్ ఎక్కాను కోరారు. ఈ గురుకులాల్లో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులు తమ బోధనా సామర్థ్యాన్ని మెరుగుపరచుకునేందుకు ‘న్యూ క్వాలిటీ పాలిసీ-2016’ పేరుతో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ‘సెమినార్’లకు హాజర వ్వాలని విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సెమినార్లలో ఉపాధ్యాయుల బోధనా తీరు, ఇతర అంశాలను పరిశీలించి మార్కులు కేటాయిస్తారు. అయితే ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయులు ఈనెల 1 నుంచి మొదలైన సెమినార్లను బహిష్కరించారు. 13న హైదరాబాద్‌లో మహా ధర్నా, 14 నుంచి గురుకులాలను మూసేసి నిరవధిక సమ్మె జరపాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బెన్హర్ మహేశ్‌దత్ ఎక్కా శనివారం గురుకుల ఉపాధ్యాయ జేఏసీ నాయకులను చర్చలకు ఆహ్వానించారు. చర్చలను బహిష్కరించిన జేఏసీ నాయకులు ప్రభుత్వ కార్యదర్శి ఎక్కాతో చర్చల కోసం వెళ్లిన జేఏసీ నాయకులు కె. వెంకటరెడ్డి, కె. అర్జున, కె. రవీందర్‌రెడ్డి, కె. నరేందర్ రెడ్డి, కె. యాదయ్య, జె. రామలక్ష్మణ్, పరంధాములు, శ్రీరాం శ్రీనివాస్ తదితరులు సంస్థలో జరుగుతున్న పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరంకుశ. అణచివేత ధోరణుల మధ్య గురుకుల విద్యాలయాలలో పనిచేయలేమని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తే బెదిరింపులు వస్తున్నాయని, పేరెంట్స్ కమిటీలు, పూర్వ విద్యార్థుల కమిటీల పేర్లతో ఫోన్లు చేసి వేధిస్తున్నారని ఎక్కాకు వివరించారు. కాగా ఎక్కాతో జేఏసీ నాయకులు సమావేశమైన సమయంలో గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ కూడా అక్కడే ఉండగా, తాము చర్చలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి బయటకు వచ్చేశారు. సీఎం జోక్యం చేసుకోవాలి: జేఏసీ నాయకులు గురుకుల విద్యాలయాల సంస్థలో పనిచేసే ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చొరవ చూపాలని ఉపాధ్యాయ జేఏసీ నాయకులు కోరారు. అందుకే ప్రభుత్వ కార్యదర్శి ఎక్కాతో సమావేశాన్ని బహిష్కరించినట్లు తెలిపారు.