breaking news
new dimensions
-
‘భారతీయ బ్యాంకింగ్‌పై నమ్మకం’లో కొత్త కోణాలు
చిరకాలంగా బ్యాంకింగ్ రంగంలో నమ్మకమనేది కీలకాంశంగా ఉంటోంది. అయితే ఆ నమ్మకం కలిగే ప్రక్రియ ఇప్పుడు మారుతోంది. నేటి కస్టమర్ల దగ్గర మరింత సమాచారం ఉంటోంది. వారు మరింతగా కనెక్ట్ అయి ఉంటున్నారు. తమకు అందుబాటులో ఉన్న ఆప్షన్ల గురించి కూడా అవగాహన పెరిగింది. కాబట్టి, ఇప్పుడు వారు బ్యాంకుల నుంచి కేవలం ఆర్థిక తోడ్పాటును మాత్రమే కాకుండా, విశ్వసనీయత, జవాబుదారీతనం, నిలకడైన నిరంతర సేవలను కూడా ఆశిస్తున్నారు.ఆర్థిక రంగ సంస్కరణల తర్వాతి కాలంలో బ్యాంకింగ్ రంగం ప్రధానంగా బ్యాంకింగ్ సేవలను ఎక్కువ మందికి చేరవేయడంపై దృష్టి పెట్టింది. మరింత మంది ప్రజలను అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడమనేది ఆర్థిక, సామాజిక పరంగా ప్రధాన లక్ష్యంగా నిలిచింది. ఈ దిశగా గణనీయమైన పురోగతి కూడా సాధించబడింది. ఇప్పుడు బ్యాంకింగ్ సేవలు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో, కస్టమర్లు మరో ముఖ్య అంశాన్ని కోరుకుంటున్నారు. అదేమిటంటే, మారుతున్న పరిస్థితుల్లో కూడా తమ బ్యాంక్ ఆధారపడే విధంగానే ఉంటుందని, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందనే ఓ నమ్మకాన్ని వారు కోరుకుంటున్నారు.విశ్వాసానికి మారుతున్న పునాదులుకొన్ని సంవత్సరాల క్రితం వరకు బ్యాంకులపై విశ్వాసం ప్రధానంగా భౌతిక ఉనికితో అనుసంధానమై ఉండేది. దగ్గరలో ఉన్న బ్రాంచ్, చిరపరిచితమైన సిబ్బంది, స్థిరమైన ప్రక్రియలు కస్టమర్లకు భరోసా కలిగించేవి. స్థిరత్వమే విశ్వాసానికి ఆధారంగా ఉండేది.టెక్నాలజీ అభివృద్ధితో బ్యాంకింగ్ రంగం మారిన తర్వాత సౌలభ్యమనేది కూడా కస్టమర్ల ప్రాధాన్యతల్లో కీలకంగా మారింది. వేగవంతమైన లావాదేవీలు, సులభమైన ప్రక్రియలు రోజువారీ బ్యాంకింగ్‌ను సులభతరం చేశాయి. అయితే కాలక్రమేణా ఇవి ప్రత్యేతలుగా కాకుండా సర్వసాధారణంగా ఆశించే సేవలుగా మారిపోయాయి.ఇప్పుడు కస్టమర్లు బ్యాంకింగ్ సేవలనేవి ఎప్పుడు కావాలంటే అప్పుడు సాధారణంగా అందుబాటులోనే ఉంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి దృష్టి ఇప్పుడు విశ్వసనీయ వ్యవస్థలవైపు మళ్లింది. బ్యాంకింగ్ సిస్టమ్‌లు సజావుగా పనిచేయాలి. కస్టమర్ సమాచారం భద్రంగా ఉండాలి. సంస్థలు కార్యకలాపాల్లో క్రమశిక్షణ పాటించాలని కోరుకుంటున్నారు.దీనితో భద్రత అనే భావన పరిధి కూడా పెరిగింది. బ్యాంక్ ఆర్థికంగా పటిష్టంగా ఉండటం ముఖ్యమే. అదే సమయంలో మోసాల నివారణ, వ్యక్తిగత డేటా రక్షణ, సమస్యలు తలెత్తినప్పుడు వేగంగా స్పందించడంలాంటి బ్యాంకింగ్ సామర్థ్యాలపై కూడా కస్టమర్లు దృష్టి పెడుతున్నారు.రుణ లభ్యత పెరగడం కూడా కస్టమర్ల అంచనాలను ప్రభావితం చేసింది. రుణాల మంజూరులో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం, వడ్డీ మరియు ఛార్జీల్లో పారదర్శకత ఉండటం, రిస్క్‌ను సమగ్రంగా అంచనా వేయడం వంటి అంశాల విషయంలో బ్యాంకుల నుంచి కస్టమర్లు భరోసాను కోరుకుంటున్నారు. బ్యాంకులు వ్యాపార వృద్ధిపై మాత్రమే దృష్టి పెట్టడం కాకుండా తాము సేవలందించే కస్టమర్ల దీర్ఘకాలిక ఆర్థిక ఆరోగ్యానికి కూడా మద్దతుగా నిలిచేలా ఉండాలని ఈ అంశాలు సూచిస్తాయి.ఇలాంటి పరిస్థితుల్లో విశ్వసనీయత, వివేచన, స్థిరత్వాన్ని బట్టి నమ్మకం నిలిచి ఉంటుంది.డిజిటల్ పురోగతి - కస్టమర్ అవగాహనభారత్లో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి రోజువారీ బ్యాంకింగ్ విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే చెల్లింపులు పూర్తి చేయవచ్చు. ఎక్కడో దూరంగా ఉండి కూడా ఖాతాలు తెరవొచ్చు. రుణాలపై నిర్ణయాలు కూడా గతంతో పోలిస్తే చాలా వేగంగా తెలియజేయవచ్చు. ఇలాంటి పురోగతి వల్ల వ్యక్తులు, వ్యాపారాలకు ఆర్థిక అంశాల నిర్వహణ మరింత సులభమైంది.అయితే ఈ అభివృద్ధితో పాటు కస్టమర్లలో సైబర్ భద్రత అంశాలపై కూడా అప్రమత్తత పెరుగుతోంది. మోసాలు, డేటా లీక్ ఘటనలు భద్రత చర్యల ఆవశ్యకతను గుర్తు చేస్తున్నాయి. కేవలం సౌలభ్యం మాత్రమే కస్టమర్లకు భరోసా కలిగించడం లేదు. భద్రత, సన్నద్ధత కూడా అంతే ముఖ్యమైనదిగా ఉంటోంది.ఇప్పుడు బ్యాంకులు డిజిటల్ సేవలు అందించగలవా లేదా అనే విషయం గురించి కస్టమర్లు ప్రశ్నించడం లేదు. బ్యాంకులు రిస్క్‌లను ఎంత సమర్ధవంతంగా ముందుగానే గుర్తిస్తున్నాయి, సమస్యలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తున్నాయి అనే అంశాలను గమనిస్తున్నారు. అసాధారణ లావాదేవీలపై తక్షణ అలర్ట్‌లు, అవసరమైన సమయంలో సత్వర సహాయం, ఖాతాలను భద్రంగా ఉంచే స్పష్టమైన విధానాలు కస్టమర్ల విశ్వాసాన్ని నిలబెట్టడంలో కీలకంగా మారుతున్నాయి.దీర్ఘకాలిక నమ్మకాన్ని పెంపొందించుకునే సంస్థలు టెక్నాలజీతో పాటు బాధ్యత కూడా పెరుగుతుందని గుర్తిస్తున్నాయి. అందువల్ల డిజిటల్ సామర్థ్యాల విస్తరణతో పాటు పర్యవేక్షణ వ్యవస్థలు, భద్రతా చర్యలు, స్పందనా విధానాలను పటిష్టం చేసుకోవడంపై కూడా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. డిజిటల్ యుగంలో నమ్మకమనేది అప్రమత్తత, పారదర్శకత, జవాబుదారీతనంపై ఆధారపడి ఉంటుంది.ముందున్న దారిగత దశాబ్దకాలంలో భారత బ్యాంకింగ్ రంగం స్థిరంగా విస్తరించింది. బ్యాంకింగ్ సేవల లభ్యత విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు నిర్ణయాల నాణ్యతపై దృష్టి పెరుగుతోంది. ముఖ్యంగా కీలక సమయాల్లో బ్యాంకులు ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నాయనేది కస్టమర్లు నిశితంగా గమనిస్తున్నారు.కొన్ని సందర్భాల్లో బాధ్యతాయుతమైన బ్యాంకింగ్ అంటే కొంత నిగ్రహం పాటించడం కూడా అవుతుంది. ఉదాహరణకు రుణం తిరిగి చెల్లించే సామర్థ్యం తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే రుణాన్ని నిరాకరించడం, భారీ లావాదేవీల ముందు అదనపు ధృవీకరణ చేపట్టడం, లేదా నిర్దిష్ట ఆర్థిక ఉత్పత్తి అనేది కస్టమర్ పరిస్థితులకు ఎందుకు అనుకూలం కాదనే విషయాన్ని స్పష్టంగా వివరించడంలాంటి చర్యలు అవసరం కావచ్చు. ఇలాంటి నిర్ణయాలు తాత్కాలికంగా వ్యాపార విస్తరణ వేగాన్ని నెమ్మదింపచేసినా, అవి సంస్థల బాధ్యతాయుతమైన వైఖరికి నిదర్శనంగా నిలుస్తాయి. దీర్ఘకాలంలో కస్టమర్ల విశ్వాసాన్ని చూరగొనేందుకు తోడ్పడతాయి. సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా బ్యాంకు సమతుల్యతతో, స్థిరంగా వ్యవహరిస్తుందనే నమ్మకాన్ని పెంచుతుంది.మొత్తంగా చూస్తే విశ్వాసమనేది మాటలతో కాదు, రోజువారీ తీసుకునే చర్యలతోనే ఏర్పడుతుంది. న్యాయబద్ధంగా ఉంటూ, క్రమశిక్షణ, బాధ్యతతో వ్యవహరించే బ్యాంకులు మాత్రమే ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోగలవు. అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి కూడా అవి తోడ్పడతాయి.- హితేంద్ర నాథ్ ఝా, హెడ్ - రిటైల్ లయబిలిటీస్, టీఏఎస్‌సీ & టీపీపీ, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ -
ఇన్నర్ రింగ్ రోడ్ రూటే వేరు..
-
ఇన్నర్ రింగ్ రోడ్ రూటే వేరు..
► అమరావతి, విజయవాడ చుట్టూ ప్రభుత్వ ప్రతిపాదన ► స్వప్రయోజనకోసమంటూ స్థానికుల విమర్శలు ► మొదటి రింగ్‌రోడ్ వద్దే ప్రతిపాదిత ► ఐఆర్ఆర్ కలుస్తున్న వైనం ► పదే పదే భూములు కోల్పోతున్నామని స్థానికుల ఆవేదన సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, విజయవాడ: నూతన రాజధాని అమరావతిలో ప్రతిపాదించిన ‘ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్)’ ఆదిలోనే అష్టవంకర్లూ తిరుగుతోంది. నూతన రాజధానిని కలుపుతూ విజయవాడ చుట్టూ ఏర్పాటు చేస్తున్న ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదిత స్థలాల ఎంపికలో స్వప్రయోజనాలు ఉన్నాయని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అమరావతి నుంచి విజయవాడ చుట్టూ తిప్పి గుంటూరు జిల్లాలోని కొంత ప్రాంతాన్ని కలుపుతూ తిరిగి అమరావతి వరకు 75 మీటర్ల వెడల్పుతో నిర్మించే 85 కిలోమీటర్ల ఈ రింగ్‌రోడ్డును అమరావతి మ్యాప్‌లో ప్రతిపాదించారు. ఈ మధ్యనే సింగపూర్ సంస్థలు సుర్భానా, జురాంగ్ రూపొందించిన పర్స్పెక్టివ్ ప్లాన్, క్యాపిటల్ సిటి మాస్టర్ ప్లాన్లను సీఆర్డీఏ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాప్ ఇన్నర్ రింగ్‌రోడ్‌ను పరిశీలించిన స్థానికులు ప్రస్తుతం ఉన్న ఇన్నర్ రింగ్రోడ్డులోనే రామవరప్పాడు వద్ద కొత్తది కూడా కలవడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. విజయవాడ నగరం విస్తురిస్తుందనే విషయాన్ని విస్మరించి ఈ మ్యాప్‌ను రూపొందించారని మండిపడుతున్నారు. ముప్పయ్యేళ్ల కిందట ‘వీజీటీఎం- ఉడా’, నాలుగేళ్ల కిందట ఎన్హెచ్ఎఐ అధ్యయనం చేసిన వాటిని కూడా పట్టించుకోకుండా తాజా ప్రతిపాదనలను ఎలా రూపొందించారని ప్రజలు చర్చించుకుంటున్నారు. నేతల స్వప్రయోజనం? రెండు ఇన్నర్ రింగ్‌రోడ్లు ఒకే ప్రాంతంలో కలపడం వెనుక అధికారపార్టీ నేతల స్వప్రయోజనం ఉందనేది స్థానికుల వాదన. ఒక రింగ్‌రోడ్డు రామవరప్పాడు వద్ద కలుస్తున్నప్పుడు రెండో రింగ్‌రోడ్డును ప్రసాదంపాడు వద్ద కలిపితే ప్రయోజనకరంగా ఉండేదని వారు చెబుతున్నారు. రామవరప్పాడు రింగ్‌రోడ్డుకు సమీపంలో ఒక దినపత్రిక కార్యాలయ నిర్మాణం జరుగుతోంది. దాని ముందు భాగం నుంచి రామవరప్పాడులో కలుపుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గొల్లపూడి బైపాస్ వద్ద ప్రస్తుత ఇన్నర్ రింగ్‌రోడ్డుకు, ప్రతిపాదిత ఇన్నర్ రింగ్‌రోడ్డుకు మధ్య ఆరు కిలోమీటర్ల వరకు దూరం ఉంది. రామవరప్పాడు సమీపానికి వచ్చేసరికి ఒకటిన్నర కిలోమీటరు దూరం మాత్రమే ఉంది. ప్రారంభంలో ఎంత దూరం ఉందో అంతే దూరంతో ఐదో నంబరు జాతీయ రహదారిలో కలిపితే బాగుండేదని, ఎవరి స్వార్థం కోసమో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం మంచిది కాదనేది పలువురి వాదన. ఇప్పటికే ఇన్నర్ రింగ్‌రోడ్డు కోసం కొంత భూమిని తీసుకున్నారు. మెట్రో ప్రాజెక్టు కోసం నిడమానూరులో 60 ఎకరాలు డిపోకు తీసుకుంటున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఇప్పటికే కొంత భూమిని ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు మరో ఇన్నర్ రింగ్‌రోడ్డు పేరుతో మరికొంత భూమి పోనుంది. ఎవరి కోసమో తాము బలికావాల్సి వస్తోందని భూములు కోల్పోతున్న వారు వాపోతున్నారు. ఎక్కడ నుంచి ఎక్కడకు.. కృష్ణా నదిని ఆనుకుని గుంటూరు జిల్లా పరిధిలో వైకుంఠపురం, పెద్దమద్దూరు, కర్లపూడి, మోతడక, నిడుముక్కల, తాడికొండ, కంతేరు మీదుగా ఐఆర్ఆర్ జాతీయ రహదారిలో కలుస్తుంది. అక్కడి నుంచి చినవడ్లపూడి మీదుగా నదిని దాటి కృష్ణా జిల్లాలో ప్రవేశిస్తుంది. ఈ విషయాన్నీ అధికారికంగా చూపలేదు. ఆ తరువాత రోడ్డు ఎక్కడనే ప్రశ్నకు సమాచారం కరువవుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు... తాడిగడప-ఎనికేపాడు మధ్య ఉన్న 100 అడుగుల రోడ్డుకు ఐఆర్‌ఆర్‌ను కలపాలనేది ప్రతిపాదన. అక్కడి నుంచి వీజీటీఎం-ఉడా హయాంలో మొదలైన రామవరప్పాడు రింగ్ వద్ద నిర్మాణంలోని ఐఆర్ఆర్కు కలిపి గొల్లపూడి వరకు తీసుకువెళ్లాలనేది ఆలోచన. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఇంతకన్నా అశాస్త్రీయ, అసంబద్ధత మరొకటి ఉండదనేది నిపుణుల అభిప్రాయం. బెజవాడ ఇక అభివృద్ధి చెందదు అనే ఉద్దేశంతోనే ఐఆర్ఆర్ ప్రతిపాదనలు ఉన్నట్లు వారు చెబుతున్నారు. అందజేసిన విషయం తెలిసిందే. అయితే అనుభవమున్న ప్రణాళికాకర్తలు, ఉన్నతాధికారులు కూడా ప్రణాళికల్లోని లోపాలను పట్టించుకోకపోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. -
కాల్‌మనీ కేసులో కొత్త కోణాలు


