breaking news
networking channels
-
అమెరికాలో అదే పనిగా...
సాక్షి, హైదరాబాద్ : సాయంత్రం వేళ ఏ ఇద్దరు కలిసినా కాసేపు కబుర్లు చెప్పుకునే సందర్భాలు రానున్న కాలంలో ఉండవేమో. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ వాటిల్లో ఏదో ఒక మీడియాకు అలవాటు పడిపోతున్నారు. ప్రత్యేకించి ఫేస్ బుక్, వాట్సాప్, యూట్యూబ్, ట్విటర్, ఇన్ స్టాగ్రామ్... ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో వేదికలు. ఎన్నెన్నో వింతలు. ఈ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ వాడకం విషయంలో ఒక్కో దేశంలో ఒక్కో విధంగా వాడుతున్నారు. కొత్త స్నేహితులను వెతుక్కోవడం, బంధాలు, సంబంధాలు తెగిపోయిన వారిని కలుపుకోవడం, ప్రపంచ నలుమూలల్లో జరుగుతున్న సంఘటనల సమాచారాన్ని తెలుసుకోవడం, ఆయా విషయాలపై స్పందించడం, తమ అనుభావాలను ఇతరులతో పంచుకోవడం... ఇలా అనేక రకాలుగా ప్రజలు సోషల్ మీడియా వేదికలపై ఆధారపడుతున్నారు. సోషల్ మీడియా - ప్రపంచంలోనే ప్రజలందరికీ ఒక వ్యసనంలా మారిన ఈరోజుల్లో మార్కెట్ రీసెర్చ్ రంగంలో ఉన్న ' ఆడియన్స్ ప్రాజెక్ట్ ' సంస్థ ఒక అధ్యయనం జరిపింది. సోషల్ మీడియా, యాప్స్ వినియోగంపై జరిపిన అధ్యయనంపై ఇన్ సైట్ - 2017 పేరుతో నివేదిక విడుదల చేసింది. ప్రధానంగా అమెరికా, యూకే, డెన్మార్క్, ఫ్రాన్స్, స్వీడన్, నార్వే, ఫిన్ ల్యాండ్ లాంటి ఆరు దేశాల్లో నిర్వహించిన ఈ సర్వే వివరాలు పరిశీలిస్తే అనేక ఆసక్తికర విషయాలు (సాక్షి స్పెషల్) వెల్లడయ్యాయి. భారత దేశంలో అయితే రోజుకు సగటున ఒకసారి ఫేస్ బుక్ పేజీ తెరిచి చదువుతారట. కొందరు నాలుగైదుసార్లు, మరికొందరు రెండుమూడుసార్లు తెరిచే వారి జాబితాలో ఉండొచ్చు. అదే అమెరికాలో.. ఒక రోజులో ఒకటి రెండుసార్లు కాదు... అనేకసార్లు ఫేస్ బుక్ చూసుకుంటారట. ఫేస్ బుక్ చూడందే వారికి గడవదు. అమెరికాలో మొబైల్ ఫోన్ వినియోగదారుల్లో సగానికిపైగా ఫేస్ బుక్ ను ప్రతి రోజూ అనేకసార్లు ఓపెన్ చేసుకుని చూస్తారని ఆడియన్స్ ప్రాజెక్టు తన నివేదకలో వెల్లడించింది. ఫేస్ బుక్ చూడలేదంటే వారెంతో వెనుకబడిపోయినట్టుగానే భావిస్తున్నారట. సాధారణంగా తమ ఫోన్ లో ఒకటి నుంచి మూడు యాప్స్ (ఫోన్ ఇన్ బిల్ట్ ఉన్న యాప్స్ కాకుండా) డౌన్ లోడ్ చేసుకుంటారు. కానీ అమెరికాలో యాప్స్ డౌన్ లోడు చేసుకునే వారి సంఖ్య కూడా ఎక్కువేనట. అమెరికాలోని మొబైల్ వినియోగదారుల్లో సగానికిపైగా ప్రజలు ఒక రోజులో అనేకసార్లు ఫేస్ బుక్ ను ఓపెన్ చేసేవారు 53 శాతం ఉన్నారు. 24 శాతం ప్రతిరోజూ ఓపెన్ చేస్తారు. 12 శాతం ప్రజలు వారంలో అనేకసార్లు, 5 శాతం నెలలో అనేకసార్లు, 3 శాతం నెలకోసారి ఓపెన్ చేసుకుంటారట. 2 శాతం వినియోగదారులు ఎప్పుడోగాని ఫేస్ బుక్ పేజీ ఓపెన్ చేయరట. మొబైల్ వినియోగదారుల్లో ఫేస్ బుక్ పరిచయం లేనివారంటూ ఒక్కరూ లేరు. ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విటర్, ఇన్ స్టగ్రామ్, పింటెరెస్ట్, స్నాప్ చాట్, లింక్డిన్, వాట్సాప్, టంబ్లర్, రెడిట్, పెరిస్కోప్... ఇలాంటి సోషల్ మీడియా వేదికలు వేటిని పరిశీలించినా అన్నింటిలోనూ పురుషుల సంఖ్య ఎక్కువగా ఉండగా, ఫేస్ బుక్ పరిశీలించుకునే వారిలో మాత్రం (పురుషులు 76 శాతం) మహిళలు (84 శాతం) ఉన్నారు. చేతిలో మొబైల్ పట్టుకున్నారంటే... చాలు మొట్టమొదట ఫేస్ బుక్ చెక్ చేసుకోవడం ఒక వ్యాపకంగా మారిందట. ఫేస్ బుక్ చూసుకునే వారితో పాటు ఇతర నెట్ వర్కింగ్ యాప్స్ వినియోగదారులు కూడా గణనీయంగా పెరుగుతున్నారు. (సాక్షి స్పెషల్ రిపోర్ట్) -
భలే ఆప్స్
అన్‌లాక్‌తో రివార్డ్ పాయింట్స్ స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే.. రోజుకు పది, ఇరవైసార్లైనా దాన్ని అన్‌లాక్ చేస్తూంటాం. కాల్ వచ్చినా, లేకున్నా జరిగే ఈ పనితో మీకు ‘ప్రయోజనం’ ఉంటే? భలే ఉంటుంది కదూ. అన్‌లాకర్ UnLockar అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుంటే జరిగేది ఇదే. ఫోన్‌ను అన్‌లాక్ చేసిన ప్రతిసారీ మీకు కొన్ని రివార్డు పాయింట్లు దక్కుతాయి. వాటితో మీరు షాపింగ్ చేయవచ్చు. బుక్ మై షోతో సినిమా టికెట్లూ పొందవచ్చు. మీరు చేయాల్సిందల్లా మీకు నచ్చిన నెట్ ఛానెల్స్‌కు సబ్‌స్క్రైబ్ చేయడం మాత్రమే. ఆ తరువాత మొత్తం వ్యవహారమంతా మీ లాక్స్క్రీన్పైకి మారిపోతుంది. ఒక్కసారి ఈ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకున్న తరువాత మీ లాక్‌స్క్రీన్‌పై మీకు నచ్చిన ఛానెల్ తాలూకూ వివరాలు ప్రత్యక్షమవుతాయి. స్క్రీన్‌ను ఒకవైపునకు స్వైప్ చేస్తే ఛానెల్ వివరాలను పోస్ట్ చేయవచ్చు. మరోవైపునకు స్వైప్ చేస్తే ఇంకో పని ఇలా... ప్రతిసారీ మీకు కొన్ని యూపాయింట్లు దక్కుతాయి. వాటితో కంపెనీకి చెందిన యూషాప్లోగానీ, ఇతర పార్టనర్ వెబ్సైట్ల ద్వారా గానీ వస్తువులుగా మార్చుకోవచ్చు. అంధుల కోసం ఆప్... దృష్టిలోపంతో బాధపడుతున్న వారికి ఈ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ భలే ఉపయోగపడుతుంది. యూనివర్శిటీ ఆఫ్ అలికాంటీ (స్పెయిన్) అభివృద్ధి చేసిన ఈ అప్లికేషన్ అంధుల దారిలో ఎదురయ్యే అవరోధాలను ముందుగా గుర్తించి వినియోగదారుడిని హెచ్చరిస్తుంది. ఫోన్లోని త్రీడీ కెమెరా సాయంతో ఇది జరిగిపోతుంది. తొమ్మిది మంది అంధులపై పరిశీలించి దీని పనితీరును నిర్ధారించారు. మనిషి కళ్ల మాదిరిగానే రెండు లెన్సులు ఉన్న త్రీడీ కెమెరాను ఉపయోగించడం వల్ల ఈ అప్లికేషన్ ద్వారా అవరోధాలను గుర్తించడం సులువు అవుతోందని అంచనా. ఏదైనా అవరోధం ఆరు అడుగుల కంటే తక్కువ దూరంలో ఉన్నట్లు గుర్తించిన వెంటనే అప్లికేషన్ వైబ్రేషన్ ద్వారా వినియోగదారుడిని హెచ్చరిస్తుంది. దగ్గరకొచ్చిన కొద్దీ వ్రైబేషన్ స్థాయి పెరిగిపోతుంది. సౌండ్ అలర్ట్ కూడా వినిపించడం మొదలవుతుంది. అతిత్వరలోనే ఈ అప్లికేషన్ అందరికీ అందుబాటులోకి రానుంది. సీక్రెట్ అప్లికేషన్ ఆండ్రాయిడ్‌లోనూ... ఆపిల్ ఐస్టోర్‌లో ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన ‘సీక్రెట్’ అప్లికేషన్ ఆండ్రాయిడ్ ఫోన్ల్కూ అందుబాటులోకి వచ్చేసింది. మీ ఉనికిని బహిరంగపరచకుండా అంతర్జాతీయ ఫోరమ్‌లలో పోస్టింగ్ చేసేందుకు, ఫైల్స్ షేర్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది ఈ అప్లికేషన్. సీక్రెట్ అప్లికేషన్ కోసం సైన్ చేసిన వెంటనే మీ మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్లను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత జరిగేదంతా రహస్యమే.