breaking news
Neha bamb
-
'దిల్' సినిమా హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూడండి!
నేహా బాంబ్.. ఈ పేరు వినగానే పెద్దగా తెలిసిన వ్యక్తి కాదులే అంటారేమో కానీ 'దిల్' హీరోయిన్ అంటే మాత్రం ఇట్టే గుర్తు పడతారు. ఈ సినిమాలో నితిన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన నందినిగా అద్భుతంగా నటించి అప్పట్లో అందరి దిల్ దోచుకుంది నేహా. అప్పుడే విరబూసిన పారిజాతంలా ఎంతో కోమలంగా కనిపించే ఈ హీరోయిన్ ఇప్పుడెక్కడుంది? ఎలా ఉంది? ఏం చేస్తుందో తెలుసుకుందాం. టాలీవుడ్‌కు రావడానికి ముందు నేహా బాంబ్ హిందీలో 'ఇష్క్ హోగయా మేను' సినిమాలో నటించింది. తర్వాత తెలుగు పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న ఈ ముద్దుగుమ్మ వివి వినాయక్ తెరకెక్కించిన 'దిల్' సినిమాకు సైన్ చేసింది. ఈ చిత్రంలో నందిని పాత్రతో యూత్‌ను తెగ అట్రాక్ట్ చేసిన నేహా తర్వాత కూడా వరుస హిట్లు కొడుతుందనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆమె ఎంపిక చేసుకున్న సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. అతడే ఒక సైన్యం, దోస్త్ చిత్రాలు ఆమె కెరీర్‌కు ప్లస్ కాలేకపోయాయి. దీంతో హీరోయిన్గా అవకాశాలు రాకపోవడంతో సైడ్ క్యారెక్టర్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధపడిపోయిందీ నటి. అలా బొమ్మరిల్లు, దుబాయ్ శీను సినిమాల్లో మెయిన్ రోల్ కాకుండా చిన్న పాత్రల్లో కనిపించింది. ఇక్కడ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలోనే బాలీవుడ్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది నేహా బాంబ్. కానీ అక్కడ కూడా ఆమెకు మొండిచేయే ఎదురైంది. అయితే గుడ్డిలో మెల్ల నయం అన్నట్లుగా సినిమా ఛాన్సులు రాలేదు కానీ సీరియళ్లలో అవకాశాలు వచ్చాయి. ప్రేక్షకులను అలరించడానికి ఏ ప్లాట్‌ఫామ్ అయితే ఏముంది అనుకుందో ఏమో కానీ కైసే యే ప్యార్ హై సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది నేహా. సీరియళ్లు చేస్తున్న సమయంలో హోస్ట్‌గానూ ఆఫర్ వచ్చింది. చివరగా 2009లో 'నాగిన్ వాడన్ కీ అగ్నీ పరీక్ష' సీరియల్లో మెరిసిన తర్వాత ఇండస్ట్రీకి దూరమైపోయింది. ఓ రకంగా చెప్పాలంటే ఈ సీరియల్ తర్వాత ఆమె నటనకు పూర్తిగా గుడ్‌బై చెప్పేసింది. రిషిరాజ్ జవేరీని పెళ్లి చేసుకున్న నేహా ప్రస్తుతం గృహిణిగా జీవనం సాగిస్తోంది. అయితే ఆమె తిరిగి సినిమాల్లోకి వస్తే బాగుండు అనుకుంటున్నారు నేహా బాంబ్ అభిమానులు. మరి వారి కోరిక కలగానే మిగిలపోతుందో, నెరవేరుతుందో చూడాలి! -
అజ్ఞాతవాసం: ‘నేహా’లంతా ఏమయ్యారో!
ఆ ముగ్గురి పేరూ ఒక్కటే. ముగ్గురికీ యువ హీరోల పక్కన మంచి అవకాశాలే వచ్చాయి. ముగ్గురూ కెరీర్లో దూసుకుపోతారని అందరూ అనుకున్నారు. తామకు ఎక్కడికో వెళ్లిపోతామని వాళ్లూ అనుకున్నారు. కానీ కన్నుమూసి తెరిచేలోగా అందరి అంచనాలూ తలకిందులయ్యాయి. వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్లిపోయారు. అందుకే ఇప్పుడా ముగ్గురూ మన దగ్గర లేరు. మన ముందుకు రావడమూ లేదు. అసలు అవకాశాలు రావడమే కష్టం అనుకునే పరిశ్రమలో, అవకాశాలు వచ్చి కూడా ఎదగలేకపోయిన ఆ ముగ్గురూ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? నేహా ఒబెరాయ్ ‘అతి మెత్తని మనసును గిల్లి... నచ్చావోయ్ అచ్చ తెలుగబ్బీ’ అంటూ పవన్ కళ్యాణ్‌ని చూసి పాటేసుకుంది ఈ చిన్నది ‘బాలు’ సినిమాలో. మొదటి అవకాశమే పవన్ కళ్యాణ్‌తో అంటే ముందు ముందు ఎన్ని చాన్సులు కొట్టేస్తుందో అనుకున్నారంతా. కానీ ఆ సినిమా తరువాత నేహా తెలుగులో కనిపించిందే లేదు. ముంబైలో పుట్టిన నేహా... బాలీవుడ్ నిర్మాత ధరమ్ ఒబెరాయ్ కూతురు. మోడలింగ్ మీద మనసు పారేసుకుని, యాడ్ రంగంలో దూసుకెళ్లాలని కలలు కంటున్న సమ యంలో ‘బాలు’ (2005) చిత్రంలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా నటించే అవకాశం దొరికింది. ఆ తర్వాత బాలీవుడ్లో అవకాశాలు వచ్చాయి. సంవత్సరానికొకటి చొప్పున బ్రహ్మాస్త్ర, దస్ కహానియా, ఉడ్‌స్టాక్ విల్లా చిత్రాలు చేశాక, ప్రముఖ వజ్రాల వ్యాపారి విశాల్ షాని పెళ్లాడింది. కాస్త గ్యాప్ తర్వాత ‘ఆస్మాన్’ చిత్రంలో నటించింది. అంతే... నాటి నుంచి నేటి వరకూ మళ్లీ తెరమీద మెరిసింది లేదు. మెరిసే సూచలూ కనిపించడం లేదు. ప్రస్తుతం నోయిడాలోని ‘ఏషియన్ అకాడెమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్’లో సభ్యురాలిగా ఉందని సమాచారం. నేహా బామ్బ్ 2003లో నితిన్ ‘దిల్’ని కొల్లగొట్టిన ఈ సుందరాంగి... అంతకుముందే ‘ఇష్క్ హోగయా మైనూ’ అనే సినిమాలో నటించింది. కానీ పెద్దగా పేరు రాలేదు. అంతలో వీవీ వినాయక్ పిలిచి ‘దిల్’లో చోటిచ్చాడు. ఆ సినిమా హిట్ కావడంతో ఆ వెంటనే అతడే ఒక సైన్యం, దోస్త్ సినిమాలు చేసింది. అయితే... అక్కడితో హీరోయిన్గా ఆమె కెరీర్‌కి బ్రేక్ పడిపోయింది. రెండేళ్ల పాటు మాయమైపోయింది. తర్వాత మళ్లీ ‘బొమ్మరిల్లు’లో ప్రత్యక్షమయ్యింది. ‘నాన్నగారు చెప్పారండీ’ అంటూ అమాయకంగా కనిపించే గెస్ట్ రోల్లో మెప్పించింది. కానీ అవకాశాలను మాత్రం అందిపుచ్చుకోలేకపోయింది. బాలీవుడ్ వెళ్లి ‘పంజాబీ కుడీ’ చేసినా, తిరిగి టాలీవుడ్‌కి వచ్చి ‘దుబాయ్ శీను’లో మరోసారి అతిథిలా కనిపించినా ఫలితం లేకపోయింది. ఇక వెండితెర మీద వెలగలేనని అర్థమైపోయిందో ఏమో... బుల్లితెర వైపు పయనం సాగించింది. వరుసగా ఓ నాలుగు సీరియల్స్ చేసింది. రిషిరాజ్ ఝవేరీ అన్న వ్యక్తిని పెళ్లాడిన నేహ... బుల్లితెర మీద కూడా పెద్దగా కనిపించడం లేదు. మరి ఏం చేస్తోందో ఏమో! నేహా జుల్కా నవ్వినప్పుడు బుగ్గన పడే సొట్టలు, చిన్నవిగా అయిపోయే కళ్లు నేహా జుల్కా ప్రత్యేకతలు. హుషారుగా, ఎగసిపడే అలలా ఉండే ఆమె కెరీర్ పరవళ్లు తొక్కే నదిలా వేగంగా సాగిపోతుందనుకున్నారంతా. అనుకున్నట్టుగానే ఒక్క సంవత్సరంలో మూడు సినిమాలు చేసింది. కానీ అవకాశాలు వచ్చినంత వేగంగా అదృష్టం కలసి రాలేదు. అందుకే వెనకబడిపోయింది. మరుసటేడుకి కనుమరుగైపోయింది. 2007లో ‘ఒక్కడున్నాడు’లో గోపీచంద్ సరసన నటించింది నేహా, గౌతమి పాత్రను బాగానే పండించింది. కానీ ఆ సినిమా సక్సెస్ కాకపోవడం ఆమెను నిరుత్సాహపర్చింది. తర్వాత ‘వియ్యాలవారి కయ్యాలు’లో ఉదయ్ కిరణ్‌తో చేసింది. ఆ సినిమా కూడా పరాజయాన్నే చవిచూసింది. దాంతో తెలుగులో నేహా ప్రయాణానికి ఫుల్స్టాప్ పడింది. వెంటనే బాలీవుడ్‌కి వెళ్లిపోయి ‘కైసే కహే’లో నటించింది. అక్కడా దురదృష్టమే వెంటాడింది. కనీసం సీరియల్స్లోనయినా వెలుగుదామని ప్రయత్నించింది కానీ అక్కడా నిరాశే మిగిలింది. 2010 తరువాత అసలు కనిపించడమే మానేసింది.