breaking news
ndian Oil Corporation
-
దొంగ తెలివి మామూలుగా లేదు!. ఆయిల్ చోరీకి ఏకంగా సొరంగమే తవ్వేశాడు
తాళం వేసిన ఇళ్లలోకి చొరబడి, డబ్బులు, బంగారం, నగలు చోరీ చేసిన ఘటనలు చూసే ఉంటాం. చైన్ స్నాచింగ్‌లు సైతం పెరిగిపోయాయి. జేబులోని పర్సులు, మొబైల్ విషయాల్లోనూ కొందరు చేతివాటం ప్రదర్శిస్తూ ఉంటారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ దొంగతనం గురించి తెలిస్తే షాక్ అవ్వకుండా అస్సలు ఉండలేదు. ఆయిల్‌ను దొంగతనం చేసేందుకు ఓ వ్యక్తి ఏకంగా సొరంగం తవ్వేశాడు. పోచన్‌పూర్‌కు చెందిన రాకేష్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) పైపుల నుంచి ఆయిల్‌ను అపహరించడానికి పెద్ద పథకమే వేశాడు. ఢిల్లీ - పానిపట్ ఇండియన్ ఆయిల్ పైప్‌లైన్ ప్రాంతానికి సొరంగం తవ్వాడు. ప్లాస్టిక్ పైపులు ఏర్పాటుచేసి పైపులైన్‌లోని ఆయిల్‌ను తోడేయడం ప్రారంభించాడు. ఆయిల్ సరఫరా తగ్గడంతో అనుమానం వచ్చిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: ఇదెక్కడి వింత.. దోమలను ఆసుపత్రికి తీసుకొచ్చిన వ్యక్తి, షాకైన వైద్యులు సెప్టెంబర్ 29న పైప్‌లైన్‌ను తనిఖీ చేయగా.. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఆయిల్ దొంగిలిస్తున్నట్లు తెలిసిందని ఫిర్యాదులో తెలిపింది. కంపెనీ ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి అక్కడ తవ్వకాలు జరిపి ఆశ్చర్యపోయారు. మెయిన్ ఆయిల్ లైన్‌కు డ్రీల్లింగ్ ద్వారా రంధ్రాలు చేసి ప్లాస్టిక్ పైపులు పెట్టి ఆయిల్ దొంగతనం చేసేందుకు ఓ మిషన్‌ను అమర్చినట్లు గుర్తించారు. సొరంగం ద్వారా ఐఓసీఎల్ పైప్‌లైన్‌కు 40 మీటర్ల దూరం వరకు పైపులు వేసినట్లు తేలింది. ఈ పైపులు 52 ఏళ్ల రాకేష్ అలియాస్ గోలు అనే వ్యక్తికి చెందిన పొలంలోకి ఉండటంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని, మిగతా వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఐఓసీ బోనస్ బొనాంజా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో ఏకంగా రెండు రెట్లు పెరిగింది. స్టాండ్ అలోన్ ప్రాతిపదికన గత క్యూ3లో రూ.3,995 కోట్లుగా ఉన్న నికర లాభం... ఈ క్యూ3లో రూ.7,883 కోట్లకు పెరిగినట్లు ఐవోసీ తెలియజేసింది. ఇన్వెంటరీ లాభాలతో పాటు రిఫైనరీ మార్జిన్ కూడా పెరగడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో వృద్ధి చెందినట్లు కంపెనీ చైర్మన్ సంజీవ్ సింగ్ చెప్పారు. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు అంతే ముఖ విలువ గల ఒక షేర్‌ను బోనస్‌గా (1:1) ఇవ్వడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని, ఈ బోనస్ షేర్ల జారీకి వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉందని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేర్‌కు రూ.19 చొప్పున (190 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను చెల్లిస్తామని, ఈ డివిడెండ్ చెల్లింపునకు అర్హులైన వాటాదారుల్ని నిర్ణయించడానికి వచ్చేనెల 9వ తేదీని రికార్డు తేదీగా నిర్ణయించామని తెలియజేశారు. వచ్చే నెల 28 లోపు వాటాదారుల ఖాతాల్లోకి డివిడెండ్ చేరుతుందన్నారు. 12 డాలర్లకు పెరిగిన జీఆర్ఎమ్.. ఒక్కో బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చడం వల్ల వచ్చే స్థూల రిఫైనరీ మార్జిన్ (జీఆర్ఎమ్) 7.67 డాలర్ల నుంచి 12.32 డాలర్లకు పెరిగినట్లు సింగ్ వివరించారు. గత క్యూ3లో రూ.3,051 కోట్లుగా ఉన్న ఇన్వెంటరీ లాభాలు ఈ క్యూ3లో రూ.6,301 కోట్లకు పెరిగాయన్నారు. ఈ క్యూ2లో రూ.90,567 కోట్లుగా ఉన్న నిర్వహణ ఆదాయం ఈ క్యూ3లో 22 శాతం వృద్ధితో రూ.1.1 లక్షల కోట్లకు పెరిగిందని, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన నిర్వహణ లాభం 80 శాతం వృద్ధి చెంది రూ.12,269 కోట్లకు ఎగిసినట్లు వివరించారు. జీఎస్టీ ఎఫెక్ట్..రూ.700 కోట్ల ప్రభావం జీఎస్టీ పరిధిలో పెట్రోల్ లేనందున తమ మొత్తం ఆదాయంపై రూ.700 కోట్ల మేర ప్రభావం పడిందని ఐవోసీ డైరెక్టర్ (ఫైనాన్స్) ఎ.కె. శర్మ చెప్పారు. ముడి పదార్ధాలపై జీఎస్టీని చెల్లిస్తున్నామని, కానీ ఈ పన్నులను తుది ఉత్పత్తిపై భర్తీ చేసుకోలేకపోతున్నామని చెప్పారాయన. ఈ భారం వార్షికంగా రూ.2,000 కోట్ల మేర ఉండొచ్చన్నారు. కాగా ఫలితాలు అంచనాలను మించడం, డివిడెండ్ చెల్లింపు, బోనస్ షేర్ల జారీ వంటి సానుకూలాంశాల కారణంగా బీఎస్ఈలో ఐఓసీ షేర్ 4% లాభంతో రూ.416 వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్ల స్థాయికి పెట్రో ధరలు భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు అంతర్జాతీయ మార్కెట్లోని ధరల స్థాయికి సమానంగా ఉన్నాయని ఐవోసీ చైర్మన్ సంజీవ్ సింగ్ చెప్పారు. 15 రోజుల అంతర్జాతీయ ధరల సగటు ఆధారంగా రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్నామని తెలిపారు. డిసెంబర్లో తొలి పదిహేను రోజుల్లో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలను రోజుకు 1–3 పైసల రేంజ్లో ఐవోసీ వంటి ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు తగ్గించాయి. గుజరాత్ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన డిసెంబర్ 14 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ప్రారంభమైంది. -
ఎథికల్ హ్యాకింగ్ కోర్సును అందిస్తున్న వర్సిటీలు..
బీటెక్ (ఈఈఈ) తర్వాత ఎటువంటి అవకాశాలు ఉంటాయి? -కిరణ్, మంచిర్యాల. బీటెక్ (ఈఈఈ) తర్వాత ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటే గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) పరీక్షకు హాజరు కావచ్చు. తద్వారా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)-బెంగళూరు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లు సహా ఏ ఇన్‌స్టిట్యూట్‌లోనైనా.. ఎంఈ/ ఎంటెక్/పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. పలు పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ఎంట్రీలెవల్ రిక్రూట్మెంట్ కోసం కూడా గేట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. బార్క్, భారత అణుశక్తి శాఖలోని కొన్ని విభాగాలు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లు.. గేట్ స్కోర్ ఆధారంగానే ఎంట్రీ లెవల్ ఉద్యోగులను భర్తీ చేసుకుంటున్నాయి. మన రాష్ట్రంలో పీజీఈసెట్ ద్వారా ఎంటెక్/ఎంఈ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. మరో అవకాశం యూపీఎస్సీ జాతీయ స్థాయిలో నిర్వహించే ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఐఈఎస్). ఈ పరీక్ష ద్వారా ఇండియన్ రైల్వే సర్వీస్, ఇండియన్ రైల్వే స్టోర్ సర్వీస్, సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీస్, సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ సర్వీస్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్-ఏ, బీ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేస్తారు. వివరాలకు: www.upsc.gov.in సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి? -శంకర్, నెల్లూరు. ఇంటర్నెట్, కంప్యూటర్ల వినియోగంలో అనుసంధానం చేసిన నెట్‌వర్క్‌కు సంబంధించిన లోపాలను గుర్తించి వాటికి పరిష్కారం చూపడమే ఎథికల్ హ్యాకింగ్. హ్యాకింగ్ టూల్స్, టెక్నిక్స్ ఉపయోగించి నెట్వర్క్, అప్లికేషన్స్, వెబ్‌సైట్స్ తదితరాల నెట్‌వర్క్‌కు చెందిన సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను సురక్షితంగా ఉంచేందుకు కావల్సిన వ్యూహాలను ఎథికల్ హ్యాకర్స్ రూపొందిస్తారు. కోర్సులో భాగంగా నెట్వర్క్ ప్రోటోకాల్స్, ఆర్కిటెక్చర్, నెట్‌వర్కింగ్‌టూల్స్, టెక్నిక్స్ ప్రోగ్రామింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ అంశాలను బోధిస్తారు. ఎథికల్ హ్యాకింగ్ కోర్సును పలు యూనివర్సిటీలు పీజీ స్థాయిలో ఆఫర్ చేస్తున్నాయి. వివరాలు.. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)- హైదరాబాద్ కోర్సు: ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) వివరాలకు: www.iiit.ac.in ేఎన్టీయూ-హైదరాబాద్ కోర్సు: ఎంటెక్ (కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) వివరాలకు: www.jntuh.ac.in ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం కోర్సు: ఎంటెక్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్) వివరాలకు: www.andhrauniversity.edu.in ఈ యూనివర్సిటీలు గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్)లేదా పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) ఆధారంగా ప్రవేశం కల్పిస్తాయి. పీజీ (రోబోటిక్స్) కోర్సు వివరాలను తెలపండి? -కళ, విజయనగరం. రోబోటిక్స్ అనేది మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సాఫ్ట్వేర్ బ్రాంచ్‌లకు సంబంధించిన ఇంటర్‌డిసిప్లినరీ సబ్జెక్ట్. రోబోటిక్స్‌లో ఎంఈ/ఎంటెక్ చేయాలనుకునే వారు బీటెక్ (మెకానికల్)/అనుబంధ బ్రాంచ్‌లతో పూర్తి చేయాల్సి ఉంటుంది. రోబోటిక్స్ పూర్తిచేసిన వారికి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, మైనింగ్, టూల్ డిజైన్, ఏవియేషన్, ఆటోమొబైల్ వంటి రంగాలు కెరీర్ అవెన్యూస్‌గా ఉంటాయి. ఎంఈ/ఎంటెక్ (రోబోటిక్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లు: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కోర్సు: ఎంటెక్(కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) అడ్మిషన్: గేట్ స్కోర్ ఆధారంగా. వివరాలకు: www.uohyd.ac.in యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్- ఉస్మానియా యూనివర్సిటీ కోర్సు: ఎంఈ(ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్) అడ్మిషన్: గేట్/పీజీఈసెట్ స్కోర్ ఆధారంగా ఆంధ్రా యూనివ ర్సిటీ-విశాఖపట్నం కోర్సు: కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విత్ ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్సీ రోబోటిక్స్ స్పెషలైజేషన్‌గా అడ్మిషన్: గేట్/పీజీఈసెట్ స్కోర్ ఆధారంగా వివరాలకు: www.andhrauniversity.edu.in పెట్రోలియం, గ్యాస్, చమురు రంగాలకు సంబంధించి ఎంబీఏ మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తున్న సంస్థలేవి? - జీవిత, నరసన్నపేట. ఎంబీఏ-పెట్రోలియం మేనేజ్మెంట్ కోర్సును అందిస్తున్న సంస్థలు భారతదేశంలో తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ, రాయ్‌బరేలీ (ఉత్తరప్రదేశ్).. పెట్రోలియం అండ్ ఎనర్జీ మేనేజ్మెంట్లో ఎంబీఏ కోర్సును అందిస్తోంది. అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలి. ప్రవేశపరీక్షలో ప్రతిభ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. వెబ్సైట్: www.rgipt.ac.in యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్, డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్).. ఆయిల్ అండ్ గ్యాస్ మేనేజ్మెంట్లో ఎంబీఏ కోర్సును అందిస్తోంది. వెబ్సైట్: www.upesindia.org స్కూల్ ఆఫ్ పెట్రోలియం మేనేజ్మెంట్, గాంధీనగర్ (గుజరాత్).. చమురు, గ్యాస్ రంగానికి సంబంధించి ఎంబీఏ కోర్సును అందిస్తోంది. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్. క్యాట్ స్కోర్, జీడీ, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.