National Womens Parliament-2017
-
దుర్గమ్మను దర్శించుకున్న కవిత
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను నిజామాబాద్ ఎంపీ కవిత శుక్రవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గనడానికి వచ్చిన ఆమె సదస్సు అనంతరం ఇంద్రకీలాద్రికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ ఈవో, అర్చకులు స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. -
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: ఎంపీ కవిత
విజయవాడ: అమరావతిలో జరుగుతున్న మహిళ పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనడానికి నిజామాబాద్ ఎంపీ కవిత విజయవాడకు చేరకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై మీ వైఖరేంటని విలేకరులు ప్రశ్నించగా.. ’ప్రజలు కోరుకుంటున్న వాటిని అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుంది. ఏపీకి ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోవాలి. ఆంధ్ర ప్రజలకు మేము అండగా ఉంటాము. రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగువారిగా కలిసి ఉండాలి’ అన్నారు. మహిళ పార్లమెంటేరియన్ల సదస్సుకు హాజరైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.