breaking news
National newspapers
-
అక్షర ధీర
‘పత్రికొక్కటున్న పదివేల సైన్యం... పత్రికొక్కటున్న మిత్రకోటి’... ఆనాటి నార్ల వారి మాట ఇప్పటికీ శక్తిమంతమైనదే. పత్రికల శక్తిని తెలియజేసేదే! పత్రిక అంటే ప్రజల ఆత్మీయ నేస్తం. దారి చూపే దీపం. సమాజానికి ముప్పు వాటిల్లినప్పుడు పత్రిక ప్రజల గొంతుక అవుతుంది. పాశుపతాస్త్రం అవుతుంది. స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి నేటి వరకు రిపోర్టర్, ఫొటో జర్నలిస్ట్, పొలిటికల్ కార్టూనిస్ట్... వివిధ స్థాయులలో పత్రికారంగంలో మెరిసిన మహిళలు ఎంతోమంది ఉన్నారు...జేమ్స్ ఆగస్టస్ హికీ 1780 జనవరి 29న ‘హికీస్ బెంగాల్ గెజిట్’ పత్రికను ప్రారంభించారు. ఇది మన దేశంలోని మొదటి వార్తాపత్రిక మాత్రమే కాదు ఆసియాలోని మొట్టమొదటి వార్తాపత్రిక కూడా. భారతదేశంలో నిశ్శబ్దంగా మొదలైన ప్రింట్ జర్నలిజం సామాజిక రంగాన్ని ప్రభావితం చేసే శక్తిగా ఎదిగింది. స్వాతంత్య్ర పోరాటంలో ఉద్యమకారుల గొంతుక అయింది. నాయకులు, విప్లవకారుల అభి్రపాయాలను సాధారణ ప్రజలకు చేరవేయడం ద్వారా రాజకీయ పరివర్తన సాధనాలుగా పనిచేశాయి. అప్పటి బ్రిటిష్ ఇండియాలోని కలకత్తాలో ప్రారంభమైన ‘హికీస్ బెంగాల్ గెజిట్’ లేదా ‘ది ఒరిజినల్ కలకత్తా జనరల్ అడ్వరై్టజర్’ రెండు సంవత్సరాల పాటు నడిచింది. ఈ పత్రిక నాటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ పరిపాలనను తీవ్రంగా వ్యతిరేకించింది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు తొలి బీజం వేసింది.అరుణ అడుగు జాడలలో...భారతీయ పత్రికరంగంలో కీలక పాత్ర పోషించిన మహిళా జర్నలిస్ట్‌లలో అరుణ అసఫ్ అలీ మొదటి వరుసలో నిలుస్తారు. స్వాతంత్య్రోద్యమ పోరాట యోధురాలైన అరుణ 1950 చివరిలో ‘పేట్రియాట్’ దినపత్రికను, ‘లింక్’ వారపత్రికను ప్రారంభించారు. ఈ పత్రికలు కార్మికుల హక్కులు, సామాజిక న్యాయంపై దృష్టి సారించాయి. సైద్ధాంతిక చర్చలకు వేదికలయ్యాయి.ఛాయాచిత్ర సంచలనంఫొటో జర్నలిజం ద్వారా ప్రింట్ మీడియాలో సత్తా చాటిన జర్నలిస్ట్ హోమై వ్యరవాలా. ‘డాల్టా’ పేరుతో సుపరిచితురాలైన ఆమె భారతదేశంలోని తొలి మహిళా ఫొటో జర్నలిస్ట్. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు ఆమె ముంబైలోని ‘ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’ పత్రికలో పనిచేస్తున్నారు. తొలినాళ్లలో హోమై తీసిన ఫొటోలు ఆమె భర్త పేరుతో ప్రచురితమైనాయి.‘మహిళలు అన్నిచోట్లా తిరగడం ఆరోజుల్లో చాలామంది ఇష్టపడేవారు కాదు. నేను చీర కట్టుకొని, మెడలో కెమెరాతో తిరుగుతూ ఉన్నప్పుడు నన్ను వింతగా చూసేవారు. సరదా కోసం అలా తిరుగుతున్నానని అనుకునేవారు. నన్ను సీరియస్‌గా తీసుకునేవారు కాదు. దాంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఫొటోలు తీయగలిగాను. నాపై ఎవరూ పెద్దగా దృష్టి పెట్టకపోవడం వల్ల సున్నితమైన ప్రాంతాలకు వెళ్లి కూడా ఫొటోలు తీయగలిగాను. నాకు ఎవరూ అడ్డుపడలేదు. దీంతో అరుదైన ఫొటోలు తీసి ప్రచురింపజేయగలిగాను. ఆ ఫొటోలు ప్రచురితమైన తరువాతే ఆ పనిని నేను ఎంత సీరియస్‌గా చేస్తున్నానో ప్రజలు గుర్తించారు’ అని చెబుతుండేవారు హోమై వ్యరవాలా.మాయా జాలం!మన దేశంలోని ప్రముఖ మహిళా రాజకీయ కార్టూనిస్ట్‌లలో మాయా కామత్ ఒకరు. ఆంగ్ల సాహిత్యంలో పట్టా పొందిన మాయ చిన్నప్పటి నుంచి బొమ్మలు గీస్తూ ఉండేవారు. లిన్ జాన్స్టన్ పుస్తకం ‘ఫర్ బెటర్ ఆర్ ఫర్ వర్స్’ ప్రేరణతో కార్టూన్లు గీయడం ప్రారంభించారు కామత్. ఎన్నో ప్రధాన స్రవంతి వార్తాపత్రికలలో కార్టూనిస్ట్‌గా పనిచేశారు. ‘సక్సెస్ఫుల్ ఉమెన్ కార్టూనిస్ట్’ గా గుర్తింపు తెచ్చుకున్నారు.‘కర్ణిక కహెన్’ అనే కార్టూన్ క్యారెక్టర్‌ను సృష్టించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు కనికా మిశ్రా. దేశంలో జరిగే సంఘటనపై వ్యాఖ్యనించేలా ‘సామాన్య పురుషుడు’ కార్టూన్ క్యారెక్టర్లు ఎన్నో వచ్చాయి. దీనికి భిన్నంగా ‘కర్ణిక కహెన్’ను తీసుకువచ్చారు.సామాన్య మహిళలే సారథులువివిధ సామాజిక సమస్యలపై పోరాడుతూ పైకి ఎదిగిన మహిళ కవితా దేవి. బుందేల్‌ఖండ్ గ్రామీణ ప్రాంతానికి చెందిన కవిత ‘ఖబర్ లహరియా’ పత్రిక ఎడిటర్–ఇన్–చీఫ్‌గా దేశవ్యాప్తంగా ఎంతోమంది దృష్టిని ఆకర్షించారు. తనలాంటి భావాలు ఉన్న మహిళలతో కలిసి ‘ఖబర్ లహరియా’కు రూపకల్పన చేశారు. బుందేలీ, బజ్జికా, అవధిలాంటి హిందీలోని వివిధ గ్రామీణ మాండలికాలలో ఈ పత్రిక ప్రచురితమవుతుంది. బుందేల్‌ఖండ్‌లోని సామాన్య మహిళలే ఈ పత్రికకు రిపోర్టర్లు. సారథులు.పిచాయ్– ప్రింట్ రీడర్‘నాకు ఫిజికల్ పేపర్ చదవడం అంటేనే ఇష్టం’ అని చెబుతుంటారు సుందర్ పిచాయ్. సాంకేతిక దిగ్గజం ‘గూగుల్’కు సీయివో అయిన పిచాయ్ నోట ఆన్లైన్ కాకుండా ‘ఫిజికల్ న్యూస్ పేపర్’ అనే మాట వినిపించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ‘నేను ఓల్డ్ స్కూల్’ అని చెప్పకనే చె΄్పారు పిచాయ్. ఈ నేపథ్యంలో ఫిజికల్ న్యూస్‌పేపర్లు, పుస్తకాలు చదవడం వల్ల కలగే ఉపయోగాల గురించి సామాజిక మాధ్యమాలలో చర్చ నడిచింది. సమాచారాన్ని ఎక్కువ కాలం పాటు గుర్తించడానికి ఫిజికల్ ఫార్మట్ ఉపయోగపడుతుదనే చెబుతున్నారు విశ్లేషకులు. -
అది కొత్త సీసాలో పాత సారా
ఐఆర్ఎస్ 2014 సర్వేపై ఐదు పత్రికల ధ్వజం ఐఆర్ఎస్ - 2013ను 18 పత్రికలు ఖండించాయి ఆ సర్వే పూర్తిగా లోపభూయిష్టం, తప్పుల తడక అందులోని మూడొంతుల సమాచారాన్నే మళ్లీ వాడారు హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా సహా ఐదు పత్రికల ఖండన సాక్షి, హైదరాబాద్: భారతీయ పాఠకుల సంఖ్య సర్వే (ఐఆర్ఎస్) - 2014 పేరుతో ప్రకటించిన సర్వే ఫలితాలు.. కొత్త సీసాలో పాత సారా వంటివేనని ప లు జాతీయ పత్రికలు అభివర్ణించాయి. గతంలో 18 పత్రికలు ఏకగ్రీవంగా ఖండించిన ఐఆర్ఎస్ 2013 తరహాలో ఇది కూడా పూర్తిగా తప్పుదోవ పట్టించేదేనని.. టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, దైనిక్ జాగరణ్, దైనిక్ భాస్కర్, అమర్ ఉజాలా పత్రికలు గురువారం ఒక ప్రకటనలో విమర్శించాయి. ‘‘మూడు వంతులు పాత సారా పోసి.. ఒక వంతు కొత్త సారా పోసి.. దానినే సరికొత్త సారా సీసాగా ఇవ్వజూపటం పారదర్శకత అనిపించుకోదు. ఈ సర్వేలో మూడు వంతులు గతంలో తిరస్కరించిన ఐఆర్ఎస్ 2013 లోనిదే. మిగతా నాలుగో వంతు మాత్రమే కొత్తగా చేపట్టిన శాంపిల్’’ అని తప్పుపట్టాయి. ‘‘విచిత్రమేమిటంటే.. మా ఐదు పత్రికల పాఠకుల సంఖ్య గత ఐఆర్ఎస్ సర్వే కన్నా పెరిగినట్లు.. ఈ పెరుగుదల మా పోటీ పత్రికలకన్నా ఎక్కువగా ఉన్నట్లు చూపించారు. ఇది మేం గొప్పలు చెప్పుకోవటానికి ఉపకరిస్తుంది. కానీ.. సత్యం, నిష్పక్షపాతం విలువలకు కట్టుబడటం వల్ల మేం అలా చేయదలచుకోలేదు’’ అని స్పష్టంచేశాయి. గతంలో ఐఆర్ఎస్ 2013 తీవ్రమైన దోషంతో నిండివుందని, దిగ్భ్రాంతికరమైన లోపాలున్నాయని, దీనికి హేతుబద్ధత, కనీస పరిజ్ఞానం లేవని.. దేశంలోని 18 అగ్రస్థాయి వార్తాపత్రికల యాజమాన్యాలు ఏకగ్రీవంగా ఖండించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశాయి. ‘‘హిందూ బిజినెస్ లైన్ పత్రికకు.. చెన్నైలో ఉన్న పాఠకుల కన్నా మణిపూర్‌లో మూడు రెట్లు ఉన్నారని; 60 వేలకు పైగా అధీకృత సర్క్యులేషన్ గల నాగ్‌పూర్‌కు చెందిన అగ్రశ్రేణి వార్తాపత్రిక హితవాదకు ఒక్క పాఠకుడు కూడా లేరని; ఢిల్లీలో ఆంగ్ల పాఠకుల సంఖ్య 19.5 శాతం తగ్గిపోయారని చెప్పటం.. ఆ సర్వే ఇచ్చిన షాక్‌లలో కొన్ని. ఇవి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) లెక్కలతో కూడా పూర్తిగా విభేదించాయి’’ అని ఆ సర్వేలోని లోపాలను ప్రస్తావించాయి. ఆ సర్వేలోని మూడు వంతుల సమాచారాన్ని కొత్త సర్వేలో ఉపయోగించటం వల్ల.. అందులోని చాలా పొరపాట్లు కొత్త సర్వేలోనూ పునరావృతమవుతాయనేది విస్పష్టమని పేర్కొన్నాయి. ‘‘పైగా.. ‘తాజా నమూనా’ అని చెప్పుకుంటున్న ఈ సర్వే క్షేత్రస్థాయి పరిశీలనను 2014 జనవరి - ఫిబ్రవరి నెలల్లో చేపట్టారు. అంటే ఇప్పటికి ఏడాది కాలం దాటిపోయింది. అలాంటపుడు ఈ నివేదికకు ‘ఐఆర్ఎస్ 2014 తొలి త్రైమాసికం’ అని పేరు పెడితే సరిగ్గా ఉండేది. కానీ.. ఇందులో కాలం చెల్లిపోయిన సమాచారం ఉంటే.. ఆ ఏడాది మొత్తానికి సంబంధించిన తాజా సమాచారం అన్నట్లు ఐఆర్ఎస్ - 2014 అని చెప్తున్నారు’’ అని ఆయా పత్రికలు మండిపడ్డాయి. ఎంఆర్‌యూసీ వంటి గౌరవప్రదమైన సంస్థ.. ఇటువంటి పాచిపోయిన సమాచారాన్ని.. అందులో లోపాల గురించి తనకు పూర్తిగా తెలిసి కూడా ఇప్పుడు విడుదల చేయటానికి ఎటువంటి కారణాలేమిటనేది తమకు అవగతం కావట్లేదని విమర్శించా యి. దోషరహితమైన సర్వేను ఐఆర్ఎస్ తీసుకువచ్చేవరకూ.. వారి సర్వేలోని లోపాలను ఎత్తిచూపటాన్ని కొనసాగిస్తామని, వారు చెప్పే సంఖ్యలకు ఎటువంటి విశ్వసనీయతనూ కల్పించబోమని తేల్చిచెప్పాయి. 9.67% పెరిగిన సాక్షి’ పాఠకుల సంఖ్య ఐఆర్ఎస్ - 2014లో తెలుగు వార్తాపత్రికల పాఠకుల సంఖ్యను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే రెండు రాష్ట్రాలుగా చూపించినప్పటికీ.. ఈ అధ్యయనం కోసం ఏపీలో కొత్తగా ఏ నగరాలనూ, లేదా పట్టణాలనూ ఎంపిక చేయలేదు. ఐఆర్ఎస్ - 2013ను తీవ్రంగా లోపభూయిష్టంగా ఉందని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన వార్తాపత్రికలన్నీ కూడా ఖండించాయి. ఎందుకంటే.. ఒకవైపు రాష్ట్ర విభజన, మరొకవైపు ఎన్నికలతో మీడియా క్రియాశీలంగా ఉండగా.. ప్రధాన వార్తాపత్రికలన్నీ భారీ సంఖ్యలో పాఠకులను కోల్పోయినట్లు చూపటంలో హేతుబద్ధత లేదు. అయితే.. 2013 సర్వేతో పోలిస్తే ఐఆర్ఎస్ 2014లో ‘సాక్షి’ పాఠకుల సంఖ్య 9.67 శాతం పెరగటం విశేషం. 2013లో 33.68 లక్షలుగా ఉన్న పాఠకుల సంఖ్య 2014లో 36.94 లక్షలకు చేరిందని ఈ సర్వే చెప్తోంది. -
అళగిరి ఆఖరి పోరాటం
ఇప్పుడు అళగిరి ముందున్న మార్గం ఏమిటి? కాంగ్రెస్‌తో కలిసి దక్షిణ తమిళనాడులో కొన్ని పార్లమెంటు సీట్లు సాధించడమేనని జాతీయ పత్రికలు చెబుతున్నాయి. వాల్‌పోస్టర్లతో సినిమా బాగోగులు నిర్ణ యం కావు. కానీ అవి మంచి ప్రచారం తెచ్చి పెడతాయి. పోటాపోటీగా ఉండే మాస్ హీరోల విషయంలో ఇది మరింత నిజం. వెండితెర శైలిని ప్రతి అడుగులోను అనుసరిం చే ద్రవిడ పార్టీలకి ఇదంతా వెన్నతో పెట్టిన విద్య. ద్రవిడ మున్నేట్ర కజగం (డీ ఎంకే)లో తాజాగా మొదలైన వాల్‌పోస్టర్ల వివాదం ఈ సారి ప్రచారం స్థాయిని దాటి, విశ్లేషకులూ ఇతర పార్టీలూ కొత్త అంచనాలకు, ఆశలకు వచ్చేటట్టు చేసింది. డీఎంకే దళపతి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి పెద్ద కొడుకు ఎంకె అళగిరిని హీరోను చేసే ఉద్దేశంతో వెలిసిన ఈ పోస్టర్ల మీద పార్టీ నాయకత్వమే పిడకలు కొట్టించేసింది. ఈ సీరియస్ కామెడీ చివరికి ఎక్కడికి దారి తీస్తుందోనన్నది పెద్ద ప్రశ్న. దక్షిణ తమిళనాడులోని మధురై నగరంలో జనవరి నాలుగున హఠాత్తుగా ఆ పోస్టర్లు గోడల నిండా వెలిశాయి. భారీ సిని మా పోస్టరుకు ఏమీ తగ్గకుండా రంగులతో, వృద్ధనేత కరుణానిధి, వారసత్వ పోరులో తలమునకలై ఉన్న ఆయన ఇద్దరు కొడుకులు అళగిరి, స్టాలిన్, ఇతర పెద్దల ముఖాలన్నీ ఆ పోస్టర్లో ఉన్నాయి. కానీ అవి ఇచ్చిన సమాచారం అధిష్టానం పాలిట పుండు మీది కారమైంది. ‘జనవరి 30న చెన్నై నగరంలోని కలైంజర్ అరంగంలో డీఎంకే సర్వ సభ్య సమావేశం జరుగుతుంది’ అని ఆ రాతల అర్థం. జనవరి 30 అళగిరి పుట్టినరోజు. దీనికి ‘ఇని ఒరు విధి సీవొమ్’ అని శీర్షిక కూడా పెట్టారు. దీనర్థం, మనం లక్ష్యాన్ని నిర్దేశిస్తాం. ఇది మహాకవి సుబ్రహ్మణ్య భారతి కవితలలో ఓ పంక్తి. సినిమా పోస్టర్లు వేర్వేరు నిశ్చల చిత్రాలతో దర్శనమిచ్చినట్టు, ఈ పోస్టర్లను రకరకాలుగా ముద్రించారు. అళగిరి వీరాభిమానులు ముగ్గురి పేర్లు కింద కనిపిస్తున్నా యి. పార్లమెంటు ఎన్నికలకు ముందు ఇలాంటి ‘తుంటరి పోస్టర్లు’ ఏమిటని కరుణానిధి ఇచ్చిన ప్రకటన పార్టీ పత్రిక ‘మురసోలి’లో మరునాడే కనిపించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జాతీయ పత్రికలలో, తమిళనాడు పత్రికలలో వస్తున్న వార్తలూ విశ్లేషణలను బట్టి, ఇది పార్టీతో అళగిరి చేస్తున్న ఆఖరి పోరాటం. మధురై కేంద్రంగా దక్షిణ తమిళనాడు పార్టీ వ్యవహారాలను అళగిరి చూస్తుంటారు. చెన్నై కేంద్రంగా స్టాలిన్ మిగిలిన భాగాన్ని అదుపు చేస్తూ ఉంటారు. డీఎంకే ద్రవిడ సిద్ధాంతాలతో ఆవిర్భవించి ఉండవచ్చు. బ్రాహ్మణాధిపత్యం మీద, వైదిక సంప్రదాయాల మీద తిరుగుబాటే ఊపిరిగా మనుగడ సాగిస్తూ ఉం డొచ్చు. కానీ రాజకీయాల దగ్గర మాత్రం మధ్యయుగం పోకడలకు, అది ఎంతో ద్వేషిం చే కాంగ్రెస్‌కు ఏ మాత్రం అతీతం కాదని ఎప్పుడో రుజువు చేసుకుంది. కరుణానిధికి ఇప్పుడు 90 ఏళ్లు. ఆయన వారసత్వం గురిం చి పోరాటం తీవ్రం కావడం అనూహ్యమేమీ కాదు. నిజానికి ఇది ఏడేళ్ల క్రితమే ప్రారంభమైంది. డీఎంకేలో స్టాలిన్ అంత్యంత ప్రజాకర్షణ గల నాయకుడంటూ 2007 సంవత్సరంలో ‘దినకరన్’ పత్రిక ప్రచురించిన కథనం తుపాను సృష్టించింది. మధురైలో ఆ పత్రిక ప్రతులను అళగిరి వర్గీయులు తగులబెట్టారు. పత్రిక కార్యాలయం మీద దాడికి దిగారు. ఈ అల్లర్లను అదుపు చేయడానికి జరిపిన కాల్పులలో ముగ్గురు చనిపోయారు కూడా. అప్పు డు కొడుకులిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి కరుణానిధి తన వంతు ప్రయత్నం చేశారు. అవేమీ ఫలితాలను ఇవ్వలేదనే అనిపిస్తుంది. తాజా వాల్‌పోస్టర్ల వివాదం, తరువాత జరిగిన పరిణామాలు ఇదే చెబుతున్నాయి. పోస్టర్లు ముద్రించిన ముగ్గురిని పార్టీ బహిష్కరించింది. వారు తన వర్గం వారు కాదని అళగిరి వెంటనే ప్రకటన చేశారు. ఆ వెంటనే మధురై శాఖను రద్దు చేసి తాత్కాలిక నిర్వాహక కమిటీని స్టాలిన్ ఏర్పాటు చేశారు. దీన్నిండా స్టాలిన్ వర్గీయులే. స్టాలిన్ చర్యను ఖండిస్తూనే, తనను పార్టీలో ఏకాకిని చేసే కుట్ర ఇప్పటిది కాదనీ, అయినా తాను విమర్శలకు దిగడం లేదనీ అళగిరి చెప్పారు. అక్కడితో ఆగక, తాను ఒక్క కరుణానిధి నాయకత్వాన్ని మినహా మరెవ్వరి నాయకత్వాన్ని ఆమోదించే ప్రశ్నే లేదంటూ స్టాలిన్ నాయకత్వానికి అళగిరి నేరుగానే సవాలు విసిరారు. జయలలితతో విభేదాలు పెంచుకున్న దేశీయ మరుపోక్కు ద్రవిడ కజగం (డీఎండీకె)తో రేపటి పార్లమెంట్ ఎన్నికలలో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నట్టు సాక్షాత్తు కరుణానిధి చేసిన ప్రకటనను కూడా అళగిరి ఎద్దేవా చేశారు. డీఎండీకే నేత, సినీనటుడు విజయ్‌కాంత్ డీఎండీకే అధినాయకుడు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆయనే. డీఎంకే మూడో స్థానంలో ఉంది. అయితే విజయ్‌కాంత్‌ను తాను రాజకీయవేత్తగానే పరిగణించనని అళగిరి ప్రకటించి, తండ్రి ఆగ్రహాన్ని చవి చూశా రు. క్రమశిక్షణ తప్పిన వారు ఎవరినైనా పార్టీ నుంచి పంపే అధికారం తమకు ఉందని వృద్ధనేత మండిపడ్డారు. ఈ పరిణామాలన్నీ జనవరి నాలుగున మొదలై నాలుగు రోజులలోనే వేగంగా జరిగిపోవడం విశేషం. ఇప్పుడు అళగిరి ముందున్న మార్గం ఏమిటి? కాంగ్రెస్‌తో కలిసి దక్షిణ తమిళనాడులో కొన్ని పార్లమెంటు సీట్లు సాధించడమేనని జాతీయ పత్రికలు చెబుతున్నాయి. తమిళనాడులో ఒక ఆధారం కోసం పడిగాపులు పడి ఉన్న కాంగ్రెస్ ఇందుకు ఎలాగూ సై అం టుంది. డీఎంకేకు బద్ధశత్రువైన జయకు ఈ ‘మధురై బలాఢ్యుడు’ స్నేహహస్తం చాపే అవ కాశాలు కూడా ఉన్నాయని మరొక వాదన. స్టాలిన్‌ను ఎదుర్కొనడానికీ, ఇప్పటికే రకరకాల కేసులతో జైళ్లలో మగ్గుతున్న తన అనుచరులకు ఊరట కల్పించడానికీ ఇది అళగిరికి ఉపయోగపడుతుందని అంచనా. ఏమైనా మధురై పోస్టర్లు ఒక బాక్సాఫీసు హిట్‌నే దేశం ముందుకు తేబోతున్నాయని అనుకోవచ్చు. - కల్హణ


