breaking news
Narra Sivanagu
-
2 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపణలు.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు
ఆడియో ఫంక్షన్‌కు రావాలని పిలిస్తే రూ.2 లక్షలు డిమాండ్ చేశాడంటూ సీనియర్ హీరో సుమన్‌పై దర్శకుడు శివనాగు సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే! తాజాగా అతడు ఈ వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు. ‘నటరత్నాలు’ చిత్రం ఆడియో ఫంక్షన్ వేదికగా సుమన్‌పై చేసిన వ్యాఖ్యలకు శివనాగు క్షమాపణ తెలిపారు. దీనిపై అసలేం జరిగిందో క్లారిటీ ఇస్తూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో శివనాగు మాట్లాడుతూ ‘‘సుమన్‌గారు నా కుటుంబానికి ఎంతో కావాల్సిన వ్యక్తి. ఆయనతో మూడు సినిమాలు చేశాను. నా పిల్లలు ఇద్దరు నిర్మిస్తున్న ‘నట రత్నాలు’ చిత్రం ఆడియో ఫంక్షన్‌కు ఆయన్ని ఆహ్వానించి, సన్మానించాలనుకున్నాను. ఆయన్ను పిలిచే క్రమంలో మేకప్‌మెన్ వెంకట్రావు చెప్పడం సమస్యో, నేను వినడం పొరపాటో తెలీదు కానీ ఫంక్షన్ టెన్షన్లో ఉండి సుమన్‌గారిపై ఆరోపణలు చేశాను. దీనిపై చాలామంది నిర్మాతలు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. అప్పుడు గానీ నేను పొరపాటు మాట్లాడానని గమనించలేదు. మీడియా ముఖంగా సుమన్‌గారికి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నా’’ అని అన్నారు. చదవండి: 48 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న కమెడియన్ -
రెండు లక్షలు డిమాండ్ చేశాడు.. సీనియర్ హీరో సుమన్‌పై శివనాగు ఫైర్!
సీనియర్ హీరో సుమన్‌పై దర్శకుడు శివనాగు ఫైర్ అయ్యాడు. సినిమా ఆడియో ఫంక్షన్‌కి రావాలని ఆహ్వానిస్తే..రూ.2 లక్షలు ఇస్తేనే వస్తానని చెప్పారని, ఓ సీనియర్ హీరో అలా చెప్పడం బాధాకరం అన్నారు. సుదర్శన్, రంగస్థలం మహేశ్, తాగుబోతు రమేశ్ కీలక పాత్రధారులుగా నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నట రత్నాలు’. ఇనయా సుల్తాన కథానాయిక. మర్డర్ మిస్టరీ క్రైం థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డా.దివ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు. (చదవండి: నిర్మాతపై లైంగిక వేధింపుల కేసు.. స్టేట్మెంట్లో సంచలన విషయాలు!) ఈ సందర్భంగా దర్శకుడు శివనాగు మాట్లాడుతూ.. . ఈ మధ్యకాలంలో చిన్న సినిమా ఫంక్షన్లకు ఎవరూ సహకరించట్లేదు. నేను గతంలో మూడు సినిమాలు తీసిన ఓ హీరోని ఈ వేడుకకు ఆహ్వానించా. ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే అసిస్టెంట్‌తో మాట్లాడమని చెప్పారు. పది రోజులు సాగదీసి ఆయన మేకప్‌మెన్ ఫోన్ ఎత్తి ‘శివనాగు గారు రెండు లక్షలు ఇస్తే ఆడియో ఫంక్షన్‌కి వస్తారట అండీ’ అని చెప్పాడు. అంటే ఆడియో రిలీజ్ చేయాలంటే రెండు లక్షలు ఇవ్వాలా? డబ్బిచ్చి పొగడాలా? ఆ నటుడు ఎవరో కాదు. సీనియర్ నటుడు సుమన్. ఏ హీరోనైనా దర్శకుడే తయారు చేస్తారు. సుమన్‌గారి తీరు చూశాక నా బాధ కలిగింది. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో పరిశ్రమ ఉంది’ అని మండిపడ్డారు. ‘చిన్న సినిమాతోనే పరిశ్రమ మనుగడ ఉంది. ప్రస్తుతం మినిమమ్ బడ్జెట్ చిత్రాలు ఇండస్ట్రీకి నాలుగో స్తంభంగా నిలుస్తున్నాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని చికోటి ప్రవీణ్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఎరపతినేని శ్రీనివాసరావు , దివ్యవాణి, డా. పద్మ తదితరులు పాల్గొన్నారు.