breaking news
munikoti family
-
మునికోటి ఫ్యామిలీని ఆదుకోవడంలో విఫలమైన సర్కార్
-
ఆత్మార్పణ చేసిన మునికోటి ఫ్యామిలీకి హామీ
సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగం చేసిన మునికోటి కుటుంబానికి వారం రోజుల్లో న్యాయం చేస్తామని చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న హామీ ఇచ్చారు. 2015 ఆగస్టు 9న, ప్రత్యేక హోదా ఉద్యమం తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో తిరుపతికి చెందిన మునికోటి ఏపీ ప్రత్యేక హోదాకోసం బలిదానానికి సిద్ధపడ్డాడు. ఒంటికి నిప్పంటించుకొని ఆత్మత్యాగం చేశాడు. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం తరపున అప్పటి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్పందించారు. మృతుని కుటుంబానికి రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించించారు. అయితే ఈ హామీ కూడా ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల్లాగే మరుగున పడిపోయింది. మునికోటి కుటుంబాన్ని ఆదుకోవాలన్న సంగతే మర్చిపోయారు. అయితే ఏళ్లు గడిచినా మునికోటి కుటుంబానికి పరిహారం అందకపోవడంపై సాక్షి మీడియా వరుస కథనాలు ప్రచురించింది. వీటిపై స్పందించిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, మునికోటి కుటుంబానికి తగిన న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్‌ను కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వారం రోజుల్లో మృతుడి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని, వారం రోజుల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
జగన్ దీక్షకు మునుకోటి కుటుంబం మద్దతు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ తిరుపతిలో ఆత్మాహుతి చేసుకున్న మునుకోటి కుటుంబసభ్యులు.. ఇప్పుడు అదే డిమాండుతో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తమ మద్దతు తెలిపారు. మునుకోటి ఆత్మహత్యపై ఇంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన పాపాన పోలేదని వాళ్లు అన్నారు. కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే తమను పరామర్శించారన్నారు. జగన్ దీక్షకు తాము పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని తెలిపారు.