breaking news
MLA chandravathi
-
ఎమ్మెల్యే చంద్రావతిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఖమ్మం : ఖమ్మం జిల్లా వైరా సీపీఐ ఎమ్మెల్యే చంద్రావతిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెలలో అధికారుల తీరుకు నిరసనగా ఏన్కూరులో ఓ రాస్తారోకో కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆ సందర్భంగా చంద్రావతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈసారి ఎన్నికల్లో వైరా నియోజకవర్గం నుంచి చంద్రావతికి సీపీఐ టికెట్ నిరాకరించటంతో ఆమె తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు సమాచారం. -
'చంద్రావతి మరోసారి ఆలోచించుకోవాలి'
హైదరాబాద్ : సీపీఐ ఎమ్మెల్యే చంద్రావతి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. చంద్రావతి తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని, మరోసారి ఆలోచించుకోవాలని ఆయన బుధవారమిక్కడ సూచించారు. ఎమ్మెల్యేగా చంద్రావతికి ఒకసారి అవకాశం ఇచ్చామని, పార్టీలో పనిచేసేవారిని ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని నారాయణ అన్నారు. ఆమె పనితీరు సంతృప్తికరంగా లేదని ఆయన తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్తో పొత్తు కుదుర్చుకున్నామని నారాయణ అన్నారు. అలాగే లోక్‌సత్తాలో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. కాగా వైరా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీపీఐ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇచ్చేందుకు పార్టీ నిరాకరించడం వల్లే ఎర్రజెండాను విడిచిపెట్టాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఆమె సన్నాహాలు చేసుకుంటున్నారని అక్కడి పార్టీ వర్గాలు అంటున్నాయి.