breaking news
mla chandra sekhar
-
‘ఎమ్మెల్యేలుగా గర్వంగా తిరగ్గలుగుతున్నాం’
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఆరు నెలల పాలనపై ఆయన స్పందిస్తూ.. ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సమస్యలను ఆరు నెలల్లో తీర్చారు. లక్షా నలభై వేల మందికి శాశ్వత ఉద్యోగాలిచ్చారు. నాలుగు లక్షల వాలంటీర్ల ఉద్యోగాలతో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారు. మత్స్యకార భరోసాతో గంగపుత్రుల కష్టాలు తీరనున్నాయి. వీక్లీ ఆఫ్ అమలుతో పోలీసు కుటుంబాల్లో ఆనందం నింపారని ఎమ్మెల్యే ద్వారంపూడి వెల్లడించారు. మరోవైపు ఇదే అంశంపై పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ.. అరవై ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రిలా సీఎం జగన్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని పేర్కొన్నారు. ఆరు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలిచ్చిన ఘనత జగన్మోహన్రెడ్డిదని కొనియాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో మాదిగానే సీఎం జగన్ పాలనలో ప్రకృతి సహకరించిందని పోల్చి చెప్పారు. ఆరు నెలల్లో 80 శాతం హామీలను నెరవేర్చిన వైఎస్ జగన్ పాలన చూసి ప్రతిపక్షాలే ముక్కున వేలేసుకుంటున్నాయని ప్రశంసించారు. జగన్ గారి విధివిధానాల వల్ల ఎమ్మెల్యేలుగా ప్రజల్లో సగర్వంగా తిరగగలుగుతున్నామని వెల్లడించారు. రాజకీయ అవగాహన లేకుండా చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టునే పవన్‌కల్యాణ్ చదువుతున్నారని దొరబాబు విమర్శించారు. -
నాయకుడే హంతకుడైతే..
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: నాయకుడే హంతకుడైతే ఇక ప్రజలకు రక్షణ క ల్పించాల్సిందెవరు? తనసొంత నియోజకవర్గ ప్రజ లకు అండగా ఉంటూ న్యాయ అన్యాయాలపై అధికారులను ప్రశ్నించాల్సింది పోయి తానుచేసిన పొరపాటుకు టీడీపీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే చంద్రశేఖర్ అలియాస్ ఎర్ర శేఖర్ ఓ ప్రజాప్రతినిధిగా పోలీ సుల ఎదుట ఇలా నిందితుడిగా చేతులు కట్టుకుని నిల్చున్నాడు. సరిగ్గా 42 రోజుల క్రితం దేవరకద్ర మండలకేంద్రంలో జరిగిన జగన్మోహన్ హత్యకేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ధన్వాడ మండలం పెద్ద చింతకుంట గ్రామ సర్పంచ్ సీటుపై తన భార్య భవానీని ఏదో ఒక విధంగా కూర్చోబెట్టాల నే అత్యాశే అతని కొంపముంచింది. భవానీకి పోటీగా సొంత సోదరుడు జగన్మోహన్ భార్య అశ్రీతను రం గంలో ఉండటాన్ని ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ జీర్ణించుకోలేకపోయాడు. పోటీనుంచి తప్పుకుంటే రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో అవకాశం ఇస్తానని సర్పంచ్ పదవి కోసం పోటీకి రావద్దని ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు పలుమార్లు వేడుకున్నా జగన్మోహన్ ససేమిరా అన్నట్లు తెలిసింది. దీంతో వారిద్దరి మధ్య మాటామాట పెరగడంతో ఎమ్మెల్యేకు చెందిన లైసైన్స్‌డ్ పిస్తోల్‌తో మూడురౌండ్ల కాల్పులు జరపడం వల్లే జగన్మోహన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడని ఎస్పీ డి.నాగేంద్రకుమార్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడి ంచారు. ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్యే అనుచరుడిగా ఉన్న పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన టి.తిమ్మన్న, ఎమ్మెల్యే సోదరుడు జగన్మోహన్కు కూడా సన్నిహితంగా కూడా ఉండేవాడని, అందులో భాగంగానే అన్నదమ్ముల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలను రాజీకుదిర్చే ప్రయత్నం చేసినా ఫలితం లేక పోవడంతో హత్యచేశారని ఎస్పీ వివరించారు. హత్యానంతరం ఎమ్మెల్యే బెంగళూరు, మైసూర్, షిర్డీ తదితర ప్రాంతాల్లో తల దాచుకున్నట్లు తెలిపారు. కేసులో తొమ్మిది మంది నిందితులు ఉండగా ప్రస్తుతం ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌తో పాటు తుమ్మల తిమ్మన్న, తుమ్మల రాములు, కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే డ్రైవర్ బి.రమేష్ బాబు లొంగిపోయినట్లు ఎస్పీ వెల్లడించారు. జూలై 17న హత్య జరిగిన రోజు నుంచి ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబసభ్యులంతా అజ్ఞాతంలోకి వెళ్లారు. ముందస్తు బెయిల్ కోసం జిల్లా కోర్టులో, ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తిరస్కరించారు. ఇలా తప్పని పరిస్థితుల్లో ఆయన పోలీసుల ఎదుట లొంగిపోవాల్సి వచ్చింది.