breaking news
misconception
-
సీజేరియన్ తర్వాత బరువు పెరుగుతారా..?
సాధారణంగా సిజేరియన్ తర్వాత మహిళలు బరువు పెరుగుతారనే అ΄ోహ చాలామందిలో ఉంటుంది. సిజేరియన్ తర్వాత కొందరు కాస్తంత బరువు పెరిగినప్పటికీ అందుకు కారణం సిజేరియన్ మాత్రం కాదు. దేహానికి తగినంత శారీరక శ్రమలేక΄ోవడం వల్ల లేదా మరికొన్ని వేర్వేరు అంశాల వల్ల అలా జరిగినప్పుడు దాన్ని సిజేరియన్‌కు ఆపాదించడం జరుగుతుంది. బరువు పెరగకుండా ఉండేందుకు సిజేరియన్ అయిన పదిహేను రోజుల తర్వాత నుంచే నడక లేదా శరీరంపై భారం పడకుండా తేలిక΄ాటి వ్యాయామాలు మొదలుపెట్టవచ్చు. అయితే ఏవైనా ఇతరత్రా కారణాలతో కొందరు మహిళలను డాక్టర్లు ప్రత్యేకంగా విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వారు తప్ప అందరూ తమకు తగిన వ్యాయామాలను చేయవచ్చు. బరువు పెరగకుండా ఉండేందుకు సూచనలు:చిన్నారులకు తల్లి΄ాలు పట్టించడం వల్ల మహిళలు బరువు పెరగకుండా ఉంటారు. దీనివల్ల తల్లికీ, బిడ్డకూ ఇరువురికీ లాభమే. నడక వ్యాయామం అందరికీ ప్రయోజనకరం. మహిళలు నడక మొదలుపెట్టినప్పుడు రోజుకు కేవలం పది నిమిషాలు మాత్రమే నడుస్తూ కాలవ్యవధిని క్రమంగా పెంచుకుంటూ ΄ోవాలి. ఇలా చేస్తూపోతే మూడు నెలల నుంచి మహిళలు తమ అదనపు కొవ్వు కోల్పోతారు. ΄÷ట్ట కూడా మామూలు స్థితికి వచ్చి సెంట్రల్ ఒబేసిటీ కూడా తగ్గుతుంది. (చదవండి: బాలీవుడ్ నటి అనుష్క శర్మ మోనోట్రోఫిక్ డైట్: నిపుణులు ఏమంటున్నారంటే..!) -
ఎవరెస్ట్‌పై మన లెక్క తప్పు
లండన్: ప్రపంచంలోకెల్లా ఎతై్తనది ఎవరెస్ట్ పర్వతమని, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతోందని, చంద్రుడికి ఆవలివైపు చీకటి ఉంటుందని, చంద్రుడి పైనుంచి చైనా వాల్ కనిపిస్తుందని, పొద్దు తిరిగుడు పూవు సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరుగుతుందని, ఊసరవెల్లి పరిసరాలకు అనుగుణంగా రంగులు మారుస్తుందని, గబ్బిలాలకు కళ్లుండవని....ఎవరు చెప్పినా నమ్మేస్తాం. కాదంటే కసురుకుంటాం. కానీ ఇవన్నీ మన భ్రమలని, మన ముందువాళ్లు చెబుతూ వచ్చిన మాటలను గుడ్డిగా నమ్మడం వల్ల మనలోనూ ఇలాంటి అభిప్రాయాలు బలంగా నాటుకుపోయాయని ‘బిలీఫ్ ఇట్ ఆర్ నాట్’ కాలం కింద ‘రిప్లీస్ డాట్ కామ్’ వీటన్నింటిని శాస్త్రీయంగా విశ్లేషించింది. ఎవరెస్ట్ పర్వతం: ప్రపంచంలోకెల్లా ఎతై్తన పర్వతం ఎవరెస్ట్ అని అధికారికంగా ప్రపంచమే గుర్తించింది. అయితే సాంకేతికంగా పరిశీలిస్తే దానికన్నా అమెరికా హవాయి దీవిలోని మౌనా కియా పర్వతమే ఎతై్తనదని జియాలజిస్టులే నిరూపించారు. సముద్ర మట్టంతో పోలిస్తే ఎవరెస్ట్ పర్వతం 8,850 మీటర్లు ఉంటుంది. బేస్‌ను ప్రామాణికంగా తీసుకుంటే మౌనా కియా పర్వతం ఎత్తు 13,796 మీటర్లు. దీని బేస్ సముద్ర జలాల్లోకి చొచ్చుకుపోయి ఉంటుంది. ఊసరవెల్లి: ఉష్ణోగ్రత, కమ్యూనికేషన్, వెలుతురు, మూడ్స్ కారణంగానే ఊసరవెల్లి రంగులు మారుస్తుంది. పరిసరాలతో సంబంధం లేదు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా : చంద్రుడి పైనుంచి చైనా గోడ కనిపించదని, భూమే తెల్లటి, నీలి రంగు మార్బుల్స్లా కనిపిస్తుందని అపోలో వ్యోమగాములు ధ్రువీకరించారు. చంద్రుడికి ఆవల చీకటి: చంద్రడుకి ఆవల చీకటి ఉండదు. భూమిలాగే అది తన అక్షంలో తిరుగుతుంది. భూమిలాగానే దానికి అన్ని ప్రాంతాల్లో పగలు, రాత్రిగా వుంటింది. సూర్యుడి చుట్టూ భూమి: సాంకేతికంగా ఆలోచిస్తే సూర్యుడి చుట్టూ భూమి తిరగదు. మొత్తం సౌర కుటుంబమే అంతరిక్ష ద్రవ్యరాశిలో తన అక్షంలో తిరుగుతుంది కనుక మనకు సూర్యుడు చుట్టూ తిరుగుతున్న భ్రమ కలుగుతుంది. బైబిల్లో ఆపిల్: ఈడెన్ గార్డెన్లో నిషేధిత ఫలం ఆపిల్ అని బైబిల్ ఎక్కడా పేర్కొనలేదు. తినకూడదని హెచ్చరించిన ఫలం అని మాత్రమే ఉంటుంది. ఫలం అంటే ఫలం కాదని, మంచి చెడుల విశ్లేషణకు ప్రతీకగా మాత్రమే ఫలం అన్నారనే వాదనలు కూడా ఉన్నాయి. పొద్దు తిరుగుడు పూవు: సూర్య భ్రమణంబట్టి పొద్దు తిరుగుడు పూవు తిరగదు. మొగ్గ దశలో మాత్రమే అది సూర్యుడి వైపు నిలుస్తుంది. పూవు వికసించాక పొద్దుతో సంబంధం లేకుండా ఒకే దిక్కులో ఉంటుంది. గబ్బిలాలకు కళ్లు: గబ్బిలాలకు చిన్ని కళ్లు ఉంటాయి. చీకటిలో అవి ప్రకంపనల ఆధారంగా సంచరిస్తాయి కనుక వాటికి కళ్లు ఉండవని భావిస్తూ వచ్చారు. బుల్‌ఫైట్: ఎర్ర గుడ్డలను చూస్తే దున్నపోతులు రెచ్చిపోతాయన్నది కూడా అబద్ధం. ఎందుకంటే తెలుపు, నీలి రంగులు మినహా మిగతా రంగులను గుర్తించే శక్తి వాటికి లేవు. బుల్ ఫైట్ సందర్భంగా చుట్టూ జనంచేసే కోలాహలం, ఎదురుగా ఓ మనిషి రెచ్చగొడుతుండడం వల్ల అవి చిర్రెత్తుకొచ్చి అలా రెచ్చిపోయి ప్రవర్తిస్తాయట. టమోట: అంటే కూరగాయనుకుంటాం. కానీ ఇది పండు జాతికి చెందింది. మెదడు: మెదడులో మనం కేవలం పది శాతాన్ని మాత్రమే ఉపయోగిస్తాం అని చెబుతారు చాలామంది. ఇది కూడా తప్పే. మెదడులోని అన్ని భాగాలను పనిచేయిస్తాం. అలా జరగకపోతే శరీరంలోని ఏదో భాగం పని చేయకుండా పోతుంది. మెదడును మనం ఎలా ఉపయోగిస్తామన్న అంశాన్నిబట్టి మనిషి తెలివితేటలు ఆధారపడి ఉంటాయి.