breaking news
mind signals
-
పక్షవాతం వచ్చినా మళ్లీ నడవొచ్చు..
పారిస్: ఒక్కసారి పక్షవాతం వచ్చి కాళ్లు, చేతులు పడిపోతే.. ఇక అంతే సంగతులు. ఆ మనిషి మంచానికే పరిమితం అయిపోతారు. ఇవీ ఇప్పటివరకు పక్షవాతంపై ఉన్న ఆలోచనలు. కానీ ఇకపై ఈ లెక్క మారిపోనుంది. పక్షవాతం వచ్చినా కూడా లేచి నిలబడే అవకాశం ఉంది. ఇది ఫ్రాన్స్ వాసి విషయంలో నిజమైంది. మన మెదడు నియంత్రించేలా శరీరం బయట అస్తిపంజరాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఇది సాధ్యమైంది. టెలీప్లెజిక్స్ అని పిలిచే ఈ సాంకేతికతకు ఊతమిచ్చినట్లు అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భవనంపై నుంచి కింద పడటంతో వెన్నెముక పూర్తిగా దెబ్బతిని 28 ఏళ్ల థిబాల్ట్‌కు భుజం నుంచి కింది భాగం మొత్తం పక్షవాతం వచ్చింది. దీంతో టెలీప్లెజిక్స్ సాంకేతికత సాయంతో అతడికి కొత్త జీవితాన్ని డాక్టర్లు ప్రసాదించారు. దీంతో తిరిగి చక్కగా నడుస్తున్నాడు. ఈ సాంకేతికతలో కంప్యూటర్ ద్వారా మెదడు నుంచి సిగ్నల్స్.. శరీరం బయట ఉన్న అస్తిపంజరాన్ని నియంత్రిస్తారు. కొన్ని నెలల పాటు ఈ అస్తిపంజరంతో శిక్షణ అందించడంతో ఇప్పుడు చక్కగా నడుస్తున్నాడు. గ్రెనోబెల్ అల్పస్ ఆస్పత్రి నిపుణుల బృందం, సినాటెక్ పరిశోధకులు ఈ విజయం సంధించారు. -
ఇది మైండ్ కంట్రోల్డ్ కారు
రిమోట్ కంట్రోల్ కార్లను చూశాం. డ్రైవర్ లేని కార్ల గురించి విన్నాం. అయితే కారు సీట్లో కూర్చుని మనం చేసే సూచనలకనుగుణంగా నడిచే కారును గురించి ఎప్పుడైనా విన్నారా? అద్భుతంగా ఉంది కదూ.. ఈ నూతన సాంకేతికత. చైనాకు చెందిన కొందరు విద్యార్థులు ఈ రకమైన కారును తయారుచేశారు. చైనాలోని నాన్కాయ్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థుల బృందం మైండ్‌తో నియంత్రించే ఈ నూతన కారును రూపొందించింది. మెదడు సంకేతాల ద్వారా ఈ కారును నియంత్రించవచ్చు. అందుకోసం ఎలక్ట్రో ఎన్సిఫలో గ్రాఫ్ అక్విసిషన్ పరికరాన్ని తలకు ధరించాలి. ఈ పరికం ద్వారా మెదడు సంకేతాలు కంప్యూటర్ను చేరుతాయి. ఈ తరంగాలు కారును నియంత్రించేందుకు తోడ్పడుతాయి. ప్రస్తుతం ఈ కారును పరీక్షలో భాగంగా యూనివర్సిటీలో ఉంచారు. త్వరలోనే పూర్తిస్థాయిలో మార్కెట్లోకి విడుదల చేస్తామని విద్యార్థుల బృందం తెలిపింది.