breaking news
mim mlas
-
రెండో రోజు ఎంఐఎం గైర్హాజరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమావేశాల రెండో రోజు మంగళవారం దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన చర్చలో ‘భారతరత్న’ఇవ్వాలనే తీర్మానాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతిపాదించారు. తీర్మానాన్ని బలపరుస్తూ పలువురు మంత్రులతో పాటు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 12 మంది సభ్యులు ప్రసంగించారు. ఏఐఎంఐఎం సభ్యులు తీర్మానంపై చర్చ సందర్భంగా సభకు గైర్హాజరయ్యారు. రెండో రోజు సమావేశంలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ప్రస్తావన లేకుండా పీవీకి భారతరత్న ఇవ్వాలనే తీర్మానానికే సభా వ్యవహారాలు పరిమితమయ్యాయి. సుమారు రెండు గంటలపాటు సాగిన అసెంబ్లీని బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించి నలుగురు సభ్యులను ప్యానెల్ చైర్మన్లుగా నామినేట్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. టీఆర్ఎస్ శాసనసభ్యులు హన్మంతు షిండే (జుక్కల్), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం), డీఎస్ రెడ్యానాయక్ (డోర్నకల్), ఏఐఎంఐఎం శాసనసభ్యుడు మహ్మద్ మౌజంఖాన్ (బహదూర్‌పురా) ఈ జాబితాలో ఉన్నారు. కాగా, బుధవారం ఉదయం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ అనంతరం కరోనాపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. బీఏసీ సమావేశంలో కరోనాపై చర్చించేందుకు అధికార, విపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చిన విషయం తెలిసిందే. కరోనాపై జరిగే చర్చలో ముఖ్యమంత్రి సమాధానం అనంతరం.. రెవెన్యూ చట్టాన్ని సభలో ప్రవేశపెడతారు. అనంతరం సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. రెండు రోజులు రెవెన్యూ చట్టంపై చర్చ జరగనుంది. -
కోర్టుకు హాజరైన ఎమ్మెల్యేలు
మెదక్(సంగారెడ్డి): ఎంఐఎం ఎమ్మెల్యేలు బుధవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలోని జిల్లా కోర్టుకు హాజరయ్యారు. పటాన్చెరు మండలం ముత్తంగి వద్ద అప్పట్లో మజీద్ తొలగింపు విషయంలో అప్పటి కలెక్టర్ ఏకే సింఘాల్‌ను దూషించిన కేసులో ఎంఐఎం నేతలు అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్‌పాషా ఖాద్రీ, ముంతాజ్‌ఖాన్‌లు నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మెజిస్ట్రేట్ వెంకట్రాం ఎదుట వీరు హాజరయ్యారు. మెజిస్ట్రేట్ ఈ కేసును ఈనెల 24కు వాయిదా వేశారు. ఎంఐఎం నేతలు వస్తున్నారని తెలుసుకున్న ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కోర్టు ఆవరణకు చేరుకున్నారు. -
సంగారెడ్డి కోర్టుకు ఒవైసీ సోదరులు
సంగారెడ్డి(మెదక్‌జిల్లా) : మెదక్ జిల్లా సంగారెడ్డి కోర్టుకు ఒవైసీ సోదరులు వచ్చారు. పటాన్చెరు మండలం ముత్తంగి వద్ద జాతీయరహదారి పక్కన ఉన్న మసీదును తొలగించే క్రమంలో అప్పటి కలెక్టర్ అనిల్‌కుమార్ సింఘాల్‌ను దూషించిన కేసుకు సంబంధించి ఎంఐఎం నేతలు జిల్లా కోర్టుకు వచ్చారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్ పాషా ఖాద్రి, ముంతాజ్‌ఖాన్, మొజంఖాన్‌లు గురువారం ఎక్సైజ్ కోర్టు మేజిస్ట్రేట్ ఎన్.వెంకట్రామ్ ఎదుట హాజరయ్యారు. కేసు విచారణను మేజిస్ట్రేట్ వచ్చే నెల ఫిబ్రవరి 3కి వాయిదా వేసినట్లు ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది నిజామొద్దీన్ తెలిపారు.