breaking news
mental disturbance
-
టార్చర్ అనుభవించా!
డకోటా జాన్సన్. ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ ఫిల్మ్ సిరీస్ పేరు చెప్పగానే ఈ స్టార్ పేరే ముందు వినిపిస్తుంది. హాలీవుడ్లో సంచలనం సృష్టించిన ఫిఫ్టీ షేడ్స్ ఫిల్మ్ సిరీస్‌లో వచ్చిన మూడు సినిమాల్లో మెయిన్ లీడ్‌గా నటించిన డకోటా జాన్సన్, ఇప్పుడు హాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరు. ఎరోటిక్ రొమాంటిక్ డ్రామా జానర్లో ‘ఫిఫ్టీ షేడ్స్’ ఒక బ్లాక్‌బస్టర్ అటెంప్ట్. తాజాగా ఈ సినిమాలకు పనిచేయడాన్ని గుర్తు చేసుకుంటూ జాన్సన్ తన బాధలు చెప్పుకుంది. ‘అబద్ధం చెప్పట్లేదు. ఈ సినిమా ఒక రకంగా నన్ను చావగొట్టింది.’ అందామె. సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో రొమాన్స్‌కు పెద్దపీట వేసిన ఈ అడల్ట్ డ్రామాలో ఒక్కో సీన్లో జాన్సన్ పాత్ర ఒక్కో రకమైన ఎమోషన్‌తో నడుస్తుంది. ఇవన్నీ ఆమెను మెంటల్‌గా విపరీతంగా డిస్టర్బ్ చేశాయట.ఇదే విషయాన్ని చెప్పుకొని పై మాటలు అంది డకోటా జాన్సన్. ఫిఫ్టీ షేడ్స్ సిరీస్ పూర్తయ్యాక అందులో నుంచి బయటపడ్డానికి థెరపీకి వెళ్లాల్సి వచ్చిందట. ఇప్పుడు ఆ థెరపీ పూర్తయ్యాక అంతా సెట్ అయ్యిందని చెప్పుకొచ్చింది. ‘నాకు నచ్చిన పాత్రలు చేద్దామంటే అవకాశాలు రావట్లేదు. అందుకే నేనే ఆ అవకాశాలను సృష్టించుకోబోతున్నా..’ అంటూ కొత్త ప్రొడక్షన్ హౌస్ మొదలుపెడుతున్నట్లు చెప్పుకుంది డకోటా జాన్సన్. ఫిఫ్టీ షేడ్స్ పాపం ఎంతపేరు తెచ్చిందో, అన్నే కష్టాలు కూడా తెచ్చిపెట్టింది ఈ హాట్ భామకు!! -
మనోవేదనకు గురై రైతు ఆత్మహత్యాయత్నం
పర్వతగిరి : వ్యవసాయబావి బాట విషయంలో పెద్దమనుషులు చేసిన తీర్మానంతో మనోవేదనకు గురైన రైతు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మండలంలోని చింతనెక్కొండలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన రైతు పెద్దకాసు బిక్షపతి ఇదే గ్రామానికి చెందిన అకినేపల్లి ఆనందచారికి చెందిన వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. అతడి వ్యవసాయ బావికి వెళ్లే బాటపై గతంలో ఆనందచారితోపాటు అతడి అన్నదమ్ములకు ఉమ్మడిగా పొత్తు ఉండేది. అయితే ఆనందచారి భూమిని బిక్షపతి కొనుగోలు చేశాక ఆ బాట మీదుగా అతడు నడిచేందుకు ఆనందచారి దాయాదులు అంగీకరించలేదు. దీంతో ఇరువర్గాలు పెద్దమనుషులను ఆశ్రయించారు. దీంతో ఆనందచారి అన్నదమ్ముళ్లకు రూ.50 వేలు చెల్లించి ఆ బాటను బిక్షపతి వాడుకోవాలని తీర్పు చెప్పారు. పొత్తుల బాటకు డబ్బులు ఎందుకు ఇవ్వాలని మనోవేదనకు గురైన బిక్షపతి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బిక్షపతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. తప్పుడు తీర్పు చెప్పిన పెద్ద మనుషులపై కఠిన చర్య తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు.