breaking news
megavat kamal
-
తండ్రే కాటేసి కడతేర్చాడు
వికారాబాద్ : రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించిన గిరిజన బాలిక సిమ్రాన్ ‘హత్యా’చారం కేసు మిస్టరీ వీడింది. చిన్నారి తండ్రి మెగావత్ కమ ల్ కన్న కూతురును కాటేసి చంపేసినట్లు పోలీ సుల విచారణలో తేలింది. నిందితుడిని పోలీ సులు రిమాండుకు తరలించారు. ఆదివారం వికారాబాద్‌లోని కార్యాలయంలో ఎస్పీ శ్రీని వాసులు, ఏఎస్పీ చందనదీప్తితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి తండాకు చెందిన సిమ్రాన్(14) మోమిన్‌పేటలోని కస్తూర్బా గాంధీ స్కూల్లో ఎనిమిదో తరగతి పూర్తి చేసింది. వేసవి సెలవులకు ఆమె చందానగర్‌లో(లింగంపల్లి) ఉన్న చిన్నమ్మ దగ్గరికి వెళ్లింది. ఈ నెల 21న ఉద యం కమాల్ కూతురును తీసుకొచ్చేందుకు అక్కడికి వెళ్లాడు. సాయంత్రం 4:15 గంటలకు తండ్రీకూతురు లింగంపల్లి స్టేషన్లో గుల్బర్గా ప్యాసింజర్ రైలు ఎక్కి వికారాబాద్‌కు రాత్రి 7.29 గంటలకు చేరుకున్నా రు. అక్కడి నుంచి నేరుగా ఎన్టీఆర్ చౌరస్తా వరకు కాలినడకన వచ్చి కూతురిని రోడ్డుపైనే ఉండమని చెప్పిన కమాల్ సమీపంలోని వైన్స్ కు వెళ్లి ఓసీ క్వార్టర్ కొనుగోలు చేసి అక్కడే తాగాడు. చందానగర్ వెళ్లే ముందు కమాల్ తన మోపెడ్‌ను వికారాబాద్ రాజీవ్‌గృహకల్పలోని మరదలు కమ్లీబాయి ఇంటి వద్ద ఉంచి వెళ్లాడు. రాత్రి 8.10 గంటలకు మోపెడ్ తీసుకొని కమాల్ స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గంమధ్యలో మోత్కుపల్లి సమీపంలోకి వచ్చేసరికి సమ యం రాత్రి 8.57 గంటలు అవుతోంది. అక్కడ దప్పికగా ఉందని కమాల్ మోపెడ్‌ను ఆపా డు.. సమీపంలోని చేతిపంపు దగ్గర తండ్రీకూతురు నీళ్లు తాగారు. అక్కడే కమాల్ తన కూతురుపై అత్యాచారం చేయాలని భావించి సిమ్రాన్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ప్రతిఘటించింది. తన కాలు కు ఉన్న ఓ చెప్పు ఊడిపోగా ఒకే చెప్పుతో రోడ్డుపైకి పరిగెత్తి కేకలు వేసింది. కొద్దిదూరం పరుగెత్తినా కమాల్ కూతురును వదిలిపెట్టలేదు. మోపెడ్‌తో వెంబడి ంచి ఇంటికి వెళ్దామని మాయమాటలు చెప్పాడు కూతురుకు. తిరిగి వాహనంపై కూర్చొబెట్టుకొని కొద్దిదూరం ప్రయాణించా డు. అకస్మాత్తుగా వాహనాన్ని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్తుండగా ఇక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నావ్ అని సిమ్రాన్ తండ్రిని ప్రశ్నించింది. మూత్ర విసర్జన చేస్తానని మోపెడ్‌ను ఆపిన కమాల్.. జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ కూతురును పొదలచాటుకు తీసుకెళ్లాడు. పొంతనలేని సమాధాలతో పోలీసులకు చిక్కిన వైనం.. కమాల్ పోలీసులు ప్రశ్నించిన ప్రతిసారి భిన్నకథనాలు చెప్పాడు. దుండగులు తనపై దాడి చేయగా స్పృహ తప్పిపడిపోయాననని, డీసీఎం డ్రైవర్ తనకు నీళ్లు తాగించాడని ఓసారి చెప్పాడు. ఆటోనంబర్ నోట్ చేసుకోలేదా..? అని ప్రశ్నించగా నీళ్లు నమిలాడు. కమాల్ సమాధాలు.. చందానగర్‌లోని బంధువుల కథనం భిన్నంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిందితుడు కమల్ ఫోన్ కాల్ డాటాను పోలీసులు పరిశీలించారు. కమాల్ పోలీసులకు పొంతనలేని సమాధాలు చెప్పాడు. దీంతో పోలీసులు మరోసారి కమాల్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరపగా తానే సిమ్రాన్‌పై అత్యాచారం జరిపి అనంతరం హత్య చేసినట్లు అంగీకరించాడు. కమాల్ గతంలో పలు నేరాలు చేశాడు. ఓ చోరీ కేసులో అతడు జైలుశిక్ష కూడా అనుభవించాడు. అదుపుతప్పాను.. కమాల్ తన కూతురుపై అత్యాచారం చేసినట్లు అంగీకరించాడు. సిమ్రాన్ మోపెడ్‌కు రెండువైపులా కాళ్లు వేసి కూర్చుందని, తన నడుము పట్టుకోవడంతో మద్యం మత్తులో అదుపుతప్పి వావివరస లేకుండా నియంత్రణ తప్పి అత్యాచారం చేసి చంపేశానని పోలీసుల ఎదుట అంగీకరించాడు. నా భర్త అమాయకుడు.. కమాల్ తన కూతురుపై అత్యాచారం చేసి చంపేశానని నేరం అంగీకరించినా, సభ్య సమాజం అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా ఆయన భార్య దేవిక వాదన భిన్నం గా ఉంది. గుర్తుతెలియని దుండగులు తన కూతురిపై అత్యాచారం చేసి చంపేశారని రోదించింది. తన భర్త మంచివాడని, కూతురిపై అఘాయిత్యం చేసి చంపే వ్యక్తి కాదని చెప్పింది. పోలీసులు ఆయనను ఈ కేసులో ఇరికించారని చెప్పడం గమనార్హం. మత్ బా.. మత్ బా.. అత్యాచారానికి యత్నిస్తున్న తండ్రిని.. సిమ్రాన్ ‘వద్దు నాన్న.. వద్దు నాన్న’(మత్ బా.. మత్ బా) అంటూ ప్రాధేయపడింది. అయినా అతడి రాక్షస మనసు కరగలేదు. నిర్దయగా కమాల్ కూతురిపై అత్యాచారం చేశాడు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన సిమ్రాన్ మూలుగుతుం డ గా కమాల్ ఆమె గొంతు నులిమి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి స్వగ్రామానికి వెళ్లిన కమాల్ తన ఒంటిపై ఉన్న దుస్తులను వదిలేసి ఉతికించాడు. సిమ్రాన్ ఎక్కడ..? తను కనిపించడం లేదని భార్య దేవిక కమాల్‌ను పదేపదే అడుగగా ఆమెకు కట్టు కథ చెప్పాడు. గుర్తుతెలియని ఐదుగురు దుండగులు తనపై దాడి సిమ్రాన్‌ను ఆటోలో తీసుకెళ్లారని నమ్మబలికాడు. అనంతరం కమాల్ రాత్రి 12.45 గంటలకు మోమిన్‌పేట్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన కూతురును ఆటోలో దుండగులు అపహరించారని చెప్పాడు. అంతకుముందు తన సెల్‌ఫోన్‌తో రాత్రి 10.37 సమయంలో 100కు ఫోన్ చేసి తన కుమార్తెను దుండగులు కిడ్నాప్ చేశారన్నాడు. శభాష్ పోలీస్.. రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన సిమ్రాన్ ‘హత్యా’చారం కేసును పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. జిల్లా పోలీసు యం త్రాంగం కంటిమీద కునుకులేకుండా పనిచేసింది. ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి కేసు ను త్వరగా ఛేదించినట్లు ఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. వికారాబాద్ డీఎస్పీ స్వామి, సీఐ రవి, మోమిన్‌పేట సీఐ రంగా, తాండూ రు, సీసీఎస్, సీఐలు, ఎస్బీ ఇన్స్పెక్టర్ మస్తాన్అలీ, ఎస్ఐలు రాజు, రవీందర్, అరుణ్‌కుమార్, నాగభూషణంతో పాటు కేసును ఛే దించిన ఐడీ పార్టీ పోలీసులను, టెక్నికల్ టీం ను ఎస్పీ శ్రీనివాసులు ప్రత్యేకంగా అభినందించారు. నేరాలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. -
కనురెప్పే కాటేసింది!
-
కనురెప్పే కాటేసింది!
గిరిజన బాలికపై అఘాయిత్యానికి పాల్పడింది తండ్రే అత్యాచారానికి ఒడిగట్టి ఆపై హత్య విచారణలో నేరం ఒప్పుకున్న తండ్రి వికారాబాద్/బంట్వారం/మోమిన్‌పేట్: కనురెప్పే కంటిపాపను కాటేసింది! కన్నతండ్రే కామాంధుడయ్యాడు. గిరిజన బాలిక ‘హత్యా’చారం కేసులో విస్తుపోయే నిజం వెలుగుచూసింది. తండ్రి మెగావత్ క మాల్ తన బిడ్డపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అఘాయిత్యానికి ఒడిగట్టిన తర్వాత.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు దుండగులు తనపై దాడి చేసి కుమార్తెను అపహరించారని అతడు కట్టుకథ అల్లినట్లు స్పష్టమైంది. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టెంపల్లి తండాకు చెందిన సిమ్రాన్(14) వేసవి సెలవుల అనంతరం సొంతూరుకు తండ్రి కమాల్‌తో కలిసి వస్తుండగా అత్యాచారం, హత్యకు గురైన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. 24 గంటల్లోనే మిస్టరీని ఛేదించారు. కమాల్ పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానించిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో నేరం చేసినట్లు అంగీకరించాడు. ఆ కత్తి, మోపెడ్ కమాల్‌వే.. సంఘటనా స్థలంలో దొరికిన కత్తితోపాటు మోపెడ్ టైర్ల గుర్తులు కమాల్ వాహనానివేనని పోలీసులు నిర్ధారణకు రావడంతో గుట్టురట్టయింది. అంతేకాకుండా రాత్రి 9 గంటలకు ఘటన జరిగితే అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఫిర్యాదు చేయకపోవడం కూడా పోలీసుల అనుమానానికి తావిచ్చింది. ఈ కోణంలోనే దర్యాప్తు సాగించిన పోలీసులు.. వికారాబాద్ రైల్వేస్టేషన్లో వీడియో ఫుటేజీని సైతం పరిశీలించారు. సాయంత్రం 7.26 గంటలకు గుల్బర్గా ప్యాసింజర్ రైలులో వికారాబాద్‌కు కమాల్ చేరుకున్నాడు. అక్కడ్నుంచి నేరుగా స్థానిక రాజీవ్ గృహకల్ప కాలనీలోని ఓ ఇంటికి వెళ్లారు. అక్కడే ఉన్న తన మోపెడ్‌ను తీసుకొని పెట్రోల్ పోయించుకుని వస్తానని చెప్పిన కమాల్.. బయటికి వెళ్లి మద్యం తాగి వచ్చాడు. తర్వాత కూతురుతో కలసి సొంతూరుకు బయల్దేరాడు. మార్గమధ్యంలో మోత్కుపల్లి గేటు సమీపంలో అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు కట్టుకథ చెప్పాడు. ఒక ఆటోలో వచ్చిన దుండగులు తనపై దాడి చేసి కూతురును అపహరించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు 30 మంది ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించి వదిలేశారు. కమాల్‌కు గతంలో పలు దొంగతనాలతో సంబంధం ఉండడం, జైలుకు వెళ్లి వచ్చిన నేరచరిత్ర ఉండడం, బలిష్టిగా ఉన్నా అతడికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో కమాల్ నేరాన్ని ఒప్పుకున్నట్టు తెలిసింది. ఐదు బృందాలతో దర్యాప్తు గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం, హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో పోలీసులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసులు ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. వేకువజామునే కమాల్‌ను మోమిన్‌పేట పోలీసు స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నించారు. ఆ తర్వాత మరోసారి విచారించడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఆదివారం విలేకర్ల సమావేశంలో ప్రకటి స్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.