breaking news
Medchal assembly constituency
-
‘నేను ప్రజల మనిషినయ్యా.. అందుకే వాణ్ని ..’
సాక్షి, హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలోని పోచారం మున్సిపాలిటీ ఏకశిలానగర్‌లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పర్యటనలో ఉద్రికత్త చోటు చేసుకుంది. కబ్జా రాయుళ్లు తమ భూముల్ని కాజేస్తున్నారంటూ పలువురు బాధితుల ఫిర్యాదతో ఈటల రాజేందర్ మంగళవారం ఏకశిలానగర్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పేదల భూముల్ని కబ్జా చేస్తున్నారంటూ ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై ఈటల రాజేందర్ దాడి చేశారు. ఆ ఘటనపై తాజాగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. పోచారం మున్సిపాల్టీ పరిధిలోని కొర్రేముల 1985లో 149 ఎకరాల భూమిని 2076 మందికి విక్రయించారు. ప్రభుత్వ ఉద్యోగులు లోన్ తీసుకొని ప్లాట్లు కొనుగోలు చేశారు. 2006లో దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వ్యవసాయ భూమిగా రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రయత్నం చేశాడు. డీపీవో అండదండతో మళ్ళీ వ్యవసాయ భూమిగా మార్చారు.ధరణి లొసుగులతో ఆప్పటి కలెక్టర్ అమాయ్ కుమార్ 9 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారి కి కట్టబెట్టే ప్రయత్నం చేశారు.రియల్ ఎస్టేట్ వ్యాపారి కిరాయి గుండాలతో కుక్కలను పెట్టీ ఇక్కడ స్థానికులను భయపెట్టే ప్రయత్నం చేశారు. బాధితులు నా దగ్గరకు వచ్చారు. సీపీకి ఫోన్ చేశాను, కలెక్టర్‌కు చెప్పాను. రాత్రి పూట ఎంపీ వస్తే ఏం పీకు** అంటూ రియల్ ఎస్టేట్ బ్రోకర్ స్థానికులను బెదరించాడు. నలభై లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకుంటే కూల్చారని ఒక అబ్బాయి ఏడుస్తూ ఫోన్ చేశారు. దీంతో నేను బాధితుడి ఇంటికి వెళ్లా. నేను వెళ్లే సమయంలో గుండాలు తాగుతూ ఇక్కడే కూర్చున్నారు. ప్రజల మనిషిగా వాడ్ని కొట్టిన.న్యాయం కాపాడాల్సిన పోలీసులు, రెవెన్యూ అధికారులు అధర్మానికి అండగా అంటున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి బాధితులకు పూర్తి న్యాయం చేయాలి. కాంగ్రెస్ నాయకుల అండతోనే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు రెచ్చిపోతున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. -
మేడ్చల్‌లో హస్తం హల్చల్
అభివృద్ధే మంత్రంగా కాంగ్రెస్ తెలంగాణవాదాన్నే నమ్ముకున్న టీఆర్ఎస్ అయోమయంలో టీడీపీ వైఎస్ సంక్షేమ పథకాలే అండగా ముందుకెళ్తున్న వైఎస్సార్ సీపీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సార్వత్రిక పోరు రసవత్తరంగా మారింది. పట్టణ, గ్రామ ప్రాంతాల మిళితమైన ఈ నియోజకవర్గంలో గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్లార్), టీడీ పీ అభ్యర్థిగా తోటకూర జంగయ్యయాదవ్, టీఆర్ఎస్ నుంచి మలిపెద్ది సుధీర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ బలపర్చిన డాక్టర్ బీవీ ప్రకాశ్ వంజరి బరిలో ఉన్నారు. అభివృద్ధే గెలిపిస్తుందని.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే విజయతీరాలకు చేరుస్తాయని కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్లార్ ధీమాగా ఉన్నారు. లీడ్ ఇండియా ద్వారా చేపట్టిన సామాజిక కార్యక్రమాలు, కేఎల్లార్ ట్రస్ట్ సౌజన్యంతో ప్రతీ ఇంటికీ రక్షిత మంచినీరు అందించడం వంటివి ఆయనకు సానుకూలంగా మారా యి. జిల్లాలోనే అత్యధికంగా రూ. 1300కోట్ల నిధులు రాబట్టిన ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్న కేఎల్లార్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే సొంత పార్టీలోనే కొందరు నేతలు వేరుకుంపటి పెట్టడం ఆయనను ఆందోళనకు గురి చేసి నా అంతిమంగా కేఎల్ఆర్కు విజయావకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులకు తోడు తెలంగాణ తెచ్చిన పార్టీ అభ్యర్థిగా పోటీచేయడం లక్ష్మారెడ్డికి కలిసొచ్చే అవకాశం ఉంది. బుజ్జగింపులతోనే సరి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇక్కడ దారుణంగా తయారైంది. టికెట్ ఆశించి భంగపడ్డ నియోజకవర్గ ఇన్చార్జి నక్కా ప్రభాకర్‌గౌడ్ టీఆర్ఎస్ గూటికి చేరడం, సీనియర్లు అలకపాన్పు ఎక్కడంతో ఆ పార్టీ అభ్యర్థి తోట కూర జంగయ్య యాదవ్‌కు అసంతుష్టులను బుజ్జగించడంతోనే సరిపోతోంది. నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న తన సామాజికవర్గం ఓట్లతో గట్టెక్కుతాననే ధీమాలో ఉన్నా రు. అయితే నేతల మధ్య సమన్వయలేమి, కొందరు దిగువశ్రేణి నాయకులు ‘కారె’ క్కడం టీడీపీని కలవరపరుస్తోంది. స్పీడు పెంచిన ‘కారు’ టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి టీఆర్ఎస్కు కొంత కలి సొచ్చే అవకాశంగా మారినా, అవి ఓట్ల రూపంలో ఎంత వరకు లాభిస్తుందో లేదోనని గులాబీ శ్రేణుల్లో అనుమా నాలు నెలకొన్నాయి. తెలుగుతమ్ముళ్లు కొందరు ‘కారె’క్కడంతో తమకు కలిసి వస్తుందని గులాబీ శిబిరం భావి స్తోంది. టీడీపీ రెబల్ అభ్యర్థి నక్కా ప్రభాకర్‌గౌడ్ తమ పంచన చేరడం తనకు అనుకూలమవుతుందని టీఆర్ఎస్ అభ్యర్థి మలిపెద్ది సుధీర్‌రెడ్డికి అంచనా వేస్తున్నాడు. కాగా ఆయన ముక్కుసూటితనం కొంత ప్రభావం చూపనుంది. వడివడిగా వైఎస్సార్ సీపీ వైఎస్ సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన ఓటర్లు వైఎస్సార్ సీపీ అభ్యర్థివైపు చూస్తుండడం అన్ని పార్టీలను ఆందోళనకు గురిచేస్తోంది. వైఎస్ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఉండడం డాక్టర్ బీవీ ప్రకాశ్ వంజరికి అనుకూలాంశంగా మారింది. గెలుపోటములు ఎలా ఉన్నా ప్రత్యర్థి పార్టీలకు ఇది కొంత ఇబ్బందిగా మారింది.