breaking news
Meat usages
-
నాగాలాండ్‌లో 99.8 శాతం మాంసాహార ప్రియులు
-
వామ్మో..నిమిషానికి అన్నికోళ్లను లాగించేస్తున్నామా? షాకింగ్ వీడియో
ప్రపంచవ్యాప్తంగా మాంసం వినియోగంపై తాజాగా షాకింగ్విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది ఏకంగా 10 వేల కోట్ల జంతువులను మాంసంగా లాగించేస్తున్నారట. దీనికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మానవులు బిలియన్ల కొద్దీ జంతువులను ఆరగించేస్తున్నారు. ఇందులో కోళ్లు అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రతిరోజూ 205 మిలియన్ల కోళ్లను తినేస్తున్నారంటే చికెన్కున్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రతి నిమిషానికి లక్షా 40వేలకు పైగా కోళ్లు మానవులకు ఆహారంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా పంది స్థానంలో పౌల్ట్రీ కోడి మాంసం వినియోగం బాగా పెరిగింది. గతంలో 12 శాతంగా ఉన్న వీటి (కోడి, బాతు, గూస్, టర్కీ కోడి మాసం) మాంసం వినియోగం వాటా ప్రపంచవ్యాప్తంగా తినే మొత్తంలో మూడింట ఒక వంతు పెరిగింది. ఏ దేశంలో మాంసాన్ని ఎక్కువగా తింటున్నారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యుఇఎఫ్) తన నివేదిక ప్రకారం అత్యంత ప్రజాదరణ పొందిన రెడ్ మీట్, గొడ్డు మాంసం, గత 50 ఏళ్లలో దాని ప్రపంచ వాటా దాదాపు సగానికి పడిపోయి 22 శాతానికి చేరింది. కానీ ఇది ఇప్పటికీ గొర్రె మాంసం కంటే దీని వినియోగం దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. ఈ డిమాండ్‌లో ఎక్కువ భాగం చైనా వంటి మధ్య ఆదాయ దేశాల నుండి వచ్చిందని, ఆర్థికవ్యవస్థ వృద్ధి చెందడంతో ప్రపంచంలోనే అతిపెద్ద మాంసం వినియోగదారుగా నిలిచింది చైనా. మరోవైపు ఐరోపా, ఉత్తర అమెరికాలో గతంతో పోలిస్తే వినియోగం మాంసం నియంత్రణలో ఉండగా, కొన్ని ప్రాంతాలలో బాగా తగ్గింది కూడా. భారత్ ఎక్కడ? జనాభాపరంగా చైనాను వెనక్కినెట్టి గత ఏడాది భారతదేశం ముందుకు దూసుకు వచ్చింది. కానీ ప్రపంచవ్యాప్తంగా మాంసం వినియోగంలో మాత్రం చాలా వెనుకబడి ఉండటం గమనార్హం. Unbeliavable! Total number of animals eaten by people globally🧐 pic.twitter.com/dB1TOklZAv — Tansu Yegen (@TansuYegen) January 21, 2024 -
అదేం ప్రాథమిక హక్కు కాదు
గోవధ నిషేధంపై కోర్టులో ప్రభుత్వ వాదన ముంబై : గొడ్డు మాంసం తినడం పౌరుల ప్రాథమిక హక్కు కాదని మంగళవారం హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. జంతువుల మాంసం వినియోగాన్ని రాష్ట్ర చట్టసభలు నియంత్రించవచ్చని చెప్పింది. ఈ మేరకు అడ్వొకేట్ జనరల్ సునీల్ మనోహర్ కోర్టుకు విన్నవించారు. బీఫ్ మాంసం రద్దును వ్యతిరేకిస్తూ కోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ‘మనిషి మాంసం కాకుండా ఏ జంతువు మాంసాన్ని అయినా తినొచ్చు’ అనేలా వ్యవహరిస్తున్న పిటిషనర్ల తీరును సునీల్ తప్పు పట్టారు. ఏ జంతువు మాంసం వినియోగాన్నయినా నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. రాష్ట్ర జంతు సంరక్షణ చట్టం ప్రకారం అడవి పంది, జింక, ఇతర జంతువుల మాంసాన్ని వినియోగించకూడద న్నారు. అయితే, పక్క రాష్ట్రాల్లో జంతు వధ నిషేధం కొనసాగుతోందని పిటిషనర్లు పేర్కొన్నారు. మాంసంపై నిషేధం విధిస్తూ ఇష్టమైన ఆహారం తినే వ్యక్తి స్వేచ్ఛను హరిస్తున్నారని సీనియర్ న్యాయవాది చినోయ్ వాదించారు. బీఫ్ ద్వారా వచ్చే పౌష్టిక ఆహారం ఇతర పదార్థాల ద్వారా కూడా తీసుకోవచ్చని ప్రభుత్వ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. జంతు సంరక్షణ చట్టాన్ని పేపర్‌కు పరిమితం చేయొద్దని కోరారు. వీఎమ్ కనడే, ఎమ్ఎస్ సోనాక్‌లతో కూడిన ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది.