దోమ తెరల కొనుగోలుకు ప్రతిపాదనలు
రేగిడి: జిల్లాలో దోమతెరలు కొనుగోలు కోసం రూ.4 లక్షలతో ప్రతిపాదనలు పంపించామని జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి కె.ఉదయ్భాష్కర్ తెలిపారు. మంగళవారం రేగిడి వచ్చిన ఆయన విలేరులతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాల్లో దోమ తెరలు పంపిణీ చేస్తామని చెప్పారు. జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పంపిణీ కోసం రూ.1.41 లక్షలతో దోమ తెరలు ఇప్పటికే కొనుగోలు చేసామని తెలిపారు. ఎచ్చెర్ల, పలాస, అంబఖండి, సంతకవిటి మండలంలోని మండాకురిటి గ్రామాల్లో డెంగ్యూ వ్యాధి ఉన్నట్టు నిర్ధారించామని, నివారణా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ జేఈ శ్రీచరణ్ పాల్గొన్నారు.