breaking news
manger chamber
-
ముగ్గురిపై దిశ తండ్రి ఫిర్యాదు
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ ఆత్మహత్య కేసులో తాజా పరిణామం చోటు చేసుకుంది. ఆమె తండ్రి సతీష్ సలియన్, దిశ మరణం గురించి పుకార్లు వ్యాప్తి చేసినందుకు గాను ముగ్గురు వ్యక్తులపై శుక్రవారం లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చట్టపరమైన అభిప్రాయాలను తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. కొంత మంది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని దిశా సలియన్ మరణంతో కలిపి అనేక వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్‌లు, సోషల్ మీడియా పోస్టులు చేస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, దిశా సలియన్ మరణ కేసుల మధ్య సంబంధం ఉందని పలువురు రాజకీయ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు తన కుమార్తె పరువు తీశారని, ఆమె గురించి పలు పుకార్లు సృష్టించారని సతీష్ సలియన్ ముంబైలోని మల్వాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా పోస్టులు తమను మానసికంగా ఎలా వేధిస్తున్నాయో ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముగ్గురు వ్యక్తులు నకిలీ కథలను ప్రచారం చేస్తున్నారని తన ఫిర్యాదులో తెలిపారు. వారిని పునీత్ వసిష్ఠ, సందీప్ మలాని, నమన్ శర్మలుగా ఆయన తెలిపారు. ఈ ముగ్గురు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. (‘సుశాంత్ సోదరి నన్ను వేధించారు’) సతీష్ సలియన్ ఇచ్చిన ఫిర్యాదును చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామని ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి. ఐటీ చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. సరైన చట్టపరమైన అభిప్రాయాలను తీసుకున్న తరువాత, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అనంతరం ఆ ముగ్గురు వ్యక్తులను పిలిచి ఈ విషయంపై దర్యాప్తు చేస్తారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన నాటి నుంచి ఆయన మేనేజర్‌గా పని చేసిన దిశ మరణంపై కూడా పలు కథనాలు ప్రచారమవుతున్న సంగతి తెలిసిందే. చదవండి: సుశాంత్ మాజీ మేనేజర్ మరణంపై సంచలన ఆరోపణలు -
పదకొండైనా తీరలేదు!
మహబూబ్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్: ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది సమయపాలనపై కలెక్టర్ గిరిజాశంకర్ దృష్టి సారించారు. ఇందులో భాగంగా ముందుగా పరిశ్రమల కార్యాలయాన్ని తనిఖీ చేయాల్సిందిగా అదనపు జేసీ డాక్టర్ రాజారాంను ఆదేశించారు. దీంతో శుక్రవారం ఉదయం 10.30 ఏజేసీ పరిశ్రమల కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఇద్దరు అటెండర్లు మాత్రమే ఉన్నారు. మిగతా అధికారులు, సిబ్బంది ఎవరూ కనిపించకపోవడంతో ఆయన ఆశ్చర్యపోయారు. అనంతరం ఏజేసీ జనరల్ మేనేజర్ చాంబర్లో కూర్చొని, సిబ్బంది రాకపై దృష్టిపెట్టాలని తన సీసీ మురళీని ఆదేశించారు. కాసేపటికి జూనియర్ అసిస్టెంట్ వినయతమ్మ, టైపిస్టు వెంకటేశ్వర్లు కార్యాలయానికి వచ్చారు. వారితో సమయం వేయించి, రిజిస్టర్లో సంతకాలు పెట్టించారు. ఆ తర్వాత ఏ అధికారి కానీ, సిబ్బంది కానీ రాకపోవడంతో ఆయన ఉదయం 11.30 గంటల వరకు కార్యాలయంలోనే వేచి ఉన్నారు. జనరల్ మేనేజర్‌తో పాటు ముగ్గురు ఏడీలు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విధులకు హాజరుకాలేదు. దీంతో ఏజేసీ ఏడీకి ఫోన్ చేసి ఎక్కడికి వెళ్లారంటూ ప్రశ్నించగా, తాను ఆఫీస్ పని మీద ఫీల్డ్‌కు వచ్చానని చెప్పారు. ఏ విషయంలో ఫీల్డ్‌కు వెళ్లారని ఏజేసీ తిరిగి ప్రశ్నించడంతో అటువైపు నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో ఆగ్రహించిన ఆయన విధులకు ఆలస్యంగా వస్తే సహించేది లేదని హెచ్చరించారు. కలెక్టర్‌కు నివేదిక... పరిశ్రమల శాఖలో పనిచేసే సిబ్బంది సకాలంలో ఎవరూ విధులకు హాజరు కాని విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఏజేసీ పేర్కొన్నారు. అలాగే ఆలస్యంగా హాజరైన వారందరికీ చార్జీమెమోలు జారీచేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక పై వారానికో కార్యాలయాన్ని తనిఖీ చేసి అధికారులు, సిబ్బంది హాజరుపై కలెక్టర్‌కు నివేదిస్తానని చెప్పారు. పరేషాన్లో సిబ్బంది... ఆకస్మిక తనిఖీలో భాగంగా ముందుగా ఏజే సీ పరిశ్రమ శాఖ కార్యాలయాన్నే ముందుగా తనిఖీ చేయడంతో కార్యాలయ అధికారులు, సిబ్బంది షాక్‌కు గురయ్యారు. తాము ఎప్పుడు కార్యాలయానికి వచ్చినా అడిగే వారే లేరనుకుంటే... ఏజేసీ తనిఖీతో తమ బండారం బయటపడిందనే పరేషాన్లో ఉన్నారు. పైగా ఈ విషయం కలెక్టర్ దృష్టికి కూడా వెళుతుండటంతో ఏంచేయాలో వారు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.