breaking news
Major Fire Broke out
-
ముంబైలో భారీ అగ్నిప్రమాదం: ఫైర్ అధికారి దుర్మరణం
ముంబై: దక్షిణ ముంబైలో జనంతో రద్దీగా ఉండే కల్బాదేవి వీధిలోని ఓ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పడానికి ప్రయత్నించిన ఒక అగ్నిమాపక అధికారి కాలిన గాయాలతో దుర్మరణం చెందారు. నాలుగు అంతస్తుల ఈ పురాతన భవనంలో పలు కుంటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇందులో వ్యాపార సంస్థలు కూడా ఉన్నాయి. భారీ స్థాయిలో వ్యాపించిన మంటల ధాటికి భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో నివాసం ఉండే అయిదుగురితోపాటు మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది మరో అయిదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో అగ్నిమాపక అధికారి ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ భవనంలో సాయంత్రం 4.20 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. పది నిమిషాలలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయడం మొదలు పెట్టాయి. రాత్రి 8 గంటల వరకు వారు మంటలను ఆర్పుతూనే ఉన్నారు. 17 ఫైర్ ఇంజన్లు, పది నీటి ట్యాంకులతో మంటలను అదుపు చేశారు. -
‘షూట్’ అవుట్!
విదేశాల్లో షూటింగ్ అనగానే ఎగిరి గంతేసి... ‘షాట్’ గ్యాప్‌లో అక్కడ ఎంజాయ్ చేసేయొచ్చనుకున్న శ్రీలంక సుందరి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మర్చిపోలేని షాక్ తగిలింది కెనడాలో. ఏకంగా రెండు రోజులు హోటల్ రూమ్‌లోనే లాకైపోయింది. పార్లమెంట్ హౌస్ వద్ద కాల్పులు జరిగిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం.. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు ఎవరూ గడప దాటడానికి వీల్లేదని హుకుం జారీ చేసింది. విశేషమేంటంటే... జాక్ బస చేసిన హోటల్‌కు సంఘటనా స్థలం రెండే కిలోమీటర్లు దూరం! దెబ్బకు షూటింగ్ ఆగిపోయి... న్యూస్ అప్డేట్స్ చూసుకోవాల్సి వచ్చిందట అమ్మడికి.