breaking news
Madhav Apte
-
భారత మాజీ క్రికెటర్ మాధవ్ ఆప్టే కన్నుమూత
ముంబై: భారత మాజీ క్రికెటర్ మాధవ్ ఆప్టే సోమవారం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. 1952–53 మధ్య కాలంలో ఓపెనర్‌గా 7 టెస్టులు ఆడిన ఆప్టే 49.27 సగటుతో 542 పరుగులు చేశారు. వెస్టిండీస్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 163 పరుగులు చేసి భారత్‌ను ఓటమి నుంచి తప్పించడం ఆయన అత్యుత్తమ ప్రదర్శన. ఈ సిరీస్‌లో విశేషంగా రాణించినా ఆ తర్వాత ఆప్టే మరో టెస్టు ఆడలేకపోయారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 67 మ్యాచ్‌లలో ఆయన 38.79 సగటుతో 3336 పరుగులు సాధించారు. 70 ఏళ్ల వయసు వచ్చే వరకు ముంబైలోని ప్రఖ్యాత ‘కంగా లీగ్’ పోటీల్లో మాధవ్ ఆప్టే ఆడటం విశేషం! ‘క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా’కు అధ్యక్షుడిగా పని చేసిన ఆప్టే... 14 ఏళ్ల వయస్సులోనే సచిన్ టెండూల్కర్ ప్రతిభను గుర్తించి పట్టుబట్టి మరీ తమ క్లబ్ తరఫున ఆడే అవకాశం కల్పించారు. త్వరలోనే ఇతను భారత్‌కు ఆడతాడంటూ భవిష్యత్తును చెప్పారు. ఆప్టే మృతి సందర్భంగా దీనిని గుర్తు చేసుకున్న సచిన్... ఆయనకు తన తరఫు నుంచి నివాళులు అర్పించాడు. -
భారత మాజీ క్రికెటర్ కన్నుమూత
ముంబై: భారత మాజీ క్రికెటర్ మాధవ్ ఆప్టే(86) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాధవ్,.. ముంబైలోని బ్రీచ్ కాండే హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. వచ్చే నెల ఐదో తేదీన 87వ ఒడిలో అడుగుపెట్టనున్న తరుణంలో మాధవ్ ఆప్టే ఇలా కన్నమూయడం కుటుంబ సభ్యుల్ని కలచి వేసింది.1950వ దశకంలో భారత టెస్టు ఓపెనర్‌గా సేవలందించిన మాధవ్ ఆప్టే ఏడు టెస్టులు ఆడారు. ఇందులో వెస్టిండీస్‌పైనే ఐదు టెస్టులు ఆడారు. వెస్టిండీస్ దిగ్గజ బౌలర్లు ఫ్రాంక్ కింగ్, జెర్రీ గోమెజ్, ఫ్రాంక్ వారెల్ వంటి అటాకింగ్‌ను ఎదుర్కొని రెండు సెంచరీలు చేశారు. కాగా, ఈ రెండు సెంచరీలు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ మ్యాచ్‌ల్లోనే చేయడం విశేషం. టెస్టుల్లో అత్యధిక ఆయన వ్యక్తిగత స్కోరు 163. ఓవరాల్‌గా 67 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన మాధవ్ ఆప్టే 3,336 పరుగులు చేశారు. వీటిలో ఆరు సెంచరీలతో పాటు 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక క్రికెట్ క్లబ్ ఆఫ ఇండియా అధ్యక్షునిగా పని చేశారు. ఆటగాళ్ల వయసు విషయంలో కచ్చితమైన నిబంధనల్ని అమలు చేశారు. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా తరుఫున 15 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్ ప్రాతినిథ్యం వహించాడు.