breaking news
luxury buses
-
‘ప్రైవేటు’ను తట్టుకుని ఆర్టీసీ నిలవాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు వాహనాల సంఖ్య కోటిన్నరను మించినందున వాటి రూపంలో ఆర్టీసీకి భారీగానే పోటీ ఉంటుందని, ఆ పోటీని తట్టుకుని ఆర్టీసీ నిలవాల్సిన అవసరం ఉందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలంటే ప్రచారం అవసరమని, ప్రజల్లోకి వెళ్లి ప్రయాణికులను తనవైపు తిప్పుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో అధికారులు, ఆర్టీసీ ఉద్యోగులు చొరవ తీసుకుని పనిచేయాలన్నారు. ఆర్టీసీ కొత్తగా సమకూర్చుకున్న 50 బస్సులను ఆయన శనివారం ట్యాంక్‌బండ్‌పై ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త బస్సులన్నింటితో పరేడ్ చేయించటం విశేషం. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాబోయే మూడు నెలల్లో మరో 760 బస్సులు కొత్తగా వస్తాయన్నారు. దీంతో ఆర్టీసీలో మొత్తం బస్సుల సంఖ్య 10 వేలకు చేరుతుందన్నారు. కరోనా, ఆర్టీసీలో భారీ సమ్మె ప్రభావంతో నష్టాలు భారీగా పెరిగాయని, ఇప్పుడిప్పుడే కొంత తగ్గుతున్నాయని మంత్రి పువ్వాడ చెప్పారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ గతంలో నెలకు రూ.100 కోట్లను మించి ఉన్న నష్టాలను ఇప్పుడు రూ.70 కోట్లకు తగ్గించామని తెలిపారు. ప్రస్తుతం సగటున రోజుకు 30 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని వివరించారు. ఇటీవల డీజిల్ సెస్‌ను మాత్రమే సవరించామని, టికెట్ చార్జీలను పెంచలేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ ఈ కొత్త బస్సుల్లో ఆధునిక ఏర్పాట్లు ఉన్నాయని, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ముందే ప్రయాణికులను హెచ్చరించే అలారం, ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, లైవ్ ట్రాకింగ్ వసతి ఉన్నాయని వివరించారు. కొద్ది రోజుల్లో 300 ఎలక్ట్రిక్ బస్సులను నగరంలో నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవీందర్, రవాణాశాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్, ఈడీలు మునిశేఖర్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, యాదగిరి, వినోద్, సీపీఎం కృష్ణకాంత్, సీఎంఈ రఘునాథరావు, సీటీఎంలు విజయ్‌కుమార్, జీవన్‌ప్రసాద్, మోహన్(అశోక్ లేలాండ్), ఎంజీ ఆటోమోటివ్స్ ఎండీ అనిల్ ఎం కామత్ పాల్గొన్నారు. -
హైద్రాబాద్ రోడ్లపై.. కొంగొత్త బస్సులు..!
-
ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయం: కేసీఆర్
హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికులందరికీ స్పెషల్ ఇంక్రీమెంట్ కల్పిస్తున్నామని ఆయన ప్రకటించారు. త్వరలోనే దాదాపు 25 వేల కిలోమీటర్ల మేర రోడ్ల పునర్నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయమని కేసీఆర్ స్పష్టం చేశారు. గతంలో తాను రవాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అక్రమ రవాణను అరికట్టి ఆర్టీసీని రూ.11 కోట్ల లాభాల్లోకి తెచ్చిన విషయం గుర్తు చేశారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో... కేసీఆర్ 80 కొత్త సిటీ మెట్రో లగ్జరీ ఏసీ బస్‌లను ప్రారంభించారు. అనంతరం బస్సు లోపలికి వెళ్లి స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మెట్రో లగ్జరీ వోల్వో బస్సులను ప్రారంభించిన కేసీఆర్
* నాలుగు రూట్లలో ఏసీ మెట్రో లగ్జరీ బస్సులు *కనీస చార్జీ రూ.15, గరిష్ట చార్జీ రూ.110 *మహిళా ప్రయాణికులకు పటిష్ట భద్రత హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో మెట్రో లగ్జరీ వోల్వో బస్సులను ప్రారంభించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే లక్ష్యంతో సిటీ రోడ్లపై 'కూల్'గా ప్రయాణం చేసేందుకు గ్రేటర్ ఆర్టీసీ ఈ బస్సులను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు ఉన్న పుష్పక్, శీతల్, నాన్ ఏసీ లోఫ్లోర్ బస్సుల కంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బస్సులు రూపొందాయి. అలాగే సిటీ బస్సుల రాకపోకలపై ప్రయాణికులకు ముందస్తు సమాచారం తెలిపేందుకు ప్రయోగాత్మకంగా వంద బస్టాపుల్లో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ బోర్డులను కూడా కేసీఆర్ ఆరంభించారు. ఒక్కో బస్సుకు రూ.కోటి చొప్పున రూ.80 కోట్లతో 80 మెట్రో లగ్జరీ బస్సులను జెఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా ఆర్టీసీ కొనుగోలు చేసింది. మెట్రో లగ్జరీ వోల్వో బస్సుల రూట్లు ఇవీ... *17 హెచ్/10 డబ్ల్లూ *113ఎం/డబ్ల్యూ *218 డి * 222