breaking news
Lincoln
-
Britain: భార్యను 224 ముక్కలుగా నరికేశాడు
లండన్: భార్యను భర్త హత్యచేసి ఏకంగా 224 ముక్కలుగా నరికి మృతదేహాన్ని మాయంచేసిన దారుణ ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. నికొలస్ మెట్సన్ (28), హోలీ బ్రామ్లీ (26) లింకన్ సిటీలోని బస్సింగ్హామ్లో ఉంటున్నారు. గత నెల 17 నుంచి బ్రామ్లీ కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆమె తనను చితకబాది వెళ్లిపోయిందని పోలీసులకు నికొలస్ చెప్పాడు. ఫ్లాట్‌ను తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో రక్తపు మరకలు, అతిగా శుభ్రం చేసినట్లు అమ్మోనియా, బ్లీచింగ్ ఆనవాళ్లు కనిపించాయి. దాంతో అతన్ని అరెస్ట్‌చేసి విచారణ మొదలెట్టారు. తనకేం తెలీదని మెట్సన్ తొలుత వాదించాడు. ఈలోపు సమీపంలోని విథమ్ నదిలో నరికిన చేయి సహా చిన్నిచిన్న శరీరభాగాలున్న ప్లాస్టిక్ బ్యాగులు కొట్టుకుపోవడం చూసి స్థానికుడు పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసు గజ ఈతగాళ్లు వాటిని సేకరించి ల్యాబ్‌కు పంపించారు. అసలేమాత్రం గుర్తుపట్టలేనంతగా హోలీ బ్రామ్లీ శరీరాన్ని పలుమార్లు పొడిచి 224 ముక్కలుగా నరికి భర్త నదిలో పడేశాడు. శరీరభాగాలను పడేయటంతో సాయపడినట్లు భర్త స్నేహితుడు జాషువా హ్యాన్‌కాక్ తన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఎట్టకేలకు భర్త తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఆమె చంపడానికి ముందు పెంపుడు కుక్క పిల్ల, పెంపుడు ఎలుకలనూ చంపేశాడు. తన మాజీ జీవితభాగస్వాములనూ మెట్సన్ హింసించినట్లు 2013, 2016, 2017 పోలీసు రికార్డుల్లో ఉంది. జంతువుల పట్ల అతను అమానుషంగా ప్రవర్తించేవాడని పోలీసు విచారణలో వెల్లడైంది. హత్యచేసి దాదాపు వారంపాటు శరీరం ముక్కలున్న బ్యాగులను దాచి తర్వాత వాటిని పడేశాడు. హత్య తర్వాత భార్య బ్యాంక్ ఖాతా నుంచి 50 పౌండ్లు విత్‌డ్రా చేసి వాడుకున్నాడు. ‘భార్యను హత్య చేస్తే భర్తకు కలిగే లాభాలేంటి?. ఆ తర్వాత నన్ను ఎవరైనా వెంబడిస్తారా?. కూపీ లాగుతారా?’ అంటూ హత్యకు ముందు కొన్ని అంశాలపై ఆన్లైన్లో సెర్చ్చేశాడు. ఈ ఆన్లైన్ సెర్చ్ హిస్టరీని సైతం పోలీసులు వెలికితీశారు. -
ఫ్యాన్స్‌కు షాకిచ్చిన ఆస్కార్ నటుడు!
లాస్ ఏంజెలిస్: హాలీవుడ్ దిగ్గజ నటుడు డానియల్ డే లెవిస్ తన అభిమానులకు షాకిచ్చారు. మూవీలు చేయడం ఆపేయనున్నట్లు మూడుసార్లు ప్రసిద్ద ఆస్కార్ అవార్డు పొందిన నటుడు డానియల్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని నటుడి వ్యక్తిగత కార్యదర్శి లెస్లీ డార్ట్ మంగళవారం ప్రకటించారు. ప్రఖ్యాత దర్శకుడు స్టీవ్ స్పిల్ బర్గ్ తీసిన 'లింకన్', 'దేర్ విల్ బి బ్లడ్', 'మై లెఫ్ట్ ఫూట్', 'గ్యాంగ్స్ ఆఫ్ ది న్యూయార్క్' మూవీలతో ఆయన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అరవై ఏళ్ల సీనియర్ నటుడి చివరి మూవీ ఈ డిసెంబర్ 25న విడుదల కానుంది. అయితే ఆ మూవీకి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. షూటింగ్ మాత్రం కొనసాగుతోంది. 14 ఏళ్ల వయసులో 1971లో విడుదలైన 'సండే, బ్లడీ సండే'తో ఇండస్ట్రీకి పరిచయమైన డానియల్ అంచెలంచెలుగా ఎదిగారు. మూడుసార్లు అస్కార్ అవార్డులను కొల్లగొట్టిన ఘనత ఆయన సొంతం. దర్శకరచయిత రెబెక్కా మిల్లర్ ను వివాహం చేసుకున్న డానియల్ కు ముగ్గురు సంతానమన్న విషయం తెలిసిందే. 'ఇన్నేళ్లుగా నన్ను అభిమానించి, నాపై ప్రేమ చూపించిన ప్రేక్షకులు మూవీ బృందాలకు ధన్యవాదాలు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఇక రంగుల ప్రపంచానికి సెలవు పలకాలని నిర్ణయించుకున్నానని' ఆస్కార్ గ్రహీత డానియల్ డే లెవిస్ అన్నారు.